Intinti Ramayanam Today Episode August 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని అక్షయ్ దగ్గరకు వెళ్తుంది. మీకు ఏమైనా కావాలంటే అడగండి నేను వెళ్లి పడుకుంటాను అని అంటుంది.. కానీ అక్షయ్ మాత్రం ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావ్.. నీ తమ్ముని నిర్దోషిని నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నావా అని అడుగుతాడు.. ఆ మాట వినగానే అవని షాక్ అవుతుంది.. నా తమ్ముడు ఏ తప్పు చేయలేదని మీకు ఎన్ని సార్లు చెప్పాలి? అయినా మీరు పదే పదే అనడం నాకు ఏమీ నచ్చలేదు అని అవని అక్షయతో అంటుంది. అక్షయ్ మాత్రం నీ తమ్ముడు తప్పు చేశాడు అని ఇప్పుడు పోలీసులే కదా రుజువు చేశారు అని అంటాడు. మీకు మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు ఏమైనా ఉందా అని అవని అడుగుతుంది. ఏంటి పిచ్చిపిచ్చిగా ఉందా ఏం మాట్లాడుతున్నావ్ అని అక్షయ్ అంటాడు. లేదా మీకు అమ్మాయిలని వాడుకొని వదిలేసే ఆ అలవాటు ఉందా అని అవని అంటుంది. ఇవన్నీ మీ మీద పడ్డ కేసులే వాటన్నిటి నుంచి మిమ్మల్ని తప్పించి నేను తీసుకొచ్చాను అది మర్చిపోయినట్టున్నారు. మా తమ్ముడు కూడా ఏ తప్పు చేయలేదని రుజువు చేసి నేను నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను అని అవని అక్షయ్ తో చాలెంజ్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవ్వాలి ఎపిసోడ్ విషయానికి వస్తే… భరత్ ని స్టేషన్ కి తీసుకెళ్లి శ్రీకర్ అవని సైన్ చేయిస్తారు. అక్కడ ప్రణతి కోసం చూసిన పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఫోటోలను చూసి అవన్నీ షాక్ అవుతుంది. ఇదేంటి వీళ్ళ ఫోటోలు ఇక్కడ ఉన్నాయి అని అవని అక్కడే ఉన్న ఎస్ఐ ని అడుగుతుంది.. ఆయన చెప్పిన నిజంతో మైండ్ బ్లాక్ అవుతుంది.. ఇలాంటి వాడిని నా అత్తయ్య ప్రణతికించి పెళ్లి చేయించించాలని అనుకుంటుందా..? వెంటనే ఈ విషయాన్ని అత్తయ్యకి చెప్పాలి అని ఫోన్ చేస్తుంది.. ఫోన్ లిఫ్ట్ చేసిన పార్వతి వెటకారంగా మాట్లాడుతుంది.
నువ్వేంటి నాకు ఫోన్ చేసావ్ అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని పార్వతి అంటుంది. నేను ఒక విషయం చెప్పాల అత్తయ్య మీరు కచ్చితంగా రావాలి. ఆ తర్వాత నేను చెప్పింది చూసి మీరు నన్ను చెప్పుతో కొట్టిన నేను పడతాను అని అంటుంది. అవని మాట విన్న పార్వతి ఒక్కటే పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు ఏమైంది అని అడుగుతుంది పార్వతి. మీరు ఒకసారి లోపలికి రెండు అత్తయ్య అని అవని పార్వతిని లోపలికి తీసుకెళ్తుంది. అక్కడ హిట్ లిస్టులో ప్రణతి కోసం చేసిన పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఫోటోలను చూసి పార్వతీ షాక్ అవుతుంది.
స్టేషన్ కు వెళ్లి వీళ్ల ఫోటోలు ఇక్కడున్నాయి ఏంటి అని ఎస్ఐ ని అడుగుతుంది. వీళ్ళిద్దరూ నెంబర్ వన్ ఫ్రాడ్లు. తండ్రి ఏమో కొడుకుకి పెళ్లి సంబంధాలు చూస్తాడు.. కొడుకేమో అమ్మాయిలని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బు నగలను కొట్టేసి పారిపోతాడు. ఇప్పటికే వీరిద్దరిపై చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇదే అరెస్ట్ చేస్తామని ఎస్సీ చెప్పదని ఆ మాట విని పార్వతి షాక్ అవుతుంది.. ఇంతకీ ఆ పెళ్ళికొడుకు వాళ్ళు మీకు తెలుసా అని ఎస్ఐ అడుగుతాడు.
మాకు తెలీదండి ఎవరు మీడియేటర్ ద్వారా పెళ్లి సంబంధం వచ్చింది అంతే అని అవని అంటుంది.. అయితే ఎస్ ఐ మీకు తెలిస్తే మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అంటాడు. ఎవరు ఎలాంటి వారు తెలుసుకోకుండా మీరు పెళ్లి సంబంధాలు చూస్తే ఇలాగే మోసపోవాల్సి వస్తుంది అని ఎస్ఐ అంటాడు ఆ మాట విన్న పార్వతి భయపడుతుంది. ఆస్తుల ఉన్నారని తెలుసుకొని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు పచ్చి మోసగాళ్లని ఎస్ఐ చెబుతారు.. డబ్బుల కోసమే అమ్మాయిల జీవితాలతో ఆడుకునే అలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు అని ఎస్ఐ అంటారు.
ఇక స్టేషన్ నుంచి బయటికి వచ్చిన అవని పార్వతి ఇద్దరూ కూడా నేను పోలీసులు చెప్పడం కాదు అత్తయ్య మీరే వాళ్ల గురించి తెలుసుకోండి. పోలీసులకి వాళ్ళు ఎవరో తెలియదని చెప్పాను లేదంటే మీరు మీ పార్టీకి పోలీస్ స్టేషన్ ఉండే వాళ్లని అంటుంది. అయితే ఆ పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు ఎక్కడుందో నాకు తెలుసు అని అవనితో పార్వతి అంటుంది. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడే అక్షయ్ ప్రణతిని తీసుకొని గుడికి వస్తాడు.
Also Read : రోహిణి పై బాలుకు అనుమానం.. మీనాకు దారుణమైన అవమానం..
అవని పార్వతి ఇద్దరూ అక్కడికి వెళ్తారు. మీరు భరత్ తో ప్రణతి పెళ్లి చేయడం ఇష్టపడకపోవచ్చు కానీ ఇలాంటి ఫ్రాడ్లను చేసి ప్రణతి నీ జీవితాన్ని నాశనం చేయొద్దు అని అవని అంటుంది. పార్వతి నిజం తెలుసుకుని షాక్ అవుతుంది. అత్తయ్య ఏదో పని ఉందని బయటికి వెళ్లారు వెంటనే ఆవిడ గుడికి వస్తుంది అని పల్లవి అంటుంది. పల్లవి శ్రేయ భానుమతి ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. భానుమతికి అనుమానం రావడంతో పల్లవి పూజ కోసమే మనం వెళ్తున్నామని అంటుంది.. కమలొచ్చి గుడికి ఇంత సడన్గా ఏంటి అని అంటాడు. ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…