E-Paper
Advertisement

Allu Arjun : చిరంజీవి దారిలోనే బన్నీ..వారికి దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నాడా..?

Allu Arjun : చిరంజీవి దారిలోనే బన్నీ..వారికి దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నాడా..?
Advertisement

Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పుష్ప తర్వాత పూర్తిగా మారిపోయింది అని చెప్పాలి. ఈ మూవీ వచ్చి ఏడాది దాటినా సరే పుష్ప ఫీవర్ మాత్రం ఇంకా తగ్గలేదు. మొదటి పార్ట్ కంటే రెండవ పార్ట్ భారీ యాక్షన్స్ సన్నివేశాలు ఉండటంతో ఈ సినిమాకు ఇప్పటికీ క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో పుష్ప రీల్స్ ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నార్త్ నుంచి సౌత్ వరకు అల్లు అర్జున్ మేనియా మామూలుగా లేదు.. పుష్ప రాజ్ క్రేజ్ ను అభిమానులు వ్యాపార లాభాల కోసం వాడుతున్నారు. అవును నిజమే.. రీసెంట్ గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో ఒక డాబా ను స్టార్ట్ చెయ్యడమే అందుకు కారణం… అయితే ఈ రెస్టారెంట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇకపోతే ఇలాంటి వాటిని తగ్గించుకోవడం కోసం అల్లు అర్జున్ చిరంజీవిని ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. అసలు మ్యాటరేంటో ఒకసారి తెలుసుకుందాం..

చిరంజీవిని ఫాలో అవుతున్న బన్నీ..

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన పేరును వాడొద్దు, వాయిస్ ఓవర్స్ ను పర్మిషన్ లేకుండా వాడొద్దు అని కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి కోరిక మేరకు కోర్టు కూడా అతని పేరుని ఎక్కడ వాడకూడదు అని తీర్పునిచ్చింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా చిరంజీవిని ఫాలో అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఏకంగా అల్లు అర్జున్ కా ఫ్యాన్స్ ధాబా, పేరుతో ఒక రెస్టారెంట్ వెలసింది. అక్కడ అల్లు అర్జున్ ఫోటోలు, ‘పుష్ప’ సినిమా పోస్టర్లతో హడావుడి చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్రేజ్ ను వాడుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతుంది. చిరు తన పేరును వాడుతున్న వారికి లీగల్ నోటీసులు పంపినట్లు అల్లు అర్జున్ కూడా లీగల్ నోటీసులు ఇస్తాడా? హోటల్ విషయం కావడంతో ఆ హీరోకు చెడ్డ పేరు కూడా వస్తుంది. మరి ఐకాన్ స్టార్ ఎలా రియాక్ట్ అవుతాడో అన్నది ఆసక్తిగా మారింది.

Advertisement

Also Read : పైరసీ సినిమాల వల్ల నిర్మాతలు హ్యాపీ.. లాజిక్ తో వర్మ క్లారిటీ..

అల్లు అర్జున్ – అట్లీ మూవీ అప్డేట్..

పుష్ప 2 మూవీతో ఆర్య విజయాన్ని సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ మూవీ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అల్లు అర్జున్ మాత్రం తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ప్రస్తుతానికి అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.. ఈ మూవీ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. దాంతో సినిమా మొదలైనప్పటి నుంచి అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పుష్ప తర్వాత ఈ సినిమాతో బన్నీ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని సోషల్ మీడియాలో మాత్రమే కాదు.. అటు సినీ ఇండస్ట్రీలో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో పాటుగా భార్య కథనంతో రాబోతున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. మరి దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

 

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×