Hyderabad Crime news: పచ్చని కాపురంలో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. ఫలితంగా ఇల్లాలిని కడ తేర్చుకున్నారు. ఆయా ఫ్యామిలీలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన హైదరాబాద్ లో జరిగింది. భార్య అక్కతో ఎఫైర్ పెట్టుకున్నాడు ఆ వ్యక్తి, చివరకు భార్యను చంపేసి, గుండెపోటుతో చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇంతకీ అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
అసలేం జరిగింది?
పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అనిల్. ఆయన సొంతూరు ఖమ్మం పట్టణం. ప్రస్తుతం ఆయన పోలీసు డిపార్టుమెంటులో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం జీడిమెట్లలో ఉంటున్నాడు. అనిల్ భార్య విషయానికి వద్దాం. ప్రస్తుతం రేగుల సాహితి వయస్సు 31 ఏళ్లు. ఆమె సొంతూరు కొత్తగూడెం జిల్లా పాల్వంచ. సాహితిని వివాహం చేసుకున్నాడు అనిల్. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
పిల్లలతో నిత్యం ఇళ్లంతా సందడిగా ఉండేది. కాకపోతే అనిల్ మనస్సు రకరకాల ఆలోచనలతో నిండిపోయేది. వాటిని పంచుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడేవాడు కాదు. అయితే అనిల్.. భార్య సాహితి అక్కతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో భార్య సాహితిని వేధించడం మొదలుపెట్టాడు. ఉన్నట్లుండి ఎందుకు తన భర్త అలాగ చేస్తున్నాడో తెలీదు. ఓసారి సీక్రెట్‌గా కనిపెట్టింది సాహితి.
వీడు మామూలోడు కాదు
భార్యకు తన సీక్రెట్ తెలిసిన తర్వాత ఓపెన్ అయిపోయాడు భర్త. అనిల్ వ్యవహారంపై పలుమార్లు పెద్దల ముందు పంచాయితీ జరిగింది. అయినా ఏ మాత్రం మార్పు రాలేదు. మూడేళ్లుగా సాహితి అక్కతో తన రిలేషన్ షిప్‌ని కొనసాగించాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. తన అక్కను వదిలేయాలని అనిల్‌తో గొడవపడేది భార్య సాహితి.
ALSO READ: ప్రాణాలు తీసిన పెంపుడు కుక్క, మర్మాంగాలపై దాడి
తన చెల్లిని వేధిస్తున్న విషయం సాహితి అక్కకు తెలిసింది. తనతో సహజీవనం చేస్తేనే మీ చెల్లి సాహితితో కాపురం చేస్తానంటూ స్వాతిని బెదిరించి ఆమెని లొంగదీసుకున్నాడు అనిల్ కుమార్. ఏం జరిగిందో తెలీదు శనివారం అత్తింటికి ఫోన్ చేసిన అనిల్ కుమార్, తన భార్య సాహితి గుండెపోటుతో మరణించిందని చెప్పాడు. వెంటనే షాకైన సాహితి పేరెంట్స్, ఎకాఎకీన హైదరాబాద్‌కు పయనమయ్యారు.
పోలీసులకు ఫిర్యాదు, ఆపై దర్యాప్తు
హైదరాబాద్‌కు వచ్చిన సాహితి పేరెంట్స్ అనుమానం వచ్చింది. గుండెపోటుతో చనిపోతే ఒంటిపై గాయాలు ఎలా ఉన్నాయి? అని అనిల్‌ని నిలదీశారు. పరిస్థితి గమనించిన అల్లుడు అక్కడ పరారయ్యాడు. దీంతో సాహితి మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చారు బంధువులు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లుడు అనిల్ కుమార్ తీవ్రంగా కొట్టి తమ కుమార్తెని చంపాడని అంటున్నారు ఫిర్యాదులో ప్రస్తావించారు సాహితి తల్లిదండ్రులు. పోలీసుల విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో?
భార్యను కొట్టి చంపిన భర్త..!
హైదరాబాద్ లో వివాహిత సాహితి అనుమానాస్పద మృతి
గుండెపోటుతో చనిపోయిందని చెప్పిన భర్త అనిల్
సాహితి మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానం
అల్లుడు అనిల్ తమ కుమార్తెను కొట్టి చంపాడని సాహితి తల్లిదండ్రుల ఫిర్యాదు
భార్య అక్కతో అనిల్ కు వివాహేతర సంబంధం..! pic.twitter.com/lyE0LDMgLs
— BIG TV Breaking News (@bigtvtelugu) May 4, 2025