E-Paper
Advertisement

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
Advertisement

Byreddy Rajasekhar Reddy: కర్నూలు నగరంలో నిర్వహించిన ఒక పుస్తకావిష్కరణ సభ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాయలసీమ హక్కుల కోసం దశాబ్దాలుగా గళమెత్తుతున్న రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ వేదికపై నుంచి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మాత్రమే నిజమైన ‘రాయలసీమ ముద్దుబిడ్డ’ అని, ఆ బిరుదు ఆయనకు మాత్రమే దక్కుతుందని బైరెడ్డి స్పష్టం చేశారు.

సీమ రైతు కన్నీటి వెత పుస్తకావిష్కరణ

Advertisement

కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో ప్రముఖ రచయిత పత్తి ఓబులయ్య రచించిన ‘సీమ రైతు కన్నీటి వెత’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హాజరై, పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాయలసీమ ప్రాంతంలోని దయనీయ స్థితిగతులను, ఇక్కడి రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలను పద్యాల రూపంలో ఎంతో అద్భుతంగా వివరించినందుకు రచయిత పత్తి ఓబులయ్యను ఈ సందర్భంగా వారు అభినందించారు.

కమిషన్ల కోసమే కొందరి రాజకీయాలు.. బైరెడ్డి

Advertisement

ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సీమ అభివృద్ధిపై కాకుండా కేవలం కమిషన్ల కోసమే కొందరు ‘సీమ ముద్దుబిడ్డ’ అని పిలిపించుకుంటూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాల కంటే రాయలసీమ ఎంతో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. రాయలసీమకు ఎక్కడ, ఏ రూపంలో అన్యాయం జరిగినా తాము చూస్తూ ఊరుకోమని, హక్కుల కోసం పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.

Also Read: విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

ప్రాజెక్టులు నిర్మిస్తేనే సీమకు విముక్తి.. టీజీ వెంకటేష్

మరో ముఖ్య అతిథి, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాకు పుష్కలంగా నీటి వనరులు ఉన్నప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వెలిబుచ్చారు. ప్రాంతీయ వివక్షను అధిగమించాలంటే గుండ్రేవుల, వేదవతి వంటి పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితేనే రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రజల హక్కుల కోసం, నీటి వాటాల కోసం తాను ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటానని టీజీ వెంకటేష్ పునరుద్ఘాటించారు. ఈ సభలో పలువురు ప్రముఖులు, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×