E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి షాకిచ్చిన మీనా..మనోజ్ ను తిట్టిన బాలు.. సత్యంకు అనారోగ్యం..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి షాకిచ్చిన మీనా..మనోజ్ ను తిట్టిన బాలు.. సత్యంకు అనారోగ్యం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. శోభా గుడిలోకి రావడం చూసినా ప్రభావతి ఈవిడ దొరికితే ఇప్పుడు మామూలుగా ఆడుకోదు. మనం ఎలాగైనా సరే ఇకనుంచి బయట పడాలి.. తొందరగా ప్రసారం తీసుకుందాం రా అనేసి అంటుంది. ఈవిడ అర్చన అయిన తర్వాత మీకు ప్రసాదం ఇస్తాను అని పూజారి అనడంతో ప్రభావతి షాక్ అవుతుంది.  ఇక శోభా పక్కనే నిల్చొని దేవుడికి దండం పెట్టుకుంటుంది.. ప్రభావతిని చూసిన శోభా ఏంటి వదిన గారు మీరు గాజులు వేసుకోకుండా గుడికి వచ్చారు. పైన గది కట్టాలని అన్నారు కదా దాని కోసమైనా అమ్మేశారా..? నేను చెక్ ఇస్తే మీరు వద్దన్నారు ఇప్పుడు చూడండి మీ చేతులకి గాజులు లేకుండా ఇలా పోయాయి అని కావాలనే అవమానించేలా అంటుంది శోభా.. ఎలాగోలా ప్రభావతి శోభ నుంచి తప్పించుకుని బయటకు వస్తుంది. ఇంటికి ప్రభావతిని చూసిన సత్యం దుష్టశక్తులన్నీ ఇక్కడే ఉన్నాయి వెళ్ళిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుందని అన్నడంతో బాధపడుతుంది. కానీ ప్రభావం మాత్రం ఇదంతా చేసింది మీనా వల్లే అని మీనా అని దారుణంగా అవమానిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..  రోహిణి మనోజు అత్తయ్య మే వెళ్ళిపోతున్నామని చెప్పి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు.. అందరి కోసం టిఫిన్ చేసిన మీనా రోహిణి మనోజ్ టిఫిన్ చేసాను పూరి కుర్మా తినేసి వెళ్ళండి అని అంటుంది.. నీ బాడీ టిఫిను మాకేం అక్కర్లేదు డబ్బులు ఇవ్వమని అన్నప్పుడు నువ్వు పెట్టిన టిఫిన్ మేము ఎలా తింటాము అని రోహిణి అంటుంది.. ఇవాళ తిన్నారా రేపు తినరా.. భోజనం కూడా బయట చేస్తారా ఎన్ని రోజులు చేస్తారు అని అడుగుతుంది.. నీకు డబ్బులు ఇచ్చేంతవరకు మేము ఇంట్లో ఏమీ తినము అని రోహిణి అంటుంది. మనోజ్ పూరి అన్నారు కదా బాగుంది తిందాం రా అంటే నీకు వంద పూరీలు ఆర్డర్ పెడతాను బయటికి వెళ్దాం పదనేసి రోహిణి అంటుంది..

Advertisement

మీరు బయట తింటే తినండి కానీ ఎన్ని రోజులు తింటారు అది చెప్పండి అని మీనా అంటుంది. మీ డబ్బులు మీ మోహన పడేసిన తర్వాతే మేము మళ్ళీ ఇంట్లో తింటామని రోహిణి అంటుంది. ఏంటి మీరు ఏమైనా గుడి ముందునా ఆడుకుంటున్నావ్ అనుకుంటున్నావా? మీ డబ్బులు మీ మొఖాన వేస్తాము అని అంటున్నావ్.. లేక నేను మా ఆయన గతిలేక మిమ్మల్ని అడుక్కుంటున్నామా? ఏం మాట్లాడుతున్నావ్ రోహిణి అని మీనా దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. కొంచెం మాటలు మర్యాదగారా అని ఇప్పుడు నగలు తీసుకెళ్లారు దానికి సహాయం చేసిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు..

ఇలాంటి మాటలు మా ఆయన కాసేపట్లో వస్తారు ఆయనతో అనండి ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి అని మీనా అంటుంది. అయినా మనం నెలల డబ్బులు ఇస్తున్నాం కదా రోహిణి మనం తినే హక్కు ఉంది అని అంటాడు మనోజ్. అటు రోహిణి రెండు అత్తయ్య మీరు ఇంటికి ఓనరు మీరు తినకుండా మేము ఎలా తింటాం అని అంటుంది.. వాళ్లందరూ కూర్చొని తింటూ ఉండగా సత్యం రవి శృతి బాలు కిందకి వస్తారు. రండి నాన్న తిందురు అనేసి అనగానే నాకు ఇప్పుడు ఆకలిగా లేదు నేను తర్వాత తింటాను అని అంటాడు సత్యం..

