E-Paper
Advertisement

Podarillu Maha : మహానా మజాకా.. జడ్జీలు ఇంప్రెస్..గ్రేట్ అంతే..

Podarillu Maha : మహానా మజాకా.. జడ్జీలు ఇంప్రెస్..గ్రేట్ అంతే..
Advertisement

Podarillu Maha : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో ఈమధ్య పొదరిల్లు సీరియల్ కూడా చేరింది. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ అతి కొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సంపాదించుకుంది. ప్రస్తుతం టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది సీరియల్. ఈ సీరియల్ హీరోయిన్ మహాలక్ష్మి గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తూనే ఉంటుంది. బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ తో పాటుగా.. పలు స్పెషల్ ఈవెంట్లలో కూడా ఈమె సందడి చేస్తూ తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ వస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారమవుతున్న కుక్కు విత్ జాతి రత్నాలలో కంటెస్టెంట్ గా పాల్గొంటుంది. ఇవాల్టి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో మహాలక్ష్మి ఎవరిని ఏమన్నదో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

మహా వంటకు జడ్జీలు ఫిదా..

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఆహా ఓటీటీ సంస్థ సినిమాలు మాత్రమే కాదు.. ప్రేక్షకులను ఎంటైన్మెంట్ చేసే ప్రోగ్రాములు కూడా ఎక్కువగా ప్రసారమవుతున్నాయి.. ఇప్పటికే ఎన్నో రకాల ప్రోగ్రామ్లలో బుల్లితెర సెలబ్రిటీలు ఎంట్రీస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా ఇక్కడ ప్రసారం అవుతున్న కుకూ విత్ జాతి రత్నాలు షో కి సంబంధించిన ప్రోమో ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో అందరూ డిఫరెంట్ గెటప్ లో రావడంతో పాటుగా జనాలని ఎంటర్టైన్మెంట్ చేసేలా కామెడీని పంచుతారు. చివరగా తమ అమూల్యమైన వంటతో ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటుగా రోజుకో గతంలో కనిపిస్తూ జనాలకి పిచ్చెక్కిస్తుంటారు. ఇవాళ జరగబోతున్న ఎపిసోడ్ లో  జనాలకి పిచ్చెక్కిచ్చేలా డిఫరెంట్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఇవాళ జరగబోతున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో మహాలక్ష్మి తన వంటలతో జడ్జిలను ఆకట్టుకుంది.. ఆమె చేసిన చికెన్ తో చేసిన   కొత్త వంటపై ప్రశంసలు కురిపించారు. వీడియోను చూసిన మహాలక్ష్మి అభిమానులు మహా అంటే ఆ మాత్రం ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి మహాలక్ష్మి తన అద్భుతమైన వంటతో జడ్జీలతో పాటుగా యావత్ సీరియల్ అభిమానులకి కూడా బాగా కనెక్ట్ అయింది.

మహా తెలుగు రెమ్యూనరేషన్..? 

Advertisement

పొదిరిల్లు సీరియల్ హీరోయిన్ మహాలక్ష్మి అలియాస్ కృతిక ఉమా శంకర్ కన్నడ ముద్దుగుమ్మ. అక్కడ పలు సీరియల్స్లలో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈమె నటించిన సీరియల్స్ అన్నీ కూడా సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకోవడంతో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది.. మగువా ఓ మగువా అనే సీరియల్తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది. ఆ సీరియల్ మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో ఆమెకు రెండవ సీరియల్ నటించే అవకాశం కూడా దక్కింది. ఆ సీరియలు పోదరిల్లు. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన ఈ సీరియల్ రోజురోజుకీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.. మహాలక్ష్మికి ఇది రెండో సీరియల్ కావడంతో రెమ్యూనికేషన్ కూడా రెండింతలు అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు సీరియల్ లో నటించిన ఒక్క రోజుకి 60వేల వరకు రెమ్యూనరేషన్ తీ సుకుంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే సంచలనంగా మారింది.. ఇకముందు మహాలక్ష్మి ఎలాంటి ప్రాజెక్టులలో కనిపించబోతుందో చూడాలి..

Related News

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Big Stories

Advertisement
×