Kollywood : తమిళ ఇండస్ట్రీలోని స్టార్ హీరో పై కేసు నమోదు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. డబ్బులు చెల్లించలేదని నిర్మాణ సంస్థతో పాటుగా ఆ సినిమాలో పనిచేసిన హీరోపై కూడా పోలీస్ కేసు నమోదు అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలానే కొన్ని కేసులు నమోదవడం విశేషం.. అయితే కోలీవుడ్ ఇలాంటి ఘటనలు కొన్ని రోజులుగా రిపీట్ అవుతూనే ఉన్నాయి.. ఇప్పుడు మరోసారి ఇదే చర్చ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య నటించిన చిత్రం ‘ అనంత్ కాడు ‘. ఈ మూవీ షూటింగ్ టైమ్ లో తీసుకున్న బకాయిలను అడిగితే తమ మేనేజర్ ను బెదించారని ఆరోపిస్తూ నిర్మాణ సంస్థ తో పాటుగా హీరో ఆర్య పై జూబ్లీహిల్స్ లోని పోలీస్ స్టేషన్ లో ఓ సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో కోలీవుడ్ లో కొత్త టెన్షన్ మొదలైంది.. హీరో ఆర్యను పోలీసులు అరెస్ట్ చేస్తారా? లేదా బకాయిలను చిత్రయూనిట్ చెల్లిస్తుందా? అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.