FIFA World Cup final 2026: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంటు (FIFA World Cup final 2026) విజేత ఎవరనేది తేలిపోయింది. ఆదివారం ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగగా.. ఇందులో అద్భుతంగా రాణించిన స్పెయిన్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంటు జూన్ 11వ తేదీన ప్రారంభం కాగా… దాదాపు నెల రోజులు పాటు సాగింది. భారత కాలమానం ప్రకారం జులై 20వ తేదీన ఫిఫా వరల్డ్ కప్ ఫినిష్ అయింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ మ్యాచ్ లో స్పెయిన్, అర్జెంటీనా (Spain vs Argentina) రెండు జట్లు తలపడ్డాయి. హోరా హోరిగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో చివరకు 1-0 తేడాతో స్పెయినే విక్టరీ సాధించింది.
Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియన్ పోలీసులు !
ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ న్యూయార్క్ లోని మెట్ లైఫ్ స్టేడియం వేదికగా ఆదివారం అర్ధరాత్రి తర్వాత అంటే జూలై 20వ తేదీన ఎర్లీ మార్నింగ్ 12:30 గంటలకు ప్రారంభమైంది. అయితే మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్లు కూడా ఒక్క గోల్ చేయలేకపోయాయి. 90 నిమిషాల పాటు ఆట చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. దీంతో ఎక్స్ ట్రా సమయాన్ని కేటాయించారు. విజేతను తేల్చడానికి 30 నిమిషాలు ఆదనపు సమయం ఇచ్చారు. ఈ క్రమంలో అద్భుతంగా రాణించిన స్పెయిన్, 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి… ఛాంపియన్ అయింది. ఎక్స్ ట్రా టైంలో 106వ నిమిషంలో ఫెర్రాన్ టొర్రెస్ ( Ferran Torres) గోల్ కొట్టి.. స్పెయిన్ ను గెలిపించాడు. ఈ క్రమంలో మళ్లీ 16 ఏళ్ల తర్వాత ఛాంపియన్ గా స్పెయిన్ రెండోసారి ఛాంపియన్ అయింది. 2010లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై స్పెయిన్ విజయం సాధించింది. ఇక ఇప్పుడు అర్జెంటీనాపై విక్టరీ కొట్టి, రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది.
ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ (FIFA World Cup final 2026) ఫైనల్ మ్యాచ్ ఫినిష్ అయిన నేపథ్యంలో ప్రైజ్ మనీ వివరాలు వైరల్ గా మారాయి. ఈ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుకు రూ.490 కోట్లు లభించనున్నాయి. అంటే 51 మిలియన్ డాలర్లు. రన్నరప్ గా నిలిచిన అర్జెంటీనా జట్టుకు.. రూ.327 కోట్లు దక్కుతాయి. అంటే 34 మిలియన్ డాలర్లు అన్నమాట. మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు రూ.279 కోట్లు వస్తాయి. అంటే 29 మిలియన్ డాలర్లు ఇంగ్లాండ్ సొంతం చేసుకోనుంది. ఇక నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు 27 మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా రూ.260 కోట్లు దక్కుతాయి. ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ లో కేవలం పాల్గొంటే చాలు… కోట్లలో డబ్బులు వస్తాయి. క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్లలో వచ్చే ఆదాయం కంటే ఎక్కువగానే ఫుట్ బాల్ లో దక్కుతాయి.