E-Paper
Advertisement

ఇంగ్లండ్ బౌల‌ర్ల దెబ్బ‌కు..క్రీజులో ఉండ‌టానికే దూబే వ‌ణికిపోతున్నాడు

ఇంగ్లండ్ బౌల‌ర్ల దెబ్బ‌కు..క్రీజులో ఉండ‌టానికే దూబే వ‌ణికిపోతున్నాడు
Advertisement

Kris Srikkanth criticized Shivam Dube:  అందరూ ఊహించినట్లుగానే జరిగింది. ఐర్లాండ్ చేతిలో జరిగిన పరాభవం… ఇంగ్లాండ్ గడ్డపై కూడా ఎదురయింది. దాదాపు 15 రోజుల వ్యవధిలోనే టీమిండియా రెండు సిరీస్ లలో వైట్ వాష్ అయింది. నిన్న జరిగిన చివరి మ్యాచ్ లో అయినా టీమిండియా గెలుస్తుంది అనుకుంటే… అక్కడ కూడా మనోళ్లు మ్యాచ్ వదిలేశారు. ఇంగ్లాండ్ ( England) చేతిలో చివరి మ్యాచ్ లో 56 పరుగులు తేడాతో ఓటమిపాలైంది ఇండియా. ఈ క్రమంలో 4-0 తేడాతో అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. అయితే టీమిండియా ( Team India) ఓడిపోయిన నేపథ్యంలో ఆల్రౌండర్ శివమ్ దూబే పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కృష్ణమాచారి శ్రీకాంత్. ఫాస్ట్ బౌలర్లు అంటే మనోడు వణికిపోతున్నాడని.. త్వరగా ఔట్ అయి, డగౌట్ లో కూర్చునేందుకే ప్రయత్నిస్తున్నాడని హేళన చేశారు. స్పిన్నర్లను తప్ప ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కోవడంలో శివమ్ దూబే (Shivam Dube) నిఫలమవుతున్నాడని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో శివమ్ దూబేపై క్రిస్ శ్రీకాంత్ (Kris Srikkanth) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

ఇంగ్లండ్ బౌల‌ర్ల దెబ్బ‌కు..క్రీజులో ఉండ‌టానికే దూబే వ‌ణికిపోతున్నాడు

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదవ టి20 నేపథ్యంలో మొదట ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 257 పరుగులు సాధించారు. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేసింది టీం ఇండియా. దీంతో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఓడిపోవడం కాకుండా ర్యాంకింగ్స్ లో కూడా దిగజారింది. అయితే నిన్నటి మ్యాచ్ లో మరోసారి విఫలమైన శివం దుబే 14 పరుగులకు వెనుతిరిగాడు. ఈ క్రమంలో అతనిపై క్రిస్ శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ మైదానాలు చూసి శివం దుబే భయపడిపోతున్నాడని బాంబు పేల్చారు. ఇండియన్ పిచ్ లకు అలవాటు పడి… ఇక్కడ ఆడడం లేదని ఫైర్ అయ్యారు.

ఐదవ టి20 సందర్భంగా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం లో శివం దూబే వీక్నెస్ బయటపడిందన్నారు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు భయపడిపోయి… ప్యాంటు తడుపుకుంటున్నాడని హేళన చేశారు. తొందరగా ఔట్ అయి… డగౌట్ లో కూర్చునేందుకు ట్రై చేశాడని, చురకలు అంటించారు. అతని ముఖంలో భయాందోళన స్పష్టంగా కనిపించిందన్నారు. ఇలాంటి వాళ్లు టీమ్ ఇండియాకు పనికిరారని చురకలు అంటించారు. ఇది ఇలా ఉండగా ఐదవ టి20 నేపథ్యంలో చేతులకు వచ్చిన క్యాచ్ కూడా శివం దుబే వదిలేశాడు. మూడు పరుగుల వద్ద ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ ఓ క్యాచ్ ఇచ్చాడు. దాన్ని వదిలేయడంతో.. అతడు సెంచరీకి చేరువయ్యాడు. ఇక్కడ టీమిండియా కొంప మునిగింది.

Advertisement

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

Related News

నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

టీమిండియా ఫీల్డింగ్ కాస్త, కామెడీ షోగా మారిపోయింది

ట్రాఫిక్ లో చిక్కుకున్న టీమిండియా..ఓట‌మి భ‌యంతో డ్రామాలంటూ ఇంజ‌మామ్ సంచ‌ల‌నం!

రోకో కాంబోను త‌ట్టుకోలేం…ఆసియా కప్ 2027 టీ20 ఫార్మాట్ లో నిర్వ‌హించాల్సిందే

రోనాల్డో కంటే ధోనికే ఎక్కువ ఫ్యాన్స్‌..కోహ్లీ, రోహిత్ లు కూడా జుజుబీ

టీమిండియాకు RCB ప్లేయ‌ర్ల శాపం…ఆ జ‌ట్టు ప్లేయ‌ర్లే ముంచేస్తున్నారు క‌ద‌రా

మ‌ళ్లీ ఛాన్స్ రాదు..ఇప్పుడే టీమిండియాను పాకిస్తాన్ ఓడించాలి

Big Stories

Advertisement
×