E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వేదవతికి నిజం చెప్పిన నర్మద.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. చందు మాటతో కన్నీళ్లు..

Illu Illalu Pillalu Today Episodes: వేదవతికి నిజం చెప్పిన నర్మద.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. చందు మాటతో కన్నీళ్లు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 12th:రామరాజు నువ్వు మంచిపనికే చేశావు కానీ వాళ్లు అంత మంచినీ తీసుకునే వాళ్ళు కాదు.. మనము చేతకాకే కేసు వాపసు తీసుకున్నామని వాళ్ళు విర్రవీగుతారు. ఈ విషయంలో మాత్రం నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను అని రామరాజు అనగానే నన్ను క్షమించండి నాన్న అని అమూల్య అంటుంది. నా పిల్లలు నా కుటుంబంతో నన్ను కలపాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.. నేను ఎంత చేసినా కూడా వాళ్ళకి దగ్గర కాలేకపోతున్నాను అని వేదవతి సంతోషంలోనే బాధ పడిపోతూ ఉంటుంది.. కేసు వాపస్ తీసుకునింది అని తెలియదని నర్మదా ప్రేమలు అమూల్య ఎందుకు ఇలా చేసింది అని ఆలోచిస్తూ ఉంటారు.. మరి వల్లి ఆ విశ్వం భద్ర వాళ్లతో మళ్ళీ కలిసి పోతుందా..? లేదంటే చందు కు ఇంకా దూరమవుతుందా అన్నది సస్పెన్స్ గా మారింది..

విశ్వం అమూల్యను ప్రేమిస్తాడా..?

అమూల్య తనని ఎందుకు బయటకు తీసుకుని వచ్చింది అన్నది అర్థం కావడం లేదు అని విశ్వం తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. నన్ను ఇరికించే ఛాన్స్ వచ్చినా కూడా అమూల్య నన్ను సేఫ్గా బయటికి తీసుకుని వచ్చిందంటే ఏదో జరుగుతుంది అని అమూల్య ఫోటో దగ్గరికి వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడు విశ్వం. అప్పుడు అక్కడికి వచ్చిన రేవతి అలాగే వాళ్ళ అత్తయ్య అమూల్య నేనెందుకు విడుదల చేసింది. నీ మీద పెట్టిన కేసు ని వాపస్ తీసుకున్న తెలుసా అని వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది. నిన్ను ఇష్టపడే లేకపోతే నీకు భయపడే కాదు మీ అమ్మ అమూల్యను బతిమిలాడుకుంటే ఈ కేసును వాపస్ తీసుకుంది అని నిజం చెప్తుంది.. మీ అమ్మ అమూల్య దగ్గరికి వెళ్లి నా కొడుకుని ఎలాగైనా కాపాడాలి అని కోరుకుంది. తల్లి మనసు చూసి కరిగిపోయిన అమూల్య నీ మీద పెట్టిన కేసులు వాపస్ తీసుకుంది ఇకమీదటైనా ఆ ఇంటి జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది అని వార్నింగ్ ఇస్తుంది..

ఒక్క ఛాన్స్ ఇస్తే బెటర్ కదా..

Advertisement

అమూల్య ఎందుకు విశ్వంపై పెట్టిన కేసును వాపస్ తీసుకుందని అందరూ అడుగుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీవల్లి రెండు కుటుంబాల మధ్య గొడవ ఎందుకు అని అనుకుందేమో అని అంటుంది. తప్పులు మీద తప్పులు చేసిన విశ్వం ని మళ్లీ ఇంకొక ఛాన్స్ వచ్చి మార్చేలా ప్రయత్నాలు చేస్తుంది అని చందు సీరియస్ అవుతాడు. తప్పులు మీద తప్పులు చేస్తూ పోతుంటే ఇలా ఛాన్స్ ఇస్తే మళ్లీ నెత్తినెక్కి కూర్చుంటారు అని వల్లిని ఉద్దేశించి అంటాడు. తగుదులమ్మ అంటూ వచ్చి ఏదో ఒకటి వాగుతున్నావే తప్ప.. కొంచమైన బుర్ర పెట్టి ఆలోచించవా అని వేదవతి వల్లికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. వల్లి పై అందరూ సీరియస్ గా చూడటంతో భయపడిపోతుంది.

ప్రేమ పై ధీరజ్ కు అనుమానం..

