Big tv Kissik Talks: టిక్ టాక్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను అందుకున్న కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా టిక్ టాక్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన వారిలో భాను(Bhanu) ఒకరు. నిత్యం ఇంస్టాగ్రామ్ ద్వారా ఎన్నో రీల్స్ షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్న భాను వర్ష అడిగే ప్రశ్నలకు ఎన్నో సమాధానాలు తెలియజేశారు. అయితే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా భాను విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ కార్యక్రమంలో వర్ష కొన్ని పదాలు చెబుతూ అవి ఎవరికి సూట్ అవుతాయనే విషయాలను అడిగారు. నాటీ అనే పదం ఎవరికి ఇస్తావు అంటూ ప్రశ్నించడంతో వెంటనే హైపర్ ఆది (Hyper Aadi) చాలా నాటీ అంటూ ఈమె ఆది గురించి మాట్లాడారు . ఆదిగారు ప్రతి ఒక్కరికి చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారని, అందరితో చాలా సరదాగా ఉంటారంటూ తెలియజేశారు. రొమాంటిక్ రాజా ఇది ఎవరికి ఇస్తారు అంటూ ప్రశ్నించడంతో వెంటనే విజయ్ దేవరకొండ పేరు చెబుతూ మెలికలు తిరిగిపోయారు. విజయ్ దేవరకొండ చాలా రొమాంటిక్ అంటూ తెలియజేశారు.
ఇక ఇతని చూస్తే హీరోలా ఉన్నారనీ ఎవరిని చూస్తే అనిపిస్తుంది అంటూ వర్ష ప్రశ్నించడంతో వెంటనే శేఖర్ మాస్టర్(Sekhar Master) పేరు చెప్పారు. శేఖర్ మాస్టర్ అందరితో మాట్లాడటం కానీ అందరిలో కలిసిపోవడం చూస్తే మాత్రం ఆయన హీరో అనే భావన నాకు కలుగుతుంది అంటూ సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పటివరకు నేను శేఖర్ మాస్టర్ గారితో ఎక్కడ పని చేయలేదు కానీ , మాస్టర్ ని చూస్తే అలా అనిపిస్తుందని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇలా వీరందరి గురించి భాను చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె రిలేషన్ షిప్స్ గురించి, లవ్ ఫెయిల్యూర్ గురించి కూడా ఎన్నో విషయాలను తెలియచేశారు. ఇటీవల కాలంలో చాలామంది పెళ్లి వయసు దాటిపోయిన పెళ్లి గురించి ఆలోచించకుండా సింగల్ గా బతుకుతున్నారు అయతే అలా సింగిల్ గా బ్రతకడం తప్పని, ప్రతి మనిషికి మరొక మనిషి తోడు అవసరమని తెలియజేశారు. చాలామంది పెళ్లయిన వెంటనే విడాకులు తీసుకొని విడిపోతున్నారు ఆ విషయాల గురించి కూడా భాను మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు కూడా కాస్త అడ్జస్ట్మెంట్ అనేది అలవాటు చేసుకుంటే విడాకులు ఉండవని ఈమె తెలియజేశారు. ఇక తాను కూడా గత పది సంవత్సరాలుగా ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉంటున్నామని మా మధ్య కూడా ప్రతిరోజు ఎన్నో గొడవలు వస్తాయి కానీ మరుసటి రోజుకు ఆ గొడవలు గురించి మర్చిపోవడం వల్లే ఇన్నేళ్ల మా ప్రయాణం కొనసాగుతుందని తమ రిలేషన్ గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.
Also Read: Anasuya: బికినీలో సెగలు పుట్టిస్తున్న రంగమ్మత్త.. చూపు పక్కకు తిప్పుకోనివ్వట్లేదుగా?