Big tv Kissik Talks: బిగ్ టీవీ (Big Tv)ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు హాజరవుతూ వారి వ్యక్తిగత వృత్తిపరమైన విషయాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం 29వ ఎపిసోడ్ లో భాగంగా టిక్ టాక్ ఫేమ్ భాను(Tik Tok Bhanu) హాజరై సందడి చేశారు. ఈమె ఈ కార్యక్రమంలో భాగంగా తన జర్నీ గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి, తన రిలేషన్షిప్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ స్వస్థలం ఏంటని ప్రశ్నించారు .దీంతో తాను విజయవాడకు చెందిన అమ్మాయి అని తెలిపారు. అయితే విజయవాడలో భారీగా ఆస్తులు ఉన్నాయట కదా సగం విజయవాడ మొత్తం మనదే అంట కదా అంటూ ప్రశ్నించారు. వర్ష ఇలా అడగడంతో భాను తన ఆస్తులు గురించి వివరించారు. విజయవాడలో సగం నాది కాదు గాని… నా లైఫ్ కు ఎలాంటి డోకా లేదని అమ్మానాన్న చాలా బాగా సంపాదించి పెట్టారని తెలిపారు.అయితే వారు సంపాదించిన దానిమీద బ్రతకడం నాకు ఇష్టం లేదు మనకంటూ గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతోనే టిక్ టాక్ ద్వారా అందరి ముందుకు వచ్చానని తెలిపారు. ఇక తనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం రాను రాను అంటుంది అనే రీల్ బాగా గుర్తింపు తెచ్చిందని తెలిపారు. ఇక తన తండ్రి బిజినెస్మెన్ కావడంతో పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టినట్లు తెలిపారు. ఇక భాను సైతం పెద్ద ఎత్తున టీవీ షోలు, ఇంస్టాగ్రామ్ ,యూట్యూబ్ వీడియోలు అంటూ భారీగా సంపాదిస్తున్నారు.
ఇక ప్రస్తుతం భాను దొనకొండ అనే ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించబోతున్నారని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. తన అమ్మ 17 సంవత్సరాల క్రితం నాగేంద్ర స్వామి కళ్యాణం జరిపించారని అందుకే అక్కడ ఆలయం నిర్మించబోతున్నాము అంటూ వారి ఫ్యామిలీ విషయాలను తెలిపారు. ఇలా భాను కుటుంబ సభ్యులు ఆస్తులు సంపాదించడమే కాకుండా ఎన్నో మంచి సేవ కార్యక్రమాలను కూడా చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విజయవాడ వరదల సమయంలో వీరు చేసిన సహాయం గురించి వర్ష ప్రశ్నించారు.
గత ఏడాది విజయవాడలో పెద్దఎత్తున వరదలు రావడంతో చాలామంది నిత్యవసరాలను కూడా కోల్పోయారు. ఆ సమయంలో ఎంతోమంది వివిధ రకాల సహాయాలను అందించారు .అయితే దాదాపు ఒక వారం రోజులపాటు కొన్ని ప్రాంతాలలో ఉన్న వారందరికీ కూడా స్వయంగా తామే ఫుడ్ సరఫరా చేసాము అంటూ ఈ సందర్భంగా భాను తెలియజేశారు. ఇలా ఈ కుటుంబం చేసిన ఈ పని తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టిక్ టాక్ భానుగా అందరికీ పరిచయమైన ఈమె లండన్ భానుగా గుర్తింపు పొందారు. అసలు ఈ లండన్ గోల ఏంటి అంటూ కూడా వర్ష ప్రశ్నించడంతో.. నాకు ఒకే చోట ఒకే దానిపై పని చేస్తూ బ్రతకడం ఇష్టం ఉండదు అందుకే తాను ఎమ్మెస్ చదవడం కోసం లండన్ వెళ్లానని అయితే అక్కడ ఒంటరిగా ఉండలేక తిరిగి ఇండియా వచ్చేసాను అంటూ ఈ సందర్భంగా తన పర్సనల్ విషయాలను ఈ సందర్భంగా బయటపెట్టారు.
Also Read: Manchu Manoj: నా వల్లే తారక్ చేతికి గాయం.. అసలు విషయం చెప్పిన మనోజ్!