Illu Illalu Pillalu Today Episode may 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. భాగ్యం ప్రేమను పనిమనిషి చేస్తుంది.. అది చూసిన ధీరజ్ ప్రేమ నువ్వేంటి పని చేస్తున్నావని అడుగుతాడు. నేనే చెప్పాను బాయ్ కాఫీ గచ్చు మీద పడింది ఇంట్లో ఎవరూ చూడడానికి లేరు. ఎండిపోయే చండాలంగా తయారవుతుందని నేనే చెప్పాను అని భాగ్యం అంటుంది. నా భార్య ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా అపురూపంగా చూసుకున్నారు. కాలిని కింద పెట్టనివ్వకుండా మహారాణి లాగా పెంచారు. నేను కూడా నా భార్యని మా ఇంట్లో అలానే చూసుకుంటున్నాను. ఇలాంటి పనులన్నీ తనకు రాబోతున్న చేయదు అని భాగ్యంకి షాక్ ఇస్తాడు ధీరజ్. అయితే ఇది ఎవరు చేస్తారు ఇటు ఇవ్వండి నేనే చేసుకుంటాను అని భాగ్యం అంటుంది. దానికి నేను చేస్తానని మొత్తం చేస్తాడు. భార్య మీద ఎంత ప్రేమ.. భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమయిపోయింది అని భాగ్యం అనుకుంటుంది. సడెన్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన నర్మదా భాగ్యంతో బాబాయ్ ఎక్కడ పిన్ని అని అడుగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మదా ఆనందరావుని పట్టించాలని కష్టపడు వస్తుంది కానీ ఆనందరావు తెలివిగా ముందే ఇంట్లోకి వచ్చేసి గండం నుంచి బయటపడతాడు. ఇక అందరూ కూల్ అయ్యాక నల్లపూసల గుచ్చే కార్యక్రమాన్ని మొదలుపెడదామని భాగ్యం అంటుంది. ఈ పూజ కార్యక్రమం అయిపోయేలోగా నర్మదను ఏడిపించే తీరుతానని భాగ్యం మనసులో అనుకుంటుంది. నల్లపూసల గుచ్చే కార్యక్రమానికి టైం అయిందని అక్కడికి వెళ్లి పూజ చేయాలని భాగ్యం అందర్నీ పూజ గదిలోకి తీసుకెళ్తుంది.. అందరూ సరదాగా కూర్చొని నల్లపూసలు వేస్తూ ఉంటారు. అయితే భాగ్యం నర్మద చేత ఎలాగైనా కన్నీళ్లు పెట్టించాలి లేకుండా అంటే నాది బురిడీ బ్యాచ్ అని బయట పెట్టాలనుకుంటాదా దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని ప్లాన్ చేసి తన పక్కన ఉన్న ఆవిడకి అసలు విషయం చెప్తుంది.
ఆవిడ ఇదిగో భాగ్యం రామ రాజు గారి ఇద్దరు కోడలు మెడల్లో చూస్తుంటే నల్లపూసలు వేయలేదు కదా అని అడుగుతుంది. ఓ నీకు ఈ విషయం తెలియదా వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అన్నమాట అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా ఒప్పుకోలేదు. ఇక నల్లపూసలు ఎవరు వేస్తారు అని భాగ్యం అనగానే నర్మదాప్రేమ ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. వేదవతి వదిన గారు ఇప్పుడు అవన్నీ మీకెందుకు మా కోడల గురించి ఆవిడ అడిగిందా? మీరు ఆవిడకి చెప్పాల్సిన అవసరం లేదు కదా అనేసి అంటుంది..
భాగ్యం ఆవిడకి తెలియక అడిగింది వదిన అందుకే నేను చెప్తున్నాను వాళ్ల గురించి నేను తప్పుగా ఎందుకు చెప్తాను. ఆళ్ళిద్దరు కూడా నా బిడ్డ లాంటోళ్లే మీ మనసు నచ్చుకుంటే నన్ను క్షమించండి అని అడుగుతుంది. మొత్తానికి నల్లపూసల కార్యక్రమం కాస్త సంతోషంగా జరిగిపోతుంది. ధీరజ్ ప్రేమ డల్లుగా ఉండడం చూసి ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోతే ఎటువంటి బాధ ఉండదు ప్రేమ అని అంటాడు. మాట విన్న ప్రేమ సంతోషంగా ఉంటుంది కాస్త దూరం వెళ్లిన తర్వాత బైక్ ఆగిపోతుంది ప్రేమ కళ్ళు తిరిగి పడిపోతుంటే ధీరజ్ పట్టుకుంటాడు. ఈ బైక్ ఇప్పట్లో బాగేలా కనిపించట్లేదు కానీ మనం ఆటోలు ఇంటికి వెళ్దాం పద అని బైక్ ని పక్కన పార్కు చేసి ఇద్దరు కలిసి ఆటోలో ఇంటికి వెళ్తారు.
అటు సాగర్ నర్మదాలు బైక్ మీద వెళ్తారు. నర్మదను సాగర్ ఆఫీస్ దగ్గర దిగబెడతారు. అందరూ ఇంటికి రావడం చూసి రామరాజు అందరు వచ్చేసారా చిన్నోడు ప్రేమ ఇంకా రాలేదేంటి ఎక్కడికెళ్లారు అని అడుగుతాడు. బుజ్జమ్మ వాళ్ళిద్దరూ బైక్ మీద వస్తున్నారండి అని అంటుంది. అప్పుడే ధీరజ్ ప్రేమ ఇద్దరూ ఆటోలో దిగుతారు. వాళ్ళిద్దరి ఇంట్లోకి రాగానే ఏంటి మీరిద్దరూ బండి మీద వస్తున్నారని మీ అమ్మ చెప్పింది మరి మీరిద్దరేంటి ఆటోలో వచ్చారు అని అడుగుతాడు. బండి పాడైపోతే పక్కన పార్కు చేసి ఆటో ఎక్కొచ్చాము అని ధీరజ్ అంటాడు. ఏంటి బండి పాడయిందా? అయితే బండిని అక్కడ పెట్టకుండా బాగు చేయించుకుని తీసుకు రావాల్సింది పోయి అక్కడ ఎక్కడో పెట్టొచ్చానంటావ్ ఏంట్రా నీ కొంచమైనా బుద్ధుందా అని రామరాజు సీరియస్ అవుతాడు. ఇంత వయసు వచ్చినా నీకు ఇంకా బుద్ధి రాలేదా అని అరుస్తుంటే శ్రీవల్లి నవ్వుకుంటుంది. రేపటి తో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..