E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: రాజేశ్వరికి నిజం చెప్పేసిన అవని.. చక్రధర్ కు పల్లవి వార్నింగ్..భరత్ మాటతో మీనాక్షి కన్నీళ్లు..

Intinti Ramayanam Today Episode: రాజేశ్వరికి నిజం చెప్పేసిన అవని.. చక్రధర్ కు పల్లవి వార్నింగ్..భరత్ మాటతో మీనాక్షి కన్నీళ్లు..
Advertisement

Intinti Ramayanam Today Episode April 11th: డాక్టర్లు ఆమెకు ఏమి ప్రమాదం లేదు అని చెప్పగానే అవని సంతోషంగా ఫీల్ అవుతుంది.. అయితే రాజేశ్వరి స్పృహలోకి రాగానే అవని ఎంత చెప్తున్నా సరే తాను మాత్రం మొండిగా ప్రవర్తిస్తుంది. నన్నెందుకు కాపాడావు. నేను ఈ భూమ్మీద ఉండడానికి ఇష్టపడడం లేదు నన్ను చచ్చిపో అని అంటుంది.. అయితే అవని మీరు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు. మీరు మీ కొడుకు కోసమైనా బతకాలి కదా అని అనగానే ఏంటి నాటకాలు ఆడుతున్నావా నాకున్నది కూతురు ఒక్కటే అని రాజేశ్వరి అంటుంది.. కానీ రాజేశ్వరికి భరత్ తన కొడుకు అన్న విషయాన్ని చెప్తుంది. మాట వినగానే ఎమోషనల్ అయిపోతుంది రాజేశ్వరి.

పల్లవి పై కమల్ సీరియస్.. 

రాజేశ్వరి తన కొడుకు భరత్ అని ఎంత చెప్తున్నా సరే అవని నాటకం ఆడుతుంది అని అనుకుంటుంది. అయితే మాత్రం నేను చెప్పేది నిజమే పిన్ని అని అంటుంది.. ఇక అప్పుడే డాక్టర్ రావడంతో డాక్టర్ కి రాజేశ్వరి ఇవన్నీ పీకేసుకున్నారు. కత్తెర పొడుచుకోవాలని అనుకున్నారు అని అవని అంటుంది.. ఇక అవన్నీ బయటికి రాగానే రాజేశ్వరి కి స్పృహ వచ్చిందని అనగానే వచ్చింది బామ్మ అని అంటుంది. అయితే పల్లవి వెళ్లి చూడాలని అనుకున్న అవని మాత్రం డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు. లోపలికి వెళ్లడానికి వీలులేదని అన్నారు అని పల్లవితో అంటుంది. డాక్టర్ చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్లి చూడొచ్చు అని అవని అనగానే పల్లవి రెచ్చిపోతుంది. కానీ కమల్ మాత్రం డాక్టర్ చూస్తున్నారు కదా. ఇది హాస్పిటల్ అనుకుంటామా మార్కెట్ అనుకుంటున్నావా అలా అరుస్తున్నావు అని అంటాడు..

చక్రధర్ పై పల్లవి సీరియస్..

Advertisement

చక్రధర్ లోపలికి రావడంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. నువ్వెందుకు లోపలికి వచ్చావు నీ వల్లే కదా మా మామ్ కు ఈ పరిస్థితి వచ్చింది.. నీ ఈ వయసులో రెండో పెళ్ళాం కావాల్సి వచ్చింది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్లావు అదే మమ్మీని ఇంకా బాధ పెట్టింది హాస్పిటల్ పాలు ఎలా చేసింది అని పల్లవి అంటుంది.. నువ్వు ఇక నుంచి వెళ్ళిపో అని చక్రధర్ ని పల్లవి దారుణంగా మాట్లాడుతుంది.. రేపు నేను గాని మమ్మీ గాని చచ్చిపోయిన నువ్వు చూడడానికి వీల్లేదు అని పల్లవి అనడంతో చక్రధర్ బాధపడతాడు.

చక్రధర్ కు నిజం చెప్పిన అవని.. 

మావయ్య మీరు పదండి బయటకి అనేసి చక్రధర్ ని అక్షయ్ బయటకు తీసుకొని వస్తాడు. మీరు మీనాక్షి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మేమే ఇదంతా చేసాము అని అత్తయ్య మా ఇంటికి వచ్చి పెద్ద గొడవ పెట్టుకుంది. అవని ఇదంతా చేసింది అని తను తనపై ఎన్నో మాటలు అంది.. పిన్నికి ఇలా జరగడానికి కారణం మనమే అని చాలా కోపంగా ఉంది నాన్న నువ్వు ఇక్కడికి వచ్చి తప్పు చేసావు అని చక్రధాన్ని అవని అడగగానే ఇప్పుడు రాజేశ్వరి పరిస్థితి ఎలా ఉందమ్మా అని చక్రధర అడుగుతాడు. పర్వాలేదు నాన్న డాక్టర్లు బాగానే ఉంది అని చెప్పారు. అవని పిన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి నేను భారతీయ తన కొడుకుని నిజం చెప్పాను నాన్న అని అవని అంటుంది..

తప్పు చేశావు అవని..

Advertisement

రాజేశ్వరి కండిషన్ బాగోలేదు కదమ్మా నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చక్రధర అడుగుతాడు.. తన ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి ఇలా చెప్పాను అని అంటుంది.. తన కొడుకుని తనకి దూరం చేసింది నేను మీ అమ్మే అని మళ్ళీ గొడవ చేస్తుందేమో అని చక్రధర్ భయపడుతూ ఉంటాడు. కానీ అవని మాత్రం ఇక చేసేది ఏమీ లేదు నాన్న ఆ దేవుడి మీద భారం వేసి ఆయన ఎలా నడిపిస్తే అలానే చూసుకోవాలి అని అంటుంది.. ఏం జరుగుతుందో అని నాకు టెన్షన్ గా ఉందని చక్రధర్అం టారు.

మీనాక్షికి టెన్షన్..

మీనాక్షి పొద్దున వెళ్లిన చక్రధర్ఇంకా ఇంటికి రాలేదు అని కంగారు పడిపోతూ గుమ్మం చుట్టూ ఎదురు చూస్తూ ఉంటుంది.. పొద్దున అనగా వెళ్లినా మీ చక్రధర్ మామయ్య ఇంకా ఇంటికి రాలేదు.. అని మీనాక్షి అనగానే వస్తాడులే అత్తయ్య అని ప్రణతి అంటుంది.. అప్పుడే ఇంటికి వచ్చిన భరత్ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు ఆయన గారు లేరా అని అడుగుతాడు.. మనకు కావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు అని ఎవరికోసమైనా టెన్షన్ పడతారు అని భరత్ తో మీనాక్షి అంటుంది. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఆయన గురించి నువ్వు ఆలోచిస్తున్నావు గాని మనం పడ్డ బాధల గురించి నువ్వు ఆలోచించట్లేదు అని మీనాక్షి పై సీరియస్ అవుతాడు భరత్. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ‘చామంతి’ రోజా రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Related News

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Big Stories

Advertisement
×