E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today August 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన వాళ్ల నాన్న

Nindu Noorella Saavasam Serial Today August 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన వాళ్ల నాన్న
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరుకు రాఖీ కట్టిన తర్వాత మిస్సమ్మను తాను యాక్టింగ్‌ ఎలా చేశానని అడుగుతుంది. అబ్బాబ్బా ఇరగదీశావు చెల్లి అని చెప్తుంది ఆరు. నువ్వు ధైర్యాన్ని ఇవ్వబట్టి.. మా ఆయన చెప్పబట్టి నేను అలా చేసేశాను. బేసిగ్గా నేను అందంగానే ఉంటాను అనుకో.. ఈసారి నగలు ఈ మేకప్‌ వల్ల ఇంకొంచెం అందం వచ్చింది అంటుంది. దీంతో పక్కనే ఉన్న గుప్త నీవే అనుకొనిన నీ సోదరి నిన్ను మించిన అతి చేయుచున్నది బాలిక అనగానే ఆరు కోపంగా చూస్తూ మీరు ఉండండి అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ ఏంటక్కా..? అని అడుగుతుంది. దీంతో ఆరు ఏమీ లేదు. ఈ రోజు నీకు అందరి దిష్టి తగిలి ఉంటుంది వెళ్లి దిష్టి తీయించుకో అని చెప్తుంది ఆరు.

అవును అవును అది ఇప్పుడు చాలా అవసరం అంటాడు గుప్త. అయితే ఎవరితో తీయించుకోను అత్తయ్యేమో ఇంట్లో లేదు. ఆ మనోహరి చిత్ర చేతులు మంచివి కావు.. అక్కా నువ్వు తీయోచ్చు కదా అంటుంది మిస్సమ్మ. దీంతో ఆరు అలాగే అంటూ చెప్పగానే.. గుప్త వలదు బాలిక ఆత్మలు దిష్టి తీయకూడాదు అది నిషిద్దం అని చెప్పగానే.. ఆరు అవును కదా..? అని ఆలోచిస్తుంది. ఇంతలో మిస్సమ్మ ఏంటక్కా ఆలోచిస్తున్నావు. అని అడుగుతుంది. నేనా..? అంటుంది ఆరు..అవును అక్కా అయినా నీ కంటే నా మంచి కోరే వారు ఎవరుంటారు అక్కా అని మిస్సమ్మ చెప్తుంది. దీంతో ఆరు ఆ మీ ఆయన ఉన్నారు కదా ఆయనతో దిష్టి తీయించుకో… అని చెప్తుంది ఆరు. గుప్త షాకింగ్‌ గా నువ్వేనా ఈ మాట అనుచున్నది బాలిక అని అడుగుతాడు.

Advertisement

మిస్సమ్మ అనుమానంగా ఆయన దిష్టి తీస్తారా..? అని అడుగుతుంది. ఎందుకు తీయరు. నిన్ను యాడ్‌ చేయమని ఎంకరేజ్‌ చేసిన వారు.. నీకు దిష్టి తీయరా..? ఏంటి..? అని చెప్తుంది. గుప్త నవ్వుతూ మరోక్క మారు నువ్వే ఆలోచించుకొనుము.. తదుపరి నువ్వే బాధపడెదవు..? అంటాడు. ఏం పర్వాలేదు.. నువ్వు వెళ్లు భాగీ.. నాకు తెలిసి మీ వారు ఈ పాటికి దిష్టి తీయడానికి రెడీ ఉంటారు. అని చెప్పగానే మిస్సమ్మ సంతోషంగా నిజంగానా అక్కా అని అడుగుతూ వెంటనే అనుమానంగా ఆ విషయం  మీకెలా తెలుసు అంటుంద. దీంతో ఆరు మా వారు కూడా అంతే  అప్పుడప్పుడు నాకు దిష్టి తీసేవారులే.. అని చెప్తుంది.

కానీ మావారు వేరులే అక్క నేను దిష్టి తీయమని అడిగితే ఏమంటారో ఏంటో…? అంటుంది మిస్సమ్మ.. అయితే రాథోడ్‌తో చెప్పించు అని సలహా ఇస్తుంది ఆరు. దీంతో ఎస్‌ ఆ పని చేస్తాను.. చాలా థాంక్స్‌ అక్కా ఇప్పుడే వెళ్తాను. అంటూ మిస్సమ్మ వెళ్లిపోతుంది. గుప్త ఆశ్చర్యంగా ఏమిటిది బాలిక ఈ రోజు నీ మనసు ఇంత విశాలంగా ఉన్నది. నీ సహోదరిని నీ పతిదేవునితో దిష్టి తీయించుకోమని చెబుతుంటివా..? అంటాడు. దీంతో ఆరు కోపంగా మా ఆయనతో దిష్టి తీయించుకునే అదృష్టానికి నన్న మీరే దూరం చేశారు కదా..? అంటూ తిడుతుంది. దీంతో గుప్త అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నన్నే నిందించిచుంటివి కదా…? కట కట.. అంటూ షాక్‌ అవుతాడు గుప్త.

Advertisement

తర్వాత చిత్ర, వినోద్‌ల షాప్‌ ఓపెనింగ్‌ జరుగుతుంది. అక్కడికి చిత్ర వాళ్ల నాన్న వస్తాడు. అందరూ కలిసి ఆయనతోనే షాప్‌ ఓపెనింగ్‌ చేయిస్తారు. తర్వాత ఆయనను పక్కకు తీసుకెళ్లి తిడుతుంది చిత్ర. మీరెందుకు వచ్చారు ఇక్కడికి మీకు పిచ్చి కానీ పట్టిందా..? అంటూ కోపంగా వార్నింగ్‌ ఇస్తుంది. దీంత ఆయన పిచ్చి పట్టింది నాకు కాదమ్మా నీకు. నీకు ఆస్థులు తప్పా మనుషులు అక్కరలేదు కదా..? అంటాడు.

దీంతో చిత్ర కోపంగా నాన్న నాకు కోపం వచ్చింది అనుకో నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ మళ్లీ వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఆయన నువ్వు నా ప్రాణం తీసినా సరే నీ గురించి చెప్పే చస్తా..! నీ గురించి నీ భర్తకు నీ కుటుంబానికి ఈ ప్రపంచం మొత్తానికే తెలియాలి అంటూ కోపంగా వార్నింగ్‌ ఇచ్చి ఆయన వినోద్‌ దగ్గరకు వెళ్తుంటాడు. అంతా గమనించిన అమర్‌, మిస్సమ్మ, రాథోడ్‌ ఆయన్ని ఆపాలని వెనకాలే వెళ్తుంటారు. చిత్ర కూడా ఆయన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఆయన పైన ఫ్లోర్‌లో ఉన్న వినోద్‌ దగ్గరకు వెళ్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×