E-Paper
Advertisement

Vizag Earth tremors: విశాఖలో భూ ప్రకంపనలు.. భయంతో ప్రజలు పరుగులు, రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదు

Vizag Earth tremors: విశాఖలో భూ ప్రకంపనలు.. భయంతో ప్రజలు పరుగులు, రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదు
Advertisement

Vizag Earth tremors: ప్రపంచవ్యాప్తంగా భూప్రకంపనలు జోరందుకున్నాయి. ఎప్పుడు.. ఏ ప్రాంతంలో ప్రకంపనలు వస్తున్నాయో తెలియని పరిస్థితి. ఇటీవల జరుగుతున్న సంఘటనలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. తాజాగా విశాఖపట్నంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

విశాఖలో భూ ప్రకంపనలు-ఏపీలోని సాగర తీరంలో భూప్రకంపనలు చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. వైజాగ్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకుంది. ముఖ్యంగా తాటిచెట్లపాలెం, హెచ్‌బి కాలనీ, ఈస్ట్ పాయింట్ కాలనీ, సీతమ్మధార తోపాటు పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలను వచ్చాయి. అయితే స్వల్పంగా వచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement

వైజాగ్ సిటీలో వణికిన పలు ప్రాంతాలు-ఎలాంటి  ఆస్తి-ప్రాణనష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు  ఇంకా రాలేదు. భూప్రకంపనలు రిక్టర్ స్కేలుపై  4.5 తీవ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రశాంతంగా ఉన్న సాగర తీరంలో ఒక్కసారి ప్రకంపనలు రావడంతో ప్రజలు హడలిపోయారు.

బంగాళాఖాతంలో భూకంప కేంద్రం-నార్మల్‌గా విశాఖ సిటీ వాసులు కంపెనీల్లో విధులకు వెళ్లేవారు వేకువజామున నిద్ర లేస్తుంటారు. ఉన్నట్లుండి ఉదయం 5 గంటల సమయంలో భూమి లైట్ గా షేక్ కావడంతో పిల్లలతోపాటు పెద్దలు రోడ్లపైకి పరుగులు తీశారు. బంగాళాఖాతంలో  దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం  కేంద్రీకృతమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

Advertisement

భౌగోళికంగా విశాఖ సిటీ సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రకంపనలు రావడం సహజమేనన్నది నిపుణుల మాట. సముద్రంలో అంతర్గత నీటి ప్రవాహాల ఒత్తిడి-భూగర్భంలో టెక్టోనిక్ ఫలకాల్లో కదలికల వల్ల తీరప్రాంతాలపై ప్రభావం పడుతుందని అంటున్నారు. గతంలో చిన్న చిన్న భూ ప్రకంపనలు వచ్చాయి.

ALSO READ: వియత్నాం బోటు ప్రమాదంలో ఏపీ పర్యాటకులు.. రంగంలోకి దిగిన నారా లోకేష్!

సరిగ్గా 45 రోజుల కిందట ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెల్సిందే.  ప్రస్తుత సీజన్‌లో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని చెబుతున్నారు. ఇటీవల వెనిజులా, జపాన్ దేశాల్లో భారీ భూకంపాలు చోటు చేసుకున్నాయి. వెనిజులాలో వచ్చిన వరుస భూకంపాల వల్ల ఇప్పటివరకు 4 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు నివేదికలు చెబుతున్నాయి.

 

 

Related News

పబ్లిసిటీ పిచ్చి తప్ప ప్రజల కష్టాలు పట్టవా? సీఎం చంద్రబాబుపై బొత్స ఫైర్!

గుంటూరు ల్యాండ్ వివాదం.. చంద్రబాబుకు జోగి రమేష్ ఓపెన్ ఛాలెంజ్.. దమ్ముంటే ఎంక్వైరీ వేసుకోండి!

రాయలసీమ అభివృద్ధిపై.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజన్!

విజయసాయిరెడ్డి ఎక్కువగా ఊహించుకోవద్దు.. పబ్లిసిటీ కోసమే-సజ్జల కౌంటర్ ఎటాక్

షాకైన వైసీపీ పెద్దలు.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై కేసు, అసలు ఏం జరిగింది?

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్ మాటేంటి?

జై కొడుతూనే జేబులు కొట్టేశారు.. మంత్రుల పర్యటనలో జేబు దొంగల హల్‌చల్

తాకట్టు ఉంగరం గొడవ ప్రాణాలు తీసిందా? వేల్పూరు దంపతుల ఆత్మహత్య వెనుక అసలు కథ!

Big Stories

Advertisement
×