Gundeninda GudiGantalu Today episode August 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. 40 లక్షలకు డ్రా చేసినట్టు రుజువు ఉంది కదా మీరు డబ్బులు కట్టాల్సిందే అని కల్పనకు పోలీసులు షాక్ ఇస్తారు..లాయరు బయటకు తీసుకెళ్లి కల్పనతో మాట్లాడతాడు.. మీరు ఇదంతా ఒప్పుకున్నారు కదా వాళ్ళ 40 లక్షలు వాళ్ళకి ఇవ్వాల్సిందే లేదంటే కోర్టు కేసులని ఇలా నెలలు తరబడి తిప్పుతారు అని భయపెడతాడు.. రోహిణి దీన్ని నమ్మడానికి వీలు లేదండి సక్సెస్ ఎందుకు ఎవరైనా పెట్టించండి లేదా వీలైనంత త్వరలో మాకు డబ్బు ఇప్పించండి అని అడుగుతుంది. కెనడాకు వెళ్లాలని ఫిక్స్ అయ్యాను ఆ డబ్బులు ఇచ్చేస్తాను అని కల్పనా అంటుంది. మొత్తం ఎంత 40 లక్షలు కదా అని అడుగుతుంది. 40 లక్షలు కాదు 45 లక్షలని రోహిణి అంటుంది.. ఇక చేసేదేమి లేక కల్పన డబ్బులను మనోజ్ కు పంపిస్తుంది. మీనా స్కూటీని పోలీసులు ఫైన్ కట్టించుకొని ఇస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి, మనోజ్ లు డబ్బులు వచ్చాయన్న సంతోషంలో ఉంటారు. బాలు ఇంట్లో ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి ఇది మా ఇల్లు కాదేమో అని అనుకుంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ప్రభావతి బాలుని తిడుతుంది. సంతోషంగా అందరిని పిలుస్తాడు. అయితే మా నాన్న నాకు 25 లక్షలు పంపించాడు ఆంటీ అని అంటుంది. మాట వినగానే ప్రభావతికి షాక్ కొట్టినట్లు కింద పడిపోతుంది. అన్ని డబ్బులు మీ నాన్న ఇచ్చాడా అని ఆశ్చర్య పోతుంది. కానీ బాలు శృతిలకు ఏదో తేడా కొడుతుంది అని ఆలోచిస్తారు..
బాలు వీడు తీసుకెళ్లి 40 లక్షలని ఎందుకు ఇవ్వాలనుకున్నాడు వాళ్ళ నాన్న నాకు ఏదో తేడా కొడుతుంది అని అంటాడు. బాలు అన్న మాటలకి రోహిణి ప్రతిసారి మమ్మల్ని అనకు నువ్వు అన్న మాటలుకే నేను 40 లక్షల తీసుకొచ్చి ఇచ్చాను. ఒకసారి అంటే బాగోదు అని బాలుకి వార్నింగ్ ఇస్తుంది. చూశారా అత్తయ్య మేము ఇలా చేసినా కూడా బాలు ఎలా మాట్లాడుతున్నారో అని అడుగుతుంది రోహిణి. రోహిణి అన్నమాటలను విని ప్రభావతి బాలు పై అరుస్తుంది. 40 లక్షలు వచ్చాయి కదా ఆ 40 లక్షల్లో ముగ్గురికి వాటా ఉంది అని బాలు అంటాడు..
రవి మాత్రం రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులకు మనకు వాటా ఎలా ఉంటున్న అన్నయ్య మనకేం వద్దులే అని అంటాడు. అలాగే మీనా కూడా ఆ డబ్బులు మనకెందుకులేండి అని అంటుంది. అప్పుడే ప్రభావతి ఏంటే వాని గిల్లుతున్నావ్ అని అంటుంది. ప్రభావతికి దిమ్మదిరిగి పోయేలా సమాధానం చెబుతుంది మీనా. ఇక బాలు కి మాత్రం రోహిణి పై ఏదో అనుమానం ఉన్నట్లు ఉంటుంది. మనోజ్ రోహిణి ఏదో చేస్తున్నారు నాకు అనుమానం వస్తుంది అని మీనా తో అంటాడు. ఆ డబ్బులు వాళ్ళవి వాళ్ళ ఇష్టం మనకు అవసరం లేదు అని మీనా అంటుంది.
అటు సంజయ్ తన బర్త్డే వేడుకలను ఫ్రెండ్స్ తో జరుపుకోవాలని అనుకుంటాడు. మౌనికని తన ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకొని వెళ్తారు అక్కడ మౌనికకు ఘోర అవమానం జరుగుతుంది.. పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్ తోనే సంజయ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే మౌనికను తన ఫ్రెండు తాగమని చెప్తే మౌనిక వద్దు అని అంటుంది. సంజయ్ అక్కడినుంచి వెళ్ళిపోని అంటాడు. మౌనిక తన ప్రిన్స్ ముందర అవమానించాడనే బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
రాత్రి అందరూ భోజనానికి కూర్చుంటే ప్రభావతి మాత్రం రోహిణి మనోజ్ ని స్పెషల్గా ట్రీట్ చేస్తుంది. అది చూసిన శృతి బాలు మాత్రం వాళ్ళిద్దరికీ స్పెషల్ గా ట్రీట్ చేస్తారా అని అడుగుతారు. డబ్బులు రాగానే అమ్మ పిలుపులో కూడా ఎంత మార్పు వచ్చిందని బాలు అంటాడు.. అయితే ఆ 40 లక్షలు మీనా మామయ్య నీకెందుకు పంపించారు అని బాలు అడుగుతాడు. అదికూడా మనోజ్ నా అకౌంట్ లో మిగతా 15 లక్షలు పడితే ఆ తర్వాత నీ సంగతి చెప్తానని అంటాడు..
Also Read:
అదేంటి రోహిణి మీ నాన్న నీ అకౌంట్లో డబ్బులు వేయాలి కానీ ఇలా మనోజ్ అకౌంట్లో డబ్బులు వేయడమేంటి అని శృతి అడుగుతుంది. రోహిణి ఈ ప్రశ్నలు తట్టుకోలేక ఏంటంటే ఇదంతా అని అడుగుతుంది. వదిలేయమ్మా వాడి పుట్టింటి నుంచి వాడికి డబ్బులు రాలేదు కదా అందుకే ఇలా కుళ్ళు కుంటున్నాడు అని ప్రభావతి అంటుంది. ఆ మాటకు మీనా బాలు కోపంతో రగిలిపోతారు. సత్యం ఈ గొడవలు రోజు ఉండేవే ఇక ఆపండి అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..