E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్ ను ఇంట్లోంచి తోసేసిన భూషణ్ 

Brahmamudi Serial Today march 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్ ను ఇంట్లోంచి తోసేసిన భూషణ్ 
Advertisement

Brahmamudi serial today Episode: 

వాటర్‌ కోసం ట్యాంకర్‌ దగ్గరకు వెళ్లిన రాజును ఆడవాళ్లందరూ కలిసి కొట్టబోతుంతే రాజు కూడా వాళ్లతో గొడవ పడతాడు. అందరి మధ్య ఫైట్‌ జరుగుతుంది. రాజు మధ్యలోంచి తప్పించుకుని వాటర్‌ పట్టుకుని వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లిన రాజు వాళ్ల నాన్నతో ఇదిగో నాన్న ఆ ఆడగుంపుతో నేను పడలేకపోతున్నాను ఇంకోసారి నన్ను నీళ్లకోసం పంపించొద్దు అని చెప్పగానే.. ఆయన ఆశ్చర్యంగా అదేంట్రా నీతోనే పడలేకపోతున్నామని వాళ్లు కంఫ్లైంట్‌ ఇచ్చారు అని చెప్పగానే.. నా మీద కంఫ్లైంట్‌ ఇచ్చారా..? అని అడగ్గానే.. అవును రోజు నువ్వు వాళ్లను మాయ చేసి నీళ్లు పట్టుకొస్తున్నావట. నువ్వు చేస్తున్న గొడవలకు వాళ్ల మొగుళ్లతో విడాకులు అయ్యే పరిస్థితి వస్తుందని మీ అమ్మతో ఒకటే చెప్తున్నారు అనగానే.. అబ్బో అంతకుముందు ఏదో వాళ్ల మొగుళ్లతో సంపారం చేసినట్టు అంటాడు రాజు

దీంతో వాళ్ల నాన్న ఆడవాళ్లతో గొడవపెట్టుకుని తన్నులు తింటావు సిగ్గు లేదురా నీకు అంటాడు. దీంతో అందుకే రేపటి నుంచి నేను నీళ్లకు వెళ్లను అంటాడు రాజు. నీళ్లకు వెళ్లనంటావు కానీ వాళ్లతో గొడవ పెట్టుకోని అని మాత్రం చెప్పవా అని వాళ్ల నాన్న అడగ్గానే.. గొడవపెట్టుకోకుండా నీళ్లు తీసుకురావడమంటే.. ఎగ్జామ్‌ రాయకుండా పాస్‌ అవ్వడం లాంటిది.. రెండు కుదరవు నాన్న అని చెప్పగానే.. మరి నీళ్లు ఎవరు తెస్తారు అని నాన్న అడగ్గానే.. ఉన్నాడుగా మీ ముద్దుల చిన్న కొడుకు అని చెప్పగానే.. వాడు ఉన్నాడు కాబట్టి వంతులు వేసుకుంటున్నావు.. రేపు నీకు పెళ్లి అయ్యాక పెళ్లాం వస్తుంది. అప్పుడు మాత్రం దాని కోసం వెళ్లవా..? అని చెప్తుండగానే.. లక్ష్మీ వస్తుంది. పెళ్లి అయ్యాక కూడా వాడు ఇదే బస్తీలో ఉండాలని మీరు ఫిక్స్‌ అయ్యారా..? అంటుంది. దీంతో రాజు నా మనసులో మాట కరెక్టుగా చెప్పావు అమ్మ అంటాడు. దీంతో వాళ్ల నాన్న వీడి ముఖానికి ఈ బస్తీలో పిల్ల కాకుండా కోటలో మహరాణి వస్తుందా..? అంటాడు.

Advertisement

దీంతో రాజు అవును నా కోసం మహరాణే వస్తుంది అని చెప్తాడు.  దీంతో రాజును వాళ్ల నాన్న చెడామడా తిడతాడు… ఆ మహరాణి ఎక్కుడుందో.. అని అడగ్గానే.. ఏదో ఒక కోటలో ఏసీ గదిలో పనివాళ్లతో కోల్డ్ కాఫీ తాగుతూ నా కోసం కలలు కంటూ ఉంటుంది అని చెప్తుంటే.. ఇందు ఇంట్లో రుద్రాణి ఫోటో తుడుస్తూ ఉంటుంది. స్వాతి వచ్చి ఇందును పిలుస్తుంది. వీళ్లేమైనా దేశభక్తులా..? రోజూ తుడిచి దండేసి దండం పెట్టుకోవడానికి వీళ్ల గురించి నాన్నమ్మ నాకు పూర్తిగా చెప్పింది.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే టైప్‌ అంట కదా..? అనగానే.. ఇందు భయంగా ఊరుకోవే ఏంటా మాటలు మళ్లీ రేఖ ఆంటీ విన్నదంటే.. ఇల్లు పీకి పందిరేస్తుంది. దానికి నువ్వు భయపడతావేమో.. నేను కాదు అంటుంది స్వాతి. అదిగో రేఖ ఆంటీ అని ఇందు అనగానే.. ఏది ఎక్కడ..? అంటూ స్వాతి భయపడుతుంది. ఇందు నవ్వుతుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు లాగుతుంటే.. రుద్రాణి ఫోటో కింద పడి పగిలిపోతుంది. అంతా చూసి భయపడుతుంటారు..

అప్పుడే రేఖ పై నుంచి వస్తుంది. పగిలిపోయిన రుద్రాణి ఫోటో చూసి కోపంగా మా అమ్మ నాకు దూరం అయినప్పటి నుంచి తనను ఈ ఫోటోలోనే చూసుకుంటున్నానని నీకు బాగా తెలుసు.. అయినా దీన్ని పగులగొట్టావంటే నేను అంటే భయం పోయిందా..? లేకపోతే మీ నాన్నమ్మ మాటలు విని ధైర్యం వచ్చిందా..? అనగానే.. అది పగిలింది అద్దమే కదా నేను మళ్లీ సరి చేస్తాను.. అనగానే.. పగిలిన అద్దమే కనిపిస్తుంది కానీ కింద పడిన మా అమ్మ ఫోటో కనిపించడం లేదా..? నీకు అంటూ కొట్టబోతుంటే.. అపర్ణ కోపంగా రేఖను తిడుతుంది. నా మనవరాలి మీద చేయి పడితే నేను ఊరుకోను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది..కావ్య బతికి ఉన్నప్పుడు మీ అమ్మను ఏం చేసిందో గుర్తుంది కదా..? దాని రక్తమే ఇందులో ఉందని మర్చిపోకు అంటూ వార్నింగ్‌ ఇస్తుంది.

Advertisement

దీంతో రేఖ కోపంగా మీలో పుట్టుకొచ్చిన ఈ ధైర్యాన్ని ఈరోజే ఇప్పుడే చంపేస్తాను భూషన్‌ అంటూ తన భర్తకు సైగ చేయగానే.. భూషన్‌ వచ్చి సుభాష్‌ ను బయటకు మెట్ల దగ్గరకు తీసుకెళ్లి వదిలేస్తాడు సుభాష్‌ కింద పడిపోతాడు.. కావ్య, అపర్ణ భయంగా బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లి సుభాష్‌ ను పైకి లేపి కుర్చీలో కూర్చోబెడతారు. తర్వాత అందరూ బాధపడుతుంటే.. స్వాతి వచ్చి అందరినీ నవ్విస్తుంది.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×