Telangana politics: తెలంగాణలో రాజకీయాలు ముదిరిపాకాన పడ్డాయా? కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీలో పెడితే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా? మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు జంపింగ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారా? రేపో మాపో కాషాయ కండువా కప్పుకునేందుకు ఆయా నేతలు సిద్ధమయ్యారా? వీరితోపాటు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
అధికారం పోయి ఏడాది తర్వాత కారు పార్టీ భారీ కుదుపులను లోనవుతోంది. కీలక నేతలపై రకరకాల కేసులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కారు దిగేశారు. కమలం గూటికి వెళ్లిపోయారు. రేపో మాపో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలు కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయా నేతలు కమలం తీర్థం పుచ్చుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే గువ్వల పార్టీ మారిపోయారు.
నేతలు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయని కారు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం నివేదిక అసెంబ్లీలో చర్చకు పెడితే తమ పార్టీకి ఇబ్బందులు తప్పవన్నది కొందరు నేతల మాట. దానిపై దర్యాప్తుకు ఆదేశిస్తే కేసీఆర్, హరీష్‌రావులకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
ALSO READ: శంషాబాద్ ఎయిర్ పోర్టులో హైఅలర్ట్.. బాంబు స్వ్కాడ్ ప్రత్యేక తనిఖీలు
ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు వెంటాడుతోందని, ఇంకోవైపు ఫార్ములా కేసు వర్కింగ్ ప్రెసిడెంట్ మెడకు చుట్టుకుందని అంటున్నారు. పరిస్థితి గమనించిన ఆ పార్టీ నేతలు ముందుగా తట్టా బుట్టా సర్దుకుని వలస పోయేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట మీడియా మాట్లాడిన తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
మా పార్టీలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ నుంచి దాదాపు డజను మంది నేతలు రెడీ ఉన్నారని చెప్పారు. అందులో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారట. ఈ నేపథ్యంలో మాజీలు తమ దారి చూసుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ పెద్దలతో ఆయా నేతలు టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆయా నేతలు పార్టీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మాజీలు పార్టీలు మారడంతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో బీఆర్ఎస్ పడింది. రేపటి రోజు బీఆర్ఎస్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
బీజేపీలో చేరనున్న పైలెట్ రోహిత్ రెడ్డి…?
ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి
ఇప్పటికే బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు
రేపో మాపో కాషాయ కండువా కప్పుకోనున్న మరికొందరు
ఈ క్రమంలో… pic.twitter.com/dHi42GgbSz
— BIG TV Breaking News (@bigtvtelugu) August 13, 2025