E-Paper
Advertisement

Film industry: మూగబోయిన గొంతు.. ప్రముఖ యాంకర్ కన్నుమూత!

Film industry: మూగబోయిన గొంతు.. ప్రముఖ యాంకర్ కన్నుమూత!
Advertisement

Film industry:చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ప్రతి విషయం కూడా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా వారికి సంబంధించిన ఏ విషయం అయినా సరే అభిమానులు ఇట్టే తెలుసుకుంటున్నారు..అది సంతోషమైనా.. దుఃఖమైనా.. అయితే ఈ మధ్యకాలంలో అటు ఫిలిం ఇండస్ట్రీతో పాటు ఇటు టీవీ ఇండస్ట్రీ కూడా భారీగా ఆదరణ పొందిన నేపథ్యంలో బుల్లితెర రంగానికి చెందిన ప్రముఖులు కూడా మరింత పాపులారిటీ అందుకున్నారు.

దూరదర్శన్ గొంతు మూగబోయింది..

ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో ఆధునిక టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో భిన్న విభిన్నమైన ఛానల్స్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. కానీ అప్పట్లో కేవలం దూరదర్శన్ మాత్రమే ఉండేది. సినిమాలు చూడాలన్నా.. సమాజంలో జరిగే సమాచారం గురించి తెలుసుకోవాలన్నా కచ్చితంగా టీవీలో దూరదర్శన్ ద్వారానే సమాచారం లభించేది. అలాంటి దూరదర్శన్ లో తన అద్భుతమైన వాక్చాతుర్యంతో యాంకర్ గా అందరి దృష్టిని ఆకర్షించింది ప్రముఖ యాంకర్ సరళ మహేశ్వరి (Sarala Maheswari). దూరదర్శన్ లో వార్తలు చదివిన ఈమె సరళమైన కంఠం, స్పష్టమైన ఉచ్చారణతో హుందాగా హిందీలో వార్తలు చదివేవారు. అయితే అలాంటి ఈమె తాజాగా కన్నుమూశారు.

Advertisement

also read:Shriya Saran: 25 ఏళ్లుగా తీరని కోరిక.. భవిష్యత్తులోనైనా నెరవేరుతుందా?

ప్రముఖ యాంకర్ కన్నుమూత..

ఈ యాంకర్ మృతి పట్ల దూరదర్శన్ నివాళి అర్పించింది. దూరదర్శన్ ఫ్యామిలీకి తరఫున సరళ మహేశ్వరి మృతి పట్ల నివాళి అర్పిస్తున్నట్లు డిడి (దూరదర్శన్) తన ఎక్స్ లో ట్వీట్ చేసింది. ఇక దూరదర్శన్లో ఎంతో గౌరవప్రదమైన న్యూస్ రీడర్గా ఆమెను గుర్తిస్తారని, భారతీయ వార్తా ప్రపంచంలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉందని , ఆమె స్వరం ఉచ్చారణతో ఆకట్టుకునే వారని , చాలా సింపుల్ గా ఆమె కనిపించినా వాక్చాతుర్యంలో ఏదో తెలియని పట్టు ఉండేదని దూరదర్శన్ తన ఎక్స్ ద్వారా చెప్పుకొచ్చింది. దూరదర్శన్ గొంతు ఇప్పుడు మూగబోయింది అని చెబుతూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక 71 సంవత్సరాలు వయసులో యాంకర్ సరళ మహేశ్వరి కన్నుమూయడంతో పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×