Gundeninda GudiGantalu Today episode May 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. సుశీల ఫోటో కావాలని చెప్పడంతో బాలు అలాగే పెద్ద ఫోటో చేయిస్తారని చెప్పి మాటిస్తాడు. దానికి సత్యం మనకు కూడా ఒక మంచి ఫోటో తీసుకురారా అది మనం హాల్లో పెడదాం అనేసి అంటాడు. దానికి ప్రభావతి ఒప్పుకోదు. ఎందుకు ఏమైంది అంటే అందులో బాలు మీనా అన్నారు కదా అందుకే అమ్మకు ఇష్టం లేదు నాన్న అని అంటాడు. అందరూ ఉన్న ఫోటో హాల్లో ఉంటేనే మంచిది అని సత్యం ప్రభావతికి చెప్తాడు. బాలు మీ అమ్మ మాటలు పట్టించుకోకుండా పెద్దది ఫ్రేమ్ చేయించుకుని మన ఫ్యామిలీ ఫోటో తీసుకురా హాల్లో పెడదాం అనేసి అంటాడు. అలాగే అండి అని బాలు వెళ్లిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఫోటోషాప్ అతనితో బాలు మంచిగా పెద్ద సైజు ఫోటోలు కావాలన్నా అని అడుగుతాడు. ఆ ఫోటోలను చూసినా అతను మీ అమ్మగారు ఇటీవల దొంగతనానికి గురయ్యారు కదా అనేసి అడుగుతాడు. అవునన్నా ఎవరో ఒక వెధవ మా అమ్మ దగ్గర డబ్బులు లాక్కొని పారిపోయాడు అని బాలు అంటాడు. ఎవరో కాదు ఇదిగో ఇక్కడ చూడు ఒకసారి అని చూపిస్తాడు. ఆ విజువల్స్ లో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళ్తూ ప్రభావతి బ్యాగు ని కొట్టేసి డబ్బులు తీసుకొని బ్యాగ్ ని అక్కడే పడేసి వెళ్లిపోతారు. అది చూసిన బాలు మొహానికి మాస్కులు వేసుకుని ఉన్నారు కదా అన్న కనిపెట్టలేకపోతున్నాం ఎవరో తెలిస్తే మాత్రం వాడికి ఉంటది అని అంటారు. మా బిల్డింగ్ కు ఇంకో కెమెరా ఉంది అది చూడండి అని అతను బాలుకు మరో వీడియోను చూపిస్తాడు.
అది చూసిన బాలు షాక్ అవుతాడు. అది శివ గుణాన్ని కన్ఫామ్ చేసుకొని కోపంతో రగిలిపోతాడు. సరే అన్నా మీరు ఫ్రేమ్ కట్టించండి. నేను సాయంత్రం వచ్చి తీసుకుంటాను అని అంటాడు. ఇక రాజేషు కార్ దగ్గరికి వెళుతూ ఉంటే గుణ అక్కడికి వచ్చేస్తాడు. వడ్డీ కట్టమంటే ఏదేదో సాకులు చెప్తున్నావేంటిరా వడ్డీ కడతావా కారుని తీసుకుపోమంటావా అని అడుగుతాడు. గుణ రెండు రోజుల్లో ఇస్తాను వేరే అర్జెంటు పని ఉండి వాటికి వాడేసాను అని రాజేష్ ఎంత చెప్పినా కూడా గుణ వినడు. ఆ రెండు రోజులు కారు తీసుకుపోతే నీకే తెలుస్తుంది అని అంటాడు. కానీ రాజేష్ బ్రతిమలాడుతాడు..
అయితే కారు తీసుకోకపోతే నీ పెళ్ళాన్ని తీసుకొని పొమ్మంటావా రెండు రోజులు నాతో ఉంచుకొని తర్వాత పంపిస్తాను డబ్బులు నాకు ఇవ్వనక్కర్లేదు అన్నట్లు గుణ మాట్లాడుతాడు. దానికి కోపంగా ఫీల్ అయిన రాజేష్ గుణాన్ని కొడతాడు. మళ్లీ కొట్టబోతుంటే గుణ రాజేష్ ని కొడతాడు. మరో దెబ్బ రాజేష్ ని కొట్టపోతుంటే మధ్యలో బాలు వచ్చి ఆపుతాడు. గుణను కొడతాడు. డబ్బులు ఇస్తాను అన్నప్పుడు ఇస్తాడు ఎగ్గొట్టి పోడు కదా మరి ఎందుకు నువ్వు దారుణంగా మాట్లాడుతున్నావ్ నువ్వు మనిషివేగా నీకు కూడా తల్లి చెల్లి ఉన్నారుగా మీ చెల్లె లాంటివి అమ్మాయిని ఇలా అంటావా అని గుణపై బాలు రెచ్చిపోతాడు.
గుణ వెంట వచ్చిన శివ బాలు కాలర్ పట్టుకుని అరుస్తాడు. నా ఫ్రెండ్ ని కొడితే బావ అని కూడా చూడను కొడతానని శివ ఒక్కసారిగా రెచ్చిపోతాడు. నా కాలరే పట్టుకుంటావు రా ఎంత ధైర్యం రా నీకు అని శివని బాలు కొడతాడు. శివకు దెబ్బ తగలడంతో కారుపై పడిపోతాడు. నువ్వు ఇంట్లో కాలేజీకి పోతున్నానని చెప్పి ఇలా మళ్లీ వీడు వెనకాల తిరుగుతున్నావా నీ అమ్మ చెల్లి ఎంత కష్టపడుతున్నారో కొంచమైనా ఆలోచించవా మనిషి లాగానే కొంచమైన బుద్ధుందా అని శివ కొడతాడు. అక్కడున్న వాళ్ళందరూ బాలు ఎంతగా ఆపాలని ప్రయత్నించినా కూడా బాలు ఆగడు. శివ ను చెయ్యి పట్టుకుని మేలు పెట్టేస్తాడు. ఇక రాజేష్ చెప్తే శివని వదిలేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన శివ నొప్పిగా ఉందని బాధపడుతుందే పార్వతీ సుమతి ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకెళ్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో శివ గురించి బాలు నిజాన్ని బయటపెడతాడేమో చూడాలి..