Big tv Kissik Talks: జబర్దస్త్ వర్ష(Varsha) యాంకర్ గా బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సెలబ్రిటీలు హాజరవుతూ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా టిక్ టాక్ స్టార్ భాను (Bhanu) హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా భాను తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారు కచ్చితంగా సినిమాలలో నటించాలని సినిమా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే భాను సైతం సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారా? హీరోయిన్ గా ఛాన్స్ వస్తే చేస్తారా? అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు భాను సమాధానం చెబుతూ తాను హీరోయిన్గా ఛాన్స్ వస్తే అసలు సినిమాలలో నటించిన తెలిపారు. తాను ఒక కూతురిగా ఒక చెల్లిగా చేసే పాత్రలు వస్తే తప్ప సినిమాలలో నటించనని తెలియజేశారు. తనకు రొమాంటిక్ సన్నివేశాలు లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం అసలు ఇష్టం ఉండదని అందుకే హీరోయిన్ గా అవకాశాలు వచ్చిన తాను సినిమాలు చేయనని భాను వెల్లడించారు. ఒకవేళ అవకాశాలు వచ్చిన చెల్లిగా, కూతురిగా మాత్రమే నటిస్తాను అంటూ క్లారిటీ ఇచ్చారు.
తనకు అలాంటి పాత్రలలో నటించడానికి సౌకర్యవంతంగా ఉండదని తెలిపారు. ఇకపోతే ఎన్నో రీల్స్ చేస్తూ షేర్ చేసే భాను వస్త్రధారణ పై ఆమె చేసే రీల్స్ పై కూడా విమర్శలు వస్తుంటాయి సినిమా అవకాశాల కోసమే ప్రయత్నిస్తున్నావా? అంటూ చాలామంది కామెంట్లు చేస్తుంటారు మరి వీటిపై మీ సమాధానం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ నేను సినిమా అవకాశాల కోసమే ట్రై చేస్తున్నానని ఎవరికి చెప్పలేదు. అలాగే చాలామంది మీకు ఎవరు ఆఫర్లు ఇస్తారు? అంటూ కూడా కామెంట్ చేస్తారు. నాకు సినిమా ఆఫర్లు కావాలని ఎవరినైనా అడిగానా అంటూ ఈమె కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
తాను రీల్స్ చేస్తున్నాను ఇంస్టాగ్రామ్ లో వీడియోలు పెడుతున్నాను అంటే సినిమా అవకాశాల కోసం కాదని, నాకు ఇష్టం కాబట్టే అలా చేస్తున్నానని తెలిపారు. నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ షేర్ చేశాను అంటే అది నాకు నచ్చింది కాబట్టి షేర్ చేస్తాను నాకు నచ్చకపోతే నేను ఏ పని చేయనని ఈమె ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. అయితే గత పది సంవత్సరాల పాటు ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్న భాను తన కోసమే సినిమా ఆఫర్లను వదులుకుంటున్నారా? అంటూ కూడా వర్ష ప్రశ్నించారు. రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం సినిమాలలో హీరోయిన్ గా చేయటం తన కాబోయే భర్తకు ఇష్టం లేక కాదని, నాకే నచ్చదని తెలిపారు. అయితే భాను ఇంటర్ నుంచి ఒక వ్యక్తితో రిలేషన్లో ఉన్నట్టు వెల్లడించారు. అతి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ఈ సందర్భంగా భాను క్లారిటీ ఇచ్చారు.
Also Read: Big tv Kissik Talks: వామ్మో భారీగా ఆస్తులు సంపాదించిన టిక్ టాక్ భాను…మామూలుగా లేదే!