Pet Dog Kills Owner: ఎవరైన కొత్త వాళ్లను చూస్తే చాలు కొన్ని కుక్కలు వెంటపడతాయి. పిక్కలు పట్టేదాకా వదలవు. అదే వాటిని పెంచుకున్న యజమానులతో మాత్రం గప్‌చుప్‌గా నడుచుకుంటాయి. వారిని మాత్రం ఎమీ చేయవు. అన్ని కుక్కలు ఇలా ఉంటాయనుకుంటే అది పోరపాటే. కుక్కలు కొత్త వాళ్లనే కాదు.. వాటిని పెంచుకుంటున్న యజమానులను సైతం చంపేస్తున్నాయి.
పాత రోజుల్లో కుక్కలను పెంచే వారు.. కాకపోతే వాటిని ఇంట్లోకి రానిచ్చేవారు కాదు.. ఆరు బయట వాటికి స్థావరం ఏర్పాటు చేసి.. వ్యవసాయానాకి వెళ్లేటప్పుడు వాటిని తోడుగా తీసుకెళ్లేవారు.. కానీ ప్రస్తుత రోజుల్లో కుక్కలను పెంచుకోవడం కామన్ అయిపోయింది. పసి పిల్లల్లా వాటిని పెంచుకుంటున్నారు.
కుక్క పేరు చెబితే విశ్వాసానికి ప్రతీక అని అంటారు. పెంపుడు కుక్కలు ఇంటిని సురక్షితంగా కాపాడటమే కాదు, బోలెడు కాలక్షేపాన్ని పంచుతాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. వీధి కుక్కలతో సమానంగా పెంపుడు కుక్కలు సైతం మరణానికి కారణమవుతున్నాయి. ఎంత ప్రేమగా చూసుకున్నా, ఎన్ని వ్యాక్సిన్లు వేయించి జాగ్రత్తగా కాపాడుకున్నా.. కొన్నిసార్లు పెంపుడు శునకాల వల్ల యజమానులు ప్రాణాలు కోల్పోతున్నారు.
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మధురానగర్‌లో ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కకే బలైపోయాడు ఓ యువకుడు. ఎప్పటిలాగే తను పడుకునేటప్పుడు పెంచుకున్న కుక్కను పక్కన పడుకోబెట్టుకున్నాడు పవన్. కానీ తన స్నేహితుడు నిద్రలేపే సరికి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. అతని పెంపుడు కుక్క పవన్ మర్మాంగాలను తినేయడంతో మృతి చెందాడు.
ఏపీలోని కృష్ణాజిల్లాకి చెందిన పవన్‌కుమార్ తన స్నేహితుడు సందీప్‌తో కలసి హైదరాబాద్‌లో ప్రవేటు ఉద్యోగం చేస్తూ గత ఐదేళ్ళుగా మధురానగర్‌లో నివసిస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో భాదడుతున్న పవన్.. ఆసుపత్రికి వెళ్ళి రాత్రి దాదాపు 11 గంటల సమయంలో తన గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు. పక్కనే అతని పెంపుడు కుక్క కూడా పడుకుంది.
Also Read: మధుమిత చివరిగా ఏం చెప్పిందంటే? ఫోన్‌లో కీలక ఆధారాలు!
ఉదయం సందీప్ తలుపు తట్టగా పవన్ లేవలేదు. దాంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిపించి.. తలుపు పగలకొట్టి లోనికి వెళ్ళగా అప్పటికే పవన్ చనిపోయి ఉన్నాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటినిండా రక్తం ఉంది. దాంతో కుక్క అతని మర్మాంగాలు తినడం వల్లనే మృతిచెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. పెంపుడు కుక్క నిజంగానే పవన్‌ను చంపిందా లేదా ఎవరైనా చంపారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.