ప్రేమ బయట కూర్చుని ఫ్రూట్స్ తింటూ ఉండగా ధీరజ్ కర్నార్పకుండా చూస్తాడు. ఏంట్రా అలా మింగేసేలా చూస్తున్నావు. నీకు కావాలంటే తినొచ్చు కదా నన్ను ఎందుకు తినేలా చూస్తున్నావు అని ప్రేమ అంటుంది.. ఇదంతా నీ ప్లాన అని ధీరజ్ అడుగుతాడు. ఏంటి నా ప్లాన్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని ప్రేమ అయోమయంగా అడుగుతుంది. మీ అన్నయ్య మీద పెట్టిన కేసుని అమూల్య వాపస్ తీసుకునేలా చేసింది నువ్వే కదా నిజం చెప్పు అని అడుగుతాడు. ఆ మాట వినగానే ప్రేమ దిమ్మ తిరిగిపోయేలా షాక్ అవుతుంది.. నేను ప్రమాణం చేస్తాను రా నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు అని ప్రేమ టెన్షన్ పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. తర్వాత ఒక్కసారిగా ధీరజ్ నవ్వడంతో అరె ధీరజ్ నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావా అని వాళ్ళిద్దరు కొట్టుకుంటూ సరదాగా ఉంటారు.. అప్పుడే అక్కడికి నర్మదా వేదవతులు వచ్చి మీ సరసాలు ఆపండి అని అనగానే ఇద్దరు సిగ్గు పడిపోతూ ఉంటారు..

Advertisement

వేదవతికి నిజం చెప్పిన నర్మదా..

ఈరోజు జరిగిందానికి ప్రేమని నువ్వు ఎక్కడ తిడుతున్నావో మీరిద్దరు ఎక్కడా కోట్లాడుకుంటున్నారు అని మేము కంగారు పడిపోతూ ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ చూస్తే మీరిద్దరూ చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నారు. నా చిన్న కొడుకు కోడలు ఇద్దరు ఇలా కలిసిపోయి ఉండడం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పాలా వాళ్ళు ఇంకా బాగా కలిసి పోయారు అని నర్మదా నిజం చెప్పబోతుంది. ధీరజ్ కి 10 లక్షలు ప్రేమ ఇచ్చిన విషయం మీకు తెలుసు కదా అది ఎలా వచ్చిందో తెలుసా అని నర్మదా అంటుంది. ప్రేమ డాన్స్ కాంపిటీషన్లో గెలిచి ఆ పది లక్షలు ధీరజ్ కి ఇచ్చి కారుని మళ్ళీ తెచ్చుకునేలా చేసింది. ఏంటే బాంబు లాంటి వార్త చెప్పావు నా కొడుకు ఇన్ని రోజులు నాకు అన్ని చెప్తున్నాడు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అంటే నాకు చాలా బాధగా ఉంది అంటూ వేదవతి బాధపడిపోతూ ఉంటుంది.

వల్లిని కొట్టిన వేదవతి..

వీళ్ళందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా వల్లి అక్కడకు వచ్చే నిలబడుతుంది. అది చూసి నన్ను నర్మదా వల్లి అన్ని విన్నట్టుంది ఇప్పుడు మావయ్యకి చెప్తుందేమో అని కంగారు పడిపోతూ ఉంటారు.. అది చూసిన వేదవతి కోపంగా వల్లి దగ్గరికి వెళ్లి చాటుగా వినడం ఇప్పటికీ మానవా నువ్వు అని వల్లి చెంప పగలగొడుతుంది.. ఎందుకు కొట్టారు అత్తయ్య నేను పాటలు వింటూ పని చేసుకుంటున్నాను అని వేదవతితో అంటుంది.. ఈవిడ నన్ను మళ్ళీ కొట్టేసింది అని చాలా బాధపడిపోతూ ఉంటుంది వల్లి. ఇక చందు బయటికి వెళ్లి పడుకోడానికి అన్ని తీసుకుని వెళుతుండగా మళ్లీ అడ్డుపడుతుంది. బావ ఎక్కడికి వెళ్తావు అని మళ్లీ అడగగానే చందు సీరియస్ అవుతాడు. రోజు కొత్తగా బొట్టు పెట్టి చెప్పాలా మనిద్దరం బయట వారికి మాత్రమే భార్యాభర్తలం అని చెందు అనగానే మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :మహానా మజాకా.. జడ్జీలు ఇంప్రెస్..గ్రేట్ అంతే..

Related News

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి మనోహరి గురించి సరస్వతి నిజం చెప్తుందా..?  

Big Stories

Advertisement
×