E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనా, బాలు ప్రేమకు ఫిదా.. ఎమోషనల్ స్టోరీ.. గెలిచిన మీనా, బాలు..?

Gundeninda GudiGantalu Today episode: మీనా, బాలు ప్రేమకు ఫిదా.. ఎమోషనల్ స్టోరీ.. గెలిచిన మీనా, బాలు..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 27th : నిన్నటి ఎపిసోడ్ లో.. నిన్ను ఎత్తుకోవడం నావల్ల కాదు.. నిన్ను ఎత్తుకుంటే నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అని సత్యం అంటాడు.. అయితే ప్రభావతి మాత్రం జడ్జిల దగ్గరికి వెళ్లి నేను కుర్చీపై నిలబడుకొని ఫ్లవర్ ని అందుకొని మా ఆయనకి ప్రపోజ్ చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్లు ప్రభావతి చెప్పిన దానికి ఒప్పుకుంటారు.. ప్రభావతి ఆ పువ్వుని అందుకునే టైంలో సత్యం తుమ్ముతాడు.. దాంతో ప్రభావతి కింద పడిపోతుంది. ఆమె నడుముకి గాయం తగులుతుంది. ప్రభావతికి ఏమైందని అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు.. ముగ్గురు కోడళ్లు ప్రభావతి కింద పడగానే స్టేజ్ మీదకి పరిగెత్తుకొని వెళ్తారు.. ప్రభావతి అక్కడ ఇచ్చిన టాస్క్ లో ఎలాగైనా సరే గెలవాలని అనుకుంటుంది. అత్యాశతో వెళ్లిన ప్రభావతికి నడుం పట్టిస్తుంది. ఇక తన ముగ్గురు కొడుకుల్ని మంచిగా ఆడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. భార్యని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో కళ్లలోకి చూస్తూ నిజాలు చెప్పాలి అని అనగానే ముందుగా మనోజ్ రోహిణి ఇద్దరు కూడా ఎమోషనల్ అయిపోతారు.. ఆ తర్వాత వచ్చిన శృతి రవి ఒకరినొకరు తిట్టుకొని వెళ్లిపోతారు. మీనా బాలు మాత్రం జడ్జిలను మెప్పిస్తారు. నిజమైన ప్రేమ ఉన్న జంటలు కళ్లతో ఎలా మాట్లాడుకుంటారో చూపించారు.. ఒకరి మనసులో మరొకరు ఏమనుకుంటున్నారో ఇద్దరూ ఒకేలా రాసి అక్కడ ఉన్న జడ్జిలను ఇంప్రెస్ చేశారు.  ఇప్పుడు రెండు కూడా మూడు జంటలు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాయి.

Advertisement

ఏ టాస్క్ లోనైనా కూడా బాలు మీనా ఎంతో చక్కగా పాల్గొంటూ విన్నర్ అయ్యారు. ఈ జంట అన్యోన్యతను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మురిసిపోతూ ఉంటారు. కచ్చితంగా ఈ జంట గెలవాలి అని కోరుకుంటారు కూడా.. ముఖ్యంగా బాలు తమకు ఒక గది లేదు అని చెప్పడంతో అందరూ బాధపడతారు. ఏది ఏమైనా కూడా అత్యాశకు పోయిన జంటలతో పోలిస్తే స్వచ్ఛమైన మనసుతో తమ మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమను తెలియజేసిన మీనా బాలు ఆ పోటీల్లో విన్నర్ గా నిలుస్తారు.

ప్రతి ఒక్క టాస్క్ లో మీనా బాలు చక్కగా ప్రవర్తించిన తీరు జడ్జీలను బాగా ఆకట్టుకుంది. చివరి వరకు విన్నర్ అవుతామని అనుకున్న మనోజ్ రోహిణి లకు షాక్ ఇస్తూ పోటీలో విజేతగా నిలిచిన జంటను ప్రకటిస్తారు. నేను అప్పుడే చెప్పాను కదా మనోజ్ మనకు ఇలాంటివి సెట్ అవ్వవు. ఆ లక్ష రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోయింది. డబ్బులు పోయినందుకు నేను బాధపడటం లేదు. అబ్బాలు మీనా చేతిలో మనం ఓడిపోయాము. అది ఇంట్లో చెప్పి ఇంకెంత ఆడుకుంటారు అని నాకు కంగారుగా ఉంది అని రోహిణి అంటుంది.

Advertisement

మొత్తానికి బాలు మీనా లక్ష రూపాయలు చెక్కుతో పాటుగా మరికొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్ లను కూడా సొంతం చేసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యతను చూసి అక్కడకు వచ్చిన జంటలు వాళ్లతో కలిసి సెల్ఫీలు దిగుతారు. మొత్తానికి భార్యాభర్తల పోటీ ఎపిసోడ్కి ముగింపు పలికేశారు. అక్కడ ఇచ్చిన లక్ష రూపాయలు చెక్కుతో బాలు మీనా సంబరాలు చేసుకుంటూ ఇంటికి బయలుదేరుతారు. మీరు గెలుస్తారని మేము అనుకున్నాం కచ్చితంగా మీరే గెలిచారు మాకు చాలా సంతోషంగా ఉంది అని శృతి అంటుంది. ఇక రవి కూడా మీరిద్దరూ ఎప్పుడూ కొట్టుకుంటూ కనిపించే వాళ్ళు కానీ ఇప్పుడు మీ మధ్య ఉన్న బంధాన్ని అందరికీ తెలియజేశారు గ్రేట్ అని పొగుడుతాడు.

Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ టీఆర్పీ రేటింగ్..ఈ నెలలో హైలెట్ ఎపిసోడ్స్ ఇవే…

ఆ తర్వాత ప్రభావతి ఆ పోటీలో గెలిచిందే లక్ష రూపాయలు మన సొంతం ఏది అని ఆలోచిస్తూ ఉంటుంది. నడుం విరగగొట్టుకున్న నీకు ఇంకా బుద్ధి రాలేదా అని సత్యం ప్రభావతి పై సెటర్లు వేస్తాడు.ఆ తర్వాత కామాక్షి కూడా వదిన గురించి తెలిసే మాట్లాడుతున్నావా అన్నయ్య అని అంటుంది. మీనా ఏం చేసినా అందులో తప్పులు వెతుకుతుంది తప్ప ఏ రోజు మీనా చేసిన మంచి పని గురించి మాట్లాడుతుందా? ఈవిడ బుద్ధి ఇంత అని కామాక్షి అంటుంది.. కనీసం ఈ పోటీల్లో మనోజ్ రోహిణి అయినా గెలిస్తే బాగుండు అని ప్రభావతి అనుకుంటుంది. కానీ సత్యం మాత్రం నాకెందుకు బాలు మీన గెలుస్తారని అనిపిస్తుంది అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక సోమవారం ఎపిసోడ్లో బాలు మీనాలకు లక్ష రూపాయలు వచ్చిందని తెలియగానే ప్రభావతి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×