E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమపై ధీరజ్ సీరియస్.. నిజం చెప్పిన చందు.. సాగర్ ను ఇరికించిన భాగ్యం.. ట్విస్ట్ అదుర్స్..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమపై ధీరజ్ సీరియస్.. నిజం చెప్పిన చందు.. సాగర్ ను ఇరికించిన భాగ్యం.. ట్విస్ట్ అదుర్స్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 14th: భాగ్యం సాగర్ నర్మదలు తాకట్టు పెట్టిన ఆ నగల షాప్ కి వెళ్తారు. అన్ని నగలు తీసుకున్న తర్వాత.. డబ్బులు ఇవ్వమని అడిగితే భాగ్యం 100 రూపాయలు చేతిలో పెడుతుంది. అయితే ఏంటి తమాషా చేస్తున్నారా? అని రామరాజు చిన్నకోడలు చిన్న కొడుకు మీ దగ్గర పది లక్షలు విలువైన నగలు పెట్టి 20 లక్షలు తీసుకున్నారు కదా.. మరి వాళ్ల సంగతేంటి అని అంటుంది. మీరు ముందు వెళ్లి ఆ రామరాజును అడిగి వడ్డీ డబ్బులు తీసుకోండి లేదా ఈ విషయాన్ని అతనికి చెప్పండి అని నర్మదని ఇరికిస్తారు.

ప్రేమ పై ధీరజ్ సీరియస్..

ప్రేమ ధీరజ్ ని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. జ్యూస్ కావాలని అడిగితే ధీరజ్ కి ఎంతో ఓపికగా జ్యూస్ని చేసి ఇస్తాడు. ప్రేమ ఒక పాట పాడుతూ తన భర్త కష్టాన్ని మెచ్చుకుంటుంటే ధీరజ్ మాత్రం కాకి గొంతు లాగా ఉంది అంటూ కామెంట్ చేస్తాడు. వీళ్ళిద్దరి గొడవ కాసేపు ఎపిసోడ్ కి హైలెట్గా నిలుస్తుంది. ఇంకా జ్యూస్ తాగిన ప్రేమ అది చాలా చేదుగా ఉంది అనడంతో కాఫీ అడుగుతుంది. ధీరజ్ వెళ్లి కష్టపడి కాఫీ చేసుకొని వచ్చిన సరే.. ప్రేమ మాత్రం నువ్వు చేసుకొని వచ్చేలోగా నాకు నిద్ర వస్తుంది. నన్ను తీసుకొని వెళ్లి పడుకుంటాను అని అంటుంది. నిన్ను తీసుకెళ్లాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పగానే.. ధీరజ్ సీరియస్ అవుతాడు.

ధీరజ్ కు నిజం చెప్పిన చందు..

Advertisement

ఏంట్రా ప్రేమ మీద సీరియస్ అవుతున్నావ్ ఏంటి అని చందు అరుస్తాడు. అయితే ప్రేమ నిన్ను కాపాడింది కాబట్టి భరిస్తున్నాను. లేకపోతే అమూల్య విషయంలో చేసింది నాకు ఇంకా గుర్తొస్తుంది. తట్టుకోలేకపోతున్నాను అని ధీరజ్ అంటాడు. అసలు అమూల్య విషయంలో ఏం జరిగిందో నువ్వు తెలుసుకోవా అని చందు నిజం చెప్పబోతాడు. ఇప్పుడే అక్కడికి నర్మదా అమూల్య కూడా వచ్చేస్తారు. చందు నిజం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే నర్మదా ప్రేమ ఇద్దరు ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజంగా ఏం జరిగిందో నేను చెప్పాలి అని చందు విశ్వం ని ప్రేమించడానికి కారణం వల్లి. తను ఇదంతా చేసింది ప్రేమ కాదు అని నిజాన్ని బయటపెడతాడు.

వల్లి మోసం తట్టుకోలేకపోతున్నా…

వల్లి నాన్న పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసుకుంది. ఇంటి పెద్ద కోడలు అని పెత్తనం చేతికి ఇచ్చి ఎంతో బాగా చూసుకోవాలని చూసిన నాన్ననే తను మోసం చేసింది అని చందు ఎమోషనల్ అవుతాడు.. చందు చెప్పిన మాటలు విని ధీరజ్ ఏంటి అన్నయ్య నువ్వు చెప్పేది అని ఎంత చెప్పినా సరే చందు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక అమూల్య కూడా వల్లి వదిన ఇదంతా చేసింది అని చెప్పడంతో ధీరజ్ ప్రేమను ఇన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకున్నాను అని బాధపడిపోతూ ఉంటాడు..

రామారాజుకు నిజం చెప్పిన సేటు..

Advertisement

సాగర్ కి డబ్బులు ఇచ్చిన సేటు భాగ్యం చెప్పడంతో రామరాజు దగ్గరికి వెళ్తాడు. ఆ రామరాజు మాత్రం తన కొడుకు చేసినప్పుడు నేనెందుకు తీరుస్తాను వెళ్లి తనని అడగండి అని ఎంత చెప్తున్నా సరే సేటు మాత్రం మీరు నన్ను మోసం చేయకండి అని అడుగుతాడు. మీ అబ్బాయి అని నమ్మకంతోనే నేను ఇచ్చాను అని అంటాడు. ఇక రామరాజు చేసేదేమీ లేక సాగర్ తో ఈ విషయం గురించి మాట్లాడాలి అని కోపంగా ఇంటికి వస్తాడు. అటు సాగర్ మాత్రం తనకి జీతం వచ్చిందన్న ఆనందంలో అందరికీ బట్టలు కొనుక్కొని తీసుకొని వెళ్తాడు.

చందుకోసం కన్నీళ్లు పెట్టుకున్న వల్లి..

వలి చందు కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అని వాయిస్ మెసేజ్ పెడుతుంది. కానీ తను మాత్రం మెసేజ్ చూసిన సరే రిప్లై ఇవ్వకుండా ఉంటాడు. వల్లి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతాడు. ధీరజ్ వెళ్లి ప్రేమ దగ్గరకి వెనకాల నుంచి హగ్ చేసుకుంటాడు. అయితే ప్రేమ దాన్ని చూసి ఎమోషనల్ అవుతుంది. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ప్రేమ చిగురిస్తుందని అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Avani : నరకం.. భయంకరమైన నిజాలను బయటపెట్టిన అవని..

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×