Nandamuri Balakrishna:సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలుగా కొనసాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). తాజాగా ఈయనకు ‘పద్మభూషణ్’ అవార్డు వరించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతులమీదుగా ఆ అవార్డును కుటుంబ సభ్యులు, అభిమానులు, పలువురు ప్రతినిధుల సమక్షంలో అందుకున్నారు బాలయ్య. ఇక బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడంతో హిందూపురంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈయన పలు విషయాలపై స్పందించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కూడా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
హిందూపురంలో బాలయ్యకు ఘనంగా సన్మానం..
సన్మానం అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ..”హిందూపురం నాకు రెండవ పుట్టినిల్లు లాంటిది. ఇది నందమూరిపురం. ఇక్కడ పౌర సన్మాన సభ నిర్వహించడం. నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారుకులైన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా కార్యక్రమం కంటే కూడా ఇది అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న పండుగ. మీ అభిమానం నా పూర్వజన్మ సుకృతం. ఈ సందర్భంగా నాకు జన్మనిచ్చిన రామారావు గారిని మరొకసారి గుర్తు చేసుకుంటున్నాను.నాకు పద్మభూషణ్ అవార్డు చాలా ఆలస్యంగా ఇచ్చారని చాలామంది అంటున్నారు. కానీ నాకు సరైన సమయంలోనే ఇచ్చారని నేను భావిస్తున్నాను.
నన్ను చూసుకొని నాకే పొగరు..
ఎందుకంటే మా నాన్నగారి శతజయంతి నిర్వహించుకోవడం, మూడోసారి నేను హిందూపురం కి ఎమ్మెల్యేగా గెలవడం, అటు సినిమాల పరంగా నాలుగు వరుస విజయాలు అందుకోవడం, హీరోగా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి కావడం ఇన్ని మంచి శుభ పరిణామాల మధ్య నాకు పద్మభూషణ్ రావడం మరింత సంతోషంగా ఉంది. 50 ఏళ్ల కథానాయకుడిగా కొనసాగిన వ్యక్తి ప్రపంచంలో మరొకరు లేరు. నాకు అంతగా శక్తినిచ్చిన తెలుగుజాతికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏం చూసుకొని బాలకృష్ణకు అంత పొగరు అని అంటూ ఉంటారు. నన్ను చూసుకొని నాకే పొగరు” అంటూ బాలకృష్ణ తెలిపారు. ఇక “బసవతారకం ఇండో -అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా, శ్రీరామరాజ్యంలో రాముడిగా నటించడం ఇలా ప్రతిదీ నా జీవితంలో నాకు కలిసొచ్చింది” అంటూ కూడా బాలయ్య తెలిపారు. మొత్తానికైతే ఈ కార్యక్రమంలో బాలయ్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బాలయ్య సినిమాలు.
బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ‘డాకు మహారాజ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య.. ఇప్పుడు అఖండ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభం అయింది. పైగా మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగరాజ్ లో కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. నిజమైన అఘోరీల మధ్య ఈ సినిమా షూటింగ్ జరగడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత మరో డైరెక్టర్ కి బాలయ్య అవకాశం ఇవ్వడం జరిగింది.
also read:Honey Rose: నైట్ పార్టీలో అతనితో అలాంటి ఫోజులు..ఫొటోస్ వైరల్..!