E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మినిస్టర్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చిన రాజ్ 

Brahmamudi Serial Today February 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మినిస్టర్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చిన రాజ్ 
Advertisement

Brahmamudi serial today Episode:

మినిస్టర్‌ ధర్మేంద్ర గురించి రాజ్, కావ్యలను ఆలోచిస్తుంటారు. మినిస్టర్‌ నుంచి ఎలా తమ బిడ్డను తెచ్చుకోవాలో ఆలోచిస్తుంటారు. వాడి బలహీనత వాడి భార్య. మనం ఎప్పుడు నిజం చెప్పేస్తామో? వాడి నుంచి బిడ్డను ఎక్కడ తెచ్చుకుంటామో? అని భయపడి చస్తున్నాడు.. ఏదో ఒకరోజు వాడు తప్పులన్నీ ఒప్పుకుని మారిపోతాడని నాకు నమ్మకం ఉందని చెప్తాడు రాజ్‌. కానీ భార్య మీద వాడికున్న ప్రేమ .. బలహీనతలో నుంచి బలంగా మారితే వాడు ఇంకా రాక్షసుడిలా మారతాడేమో? భార్యను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తాడేమో అని కావ్య అనుమానిస్తుంది.

దీంతో రాజ్‌ వాడిని మార్చాలని.. వాడిని బుద్ది బలంతో కొట్టాలని, వాడంతటే వాడే కళ్లు తెరవాలని చెప్పింది నువ్వే కదా..? మళ్లీ ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి..? అంటాడు రాజ్. దీంతో కావ్య సంస్కారం ఉన్న వాళ్లకి ఒకటే దారి.. కానీ అలాంటి నీచులకి, తెగించిన వాళ్లకి వంద దారులు ఉంటాయి అంటుంది కావ్య. అక్కడి వరకు వస్తే వాడికంటే మనం ఒక మెట్టుపైనే ఉంటాము.. తాళి కట్టించుకున్న భార్య కోసం వాడే అంత చేస్తే.. పేగు తెంచుకున్న మమకారం కోసం మనమెంత తెగించాలి.. వాడిది స్వార్ధం.. మనది బంధం. తల్లి అనురాగం ముందు వాడి అధికారం ఓడిపోక తప్పదు. ఆ మినిస్టర్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది  అంటాడు రాజ్.

Advertisement

మరోవైపు ఒక గుడిలో తులసి, కావ్య కలిసి బిడ్డలతో ఆడుకోవడం చూసిన ధర్మేంద్ర షాక్ అవుతాడు. అది చూసిన ధర్మేంద్ర కావ్య చేతిలో ఉన్న పాపని లాక్కుని వెళ్లిపోతాడు. తర్వాత ధర్మేంద్ర టిఫిన్ చేస్తుండగా కావ్య రావడంతో తులసి హ్యాపీగా ఫీలవుతుంది. అప్పుడే పాప ఏడుస్తుంటే.. కావ్య వెళ్లి బిడ్డను ఓదారుస్తుంది.. ఇలా కలగంటాడు ధర్మేంద్ర.. వెంటనే ఉలిక్కి పడి నిద్ర లేస్తాడు. వెంటనే ధర్మేంద్ర ఈ టెన్షన్‌ భరించలేను.. తులసి ముందు తప్పు ఒప్పుకుని నిజం చెప్పాలి, నా భార్యను క్షమించమని అడగాలి. తులసిని కాపాడుకోవాలి అనుకుంటూ ధర్మేంద్ర, తులసి దగ్గరకు వెళ్తాడు. తులసి అడగక ముందే..  కావ్య, రాజ్‌ల వాళ్ల ప్రాబ్లమ్ గురించి ఆలోచిస్తున్నానని.. చెప్పగానే..

తులసి ఎమోషనల్‌ అవుతూ.. కావ్య తన బిడ్డకు దూరమై.. ఎంత వేధన పడుతుందో తెలుసా? మీరే వాళ్లకి సాయం చేస్తానని చెప్పారు కదా అంటుంది. దీంతో ధర్మేంద్ర ఎవరో  పురిట్లోనే వాళ్ల బిడ్డను మార్చేశారు అంటే వాళ్లకు ఆ బిడ్డతో ఎంత అవసరం ఉందో? వాళ్లు ఏ పరిస్థితుల్లో అలా చేశారో? వాళ్ల వైపు కూడా ఒకసారి ఆలోచించాలని కదా అంటాడు. దీంతో తులసి కోపంగా కన్నతల్లికి బిడ్డను దూరం చేసి ఆ తల్లి కన్నీళ్లకు కారణమైన వాళ్లకి మీరు సపోర్ట్ చేస్తున్నారా..? కారణం ఏదైనా సరే.. వాళ్లు మీకు కనక దొరికితే నేను వాళ్లను జైళ్లో వేయిస్తాను.. చివరికి మీరైనా సరే శిక్ష పడాల్సిందే అంటూ తులసి వార్నింగ్‌ ఇవ్వడంతో ధర్మేంద్ర షాక్‌ అవుతాడు. తులసి వెళ్లిపోగానే.. ధర్మేంద్ర రాజ్‌కి ఫోన్ చేసి నేను ఇంత చెబుతున్నా, ఇంత తాపత్రయపడుతున్నా.. నా పాపని తీసుకెళ్లడానికి సిద్ధపడుతున్నావా అని ఫైర్ అవుతాడు. నేను తీసుకెళ్తానన్నది మీ పాపని కాదు.. నా పాపని అని రాజ్‌ చెప్పగానే.. ధర్మేంద్ర కోపంగా పాపని ఇవ్వలేను.. నా భార్య బతకదు. నా భార్యకు నిజం చెప్పలేను, ఈ ప్రపంచంలో నాకు నా భార్య కన్నా ఏది ఎక్కువ కాదు. కావాలంటే నా పదవినైనా వదులుకుంటాను కానీ నా పాపని వదులుకోను, నా భార్యను చంపుకోను అంటూ ధర్మేంద్ర గట్టిగా చెప్పగానే..

Advertisement

రాజ్‌ కూడా కోపంగా నీ భార్య మాత్రం ఆరోగ్యంగా ఉన్న పాపతో ఆనందంగా ఉండాలి.. నా భార్య మాత్రం తన కడుపున పుట్టిన బిడ్డను దూరం చేసుకుని సంబంధం లేని బిడ్డను చూసుకుంటూ కన్నీళ్లతో బతకాలా? అంటాడు దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. రేపే పాపకు ఆపరేషన్‌ చేయిస్తున్నాం.. నీకు ఇచ్చిన గడువు కూడా రేపటితో ముగుస్తుంది నువ్వు మా పాపను మాకు అప్పగిస్తే సరే లేదంటే మీ ఆవిడకు నిజం చెప్పేస్తామని రాజ్‌ కాల్‌ కట్‌ చేస్తాడు. తర్వాత పాపను తీసుకుని తులసి దగ్గరకు వెళ్లి పాపకు బారసాల చేస్తున్నామని మీరిద్దరూ రావాలని ఆహ్వానిస్తుంది. తర్వాత మినిస్టర్‌ ధర్మేంద్ర, రాజ్‌ వార్నింగ్‌ ఇచ్చిన విషయం రుద్రాణికి చెప్తాడు. దీంతో రుద్రాణి ఇక విషయాన్ని నాకు వదిలేయండి నేను చూసుకుంటానని చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×