Advertisement

ఆంటీ పక్కన కూర్చుని అంకుల్ కి తినడం ఇష్టం లేదు కదా వదిలేయండి కాసేపాగి తింటారు.. రవి మనవెళ్లి తిందాం పదా అని శృతి అంటుంది.. బాలు అరేయ్ నగలు మింగినట్టు అన్ని మింగేసి వచ్చావా ఏంటి మాకు కొంచెం అవ్వలేదా అని అంటాడు. వినగానే రోహిణి ఫీల్ అవుతుంది. నేను అందుకే మనోజ్ ఇక్కడ వద్దు అని అన్నాను కానీ నువ్వే తినాలి అని ఇక్కడికి తీసుకొచ్చావని రోహిణి అంటుంది. నగలు తిన్నావు అలాగే ఇప్పుడు పూరీలు కూడా తినేసేయ్ అనేసి బాలు అందరినీ కడిగి పడేస్తూ మాట్లాడుతాడు.. బాలు మాట విన్న రోహిణి మాత్రం చాలా ఫీల్ అవుతుంది. మీ డబ్బులను మీకు ఇచ్చేస్తాము అని అంటుంది. ఆ మాట మీనా ఇందాక మీ మొఖాన పడేస్తాను అని అన్నావ్. ఇప్పుడేంటి మాటలు మర్యాదగా వస్తున్నాయి అని మీనా దుమ్ము దులిపేస్తుంది..

ఇంకా సిగ్గు లేకుండా ఎలా అలా మాట్లాడుతున్నావ్ రోహిణి అని శృతి అంటుంది. నువ్వెందుకు శృతి ఇంతగా రియాక్ట్ అవుతున్నావు. నీకెందులో ఎటువంటి సంబంధం లేదు కదా అని రోహిణి అంటుంది. నాకు ఈ నగలు దొంగతనం విషయం తలుచుకుంటేనే చిరాగ్గా ఉందని శృతి అంటుంది. బాలుకు తోడుగా శృతి కూడా తయారవడంతో బాలు శృతి ఇద్దరు కలిసి మిగతా వాళ్ళని ఆడుకుంటారు.. ప్రభావతి మధ్యలోనే లేచిపోతుంది. రోహిణి నీకు కొంచమైన సిగ్గు శరం ఉంటాయి ఇకనుంచి పద వెళ్ళిపోదామని మనోజ్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. శృతి వెళ్లిపోతుంటే మీనా ఈ విషయాల గురించి మీ పుట్టింట్లో చెప్పదు శృతి అత్యంత గౌరవాన్ని తగ్గించినట్లు అవుతుందని సలహాలు ఇస్తుంది. ఆ మాట విన్నా ప్రభావతి చేసినంత చేసి ఇప్పుడు ఇదే సలహాలు ఇస్తుందా మంచి నటే అని అనుకుంటుంది..

Also Read : ‘పొదరిల్లు’ చక్రి బ్యాగ్రౌండ్ ఇదే.. ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారేమో..?

మనోజ్ రోహిణి షాప్ లో ఉంటారు.. అక్కడికి ఒక కానిస్టేబుల్ రావడంతో ఏమైంది అని మనోజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. పోగొట్టుకున్న ఫర్నిచర్స్ ఇతను కొన్నాడు ఇతను దగ్గర కొన్ని ఉన్నాయి అట వాటికి మీరు డబ్బులు చెల్లించి అతని దగ్గర తీసుకోండి అని అతను అంటాడు. మేమే డబ్బులు ఇవ్వాలా అదేంటి అని రోహిణి అడుగుతుంది ఇతను కొన్న వాటికి లక్ష రూపాయలు అయింది. అయితే మనము మీనా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా ఇప్పుడు విచ్చి వాటిని డబల్ రేటు కమ్మి డబ్బులు ఇచ్చేద్దామని రోహిణి అంటుంది. ఇక మనోజ్ కూడా రోహిణి మాటను కాదనలేక డబ్బులు ఇస్తాను ఇవ్వండి అని అంటారు. తర్వాత సత్యం వచ్చి ఇంట్లో కూర్చుని పొరమాలినట్లు ఉంటుంది.. సత్యం కు పోరమాలడం చూసిన ప్రభావతి వాటర్ ఇస్తుంది. అని సత్యం మాత్రం ఆ నీళ్లను తాగడానికి ఇష్టపడడు. నేను ప్రాణం పోయినా కూడా మళ్లీ ఆ చేత్తో ఏది తీసుకొని అని అంటాడు. అది విన్న ప్రభావతి కనీసం మంచినీళ్లు కూడా తీసుకోరా అని బాధపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.  రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Big Stories

Advertisement
×