Illu Illalu Pillalu ToIlluday Episode August 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆనంద రావుని భాగ్యం ఎలాగోలాగా కాపాడి బయటపడేస్తుంది. రామరాజు కూడా అది నిజమే అని కొన్ని నమ్మి శ్రీవల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతాడు. లోపలికి వెళ్ళిన రామరాజు కుటుంబం ఆనందరావు పరిస్థితిని చూసి జాలి పడతారు. తిరుపతి ఆనంద్ రావు మీద ఇడ్లీలో పంచులను వేసి విసిగిస్తాడు. ఆనందరావు కూడా ఏమాత్రం తగ్గకుండా ఇడ్లీ చట్నీ మధ్య ఉన్న సంబంధం గురించి పంచులు వేస్తాడు. నర్మద మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఆనందరావుతో ఎలాగైనా నిజం చెప్పించాలని అనుకుంటారు. ముందుగానే ఆ విషయం ఊహించిన భాగ్యం వీళ్ళ ప్రశ్నల నుంచి బయటపడేయాలి లేకపోతే ఈయన గారు నోరు జారీ అసలు నిజం చెప్పేసిన చెప్పేస్తాడు. మొత్తానికి ఆనందరావు, భాగ్యం తప్పించుకొని వెళ్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమకు మాత్రం వీళ్ళిద్దరి మీద అనుమానం ఎంతో కొంత ఉండనే ఉంటుంది. అటు నర్మద కూడా వీళ్ళిద్దరిని అనుమానిస్తూనే ఉంటుంది. మొత్తానికి ఇద్దరు రామరాజు ఇంటి నుంచి బయట పడతారు.. మొత్తానికి ఇంటి నుంచి బయటకు వచ్చామని భాగ్యం ఊపిరి పీల్చుకుంటుంది. వీరిద్దరూ ఈరోజుకి సేఫయము ఇంకొకసారి ఇలా జరుపుకున్న ఉండాలి అని అనుకుంటారు. ఇక రామరాజు మన ఇంట్లో తొలి ధాన్యం వచ్చాయి నీ చేతులతో ధాన్యం తీసుకో అని బుజ్జమ్మకు చెప్తాడు.
పెళ్లి పాతికేల్లైనా కూడా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేదు. నిన్ను ఎప్పుడూ ఏ మాట అనలేదు.. అయితే ఒక చిన్న అపార్థంతో నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించు బుజ్జమ్మ అని అంటాడు. వేదవతి మీరు నన్ను బాధపెట్టిన కూడా మీ మనసు నాకు తెలుసండి అని అంటుంది మొత్తానికి ఇద్దరు కలిసి పోతారు. ఆ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో అని తెలుసుకోవాలని శ్రీవల్లి అనుకుంటుంది. అయితే శ్రీవల్లికి ఇప్పుడు జరిగిన విషయం వల్ల తాళాలు మీ అత్తయ్యకి ఇవ్వమ్మా అని భాగ్యం అంటుంది.
తర్వాత రోజు భాగ్యం రామరాజు ఇంటికి వచ్చి ఇంట్లో ఇన్ని అనర్ధాలు జరుగుతున్నాయి ఇంటి పెద్దగా మీ అత్తయ్య ఉండాలి అని అంటుంది. శ్రీవల్లి తాళాలు ఇవ్వడానికి ఒప్పుకోదు. ఎందుకు ఇది మీదే దొంగతనం పడుతుంది నువ్వు ఇచ్చే అమ్మా అని అంటుంది. శ్రీవల్లి వేదవతికి తాళాలు ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. అయితే నర్మద మాత్రం నువ్వు ఇప్పుడు ఈ తాళాలు ఇస్తే అందరూ తప్పుగా అనుకుంటారు అక్క. కుటుంబం మొత్తము నీ మీద నమ్మకంతోంది.. పెద్ద కోడలుగా నువ్వు బాధ్యతని నెరవర్తిస్తున్నావు అని అంటుంది.
నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు అమ్ము చేసుకోకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో ఈ తాళాలు నీ దగ్గరే ఉండాలి అని నర్మదా శ్రీవల్లికి షాక్ ఇస్తుంది. అయితే శ్రీవల్లి మాత్రం అత్తయ్య దగ్గర ఉండడమే మంచిది. ఏదో మావయ్య గారు చెప్పారు కదా అని నేను ఆ తాళాలు తీసుకున్నాను అంతే.. నాకు ఈ తాళాలు అంటే పెద్ద మోజు లేదు అత్తయ్య గారు దేవత లాంటివారు ఆవిడ దగ్గరే ఉండడం మంచిది అని శ్రీవల్లి ఆ తాళాలను ఇస్తుంది. మొత్తానికి వేదవతి తాళాలు తీసుకుంటుంది.
చందు మాత్రం శ్రీవల్లిని డబ్బులు తీసుకురావాలని అంటాడు. అయితే చందు వెంటనే డబ్బులు కావాలని అడిగితే శ్రీవల్లి నా మీద ప్రేమతో నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు. ఏదో మొక్కుబడిగా పెళ్లి చేసుకున్నావని అంటుంది.. ఆ సేటు నా దగ్గరకు వచ్చి డబ్బులు కావాలి అని అడుగుతాడు కచ్చితంగా ఈ రోజు అటు ఇటు తేల్చుకోవాలి మీ అమ్మను ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలువు అని అంటాడు.. ఎందుకు మాట ప్రకారం వల్లి భాగ్యమును ఇంటికి పిలుస్తుంది.. భాగ్యం ఇది పెద్ద సమస్యగా మారింది ఏదో ఒకటి చేయాల్సిందే అని అంటుంది.
Also Read : పార్వతికి పల్లవి పై అనుమానం.. ప్రణతిని మోసం చేస్తున్న అక్షయ్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..
నగల షాప్ కి వెళ్లిన కామాక్షి అక్కడ శ్రీవల్లి ఇచ్చిన ఉంగరాన్ని ఇస్తుంది. డూప్లికేట్ అని తెలియడంతో షాక్ అయ్యి శ్రీవల్లిని అడగడానికి అరుస్తూ ఇంటికి వస్తుంది. శ్రీవల్లి మాత్రం నర్మద వాళ్ళు చూస్తే దొరికిపోతానని గదిలోకి తీసుకెళ్లి మాట్లాడుతుంది.. కచ్చితంగా మా నాన్నకు చెప్పాలని అనుకుంటున్నా అని అంటుంది.. భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా కామాక్షిని ఆపే ప్రయత్నం చేస్తారు. అది చూసిన ప్రేమ నర్మదా ఏమైందని అనుమానంతో ఆలోచిస్తూ ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..