E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కొడుకుకు గోరుముద్దలు పెట్టిన రాజేశ్వరి.. ఇంట్లో చిచ్చుపెట్టిన పల్లవి .. శ్రీయ దూరం అవుతుందా..?

Intinti Ramayanam Today Episode: కొడుకుకు గోరుముద్దలు పెట్టిన రాజేశ్వరి.. ఇంట్లో చిచ్చుపెట్టిన పల్లవి .. శ్రీయ దూరం అవుతుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode April 20th: భరత్ తన ఆఫీసులో ఉన్నాడన్న సంతోషంతో రాజేశ్వరి తన కొడుకు తన దగ్గరే ఉన్నాడని చాలా సంతోషంగా ఉంటుంది. భరత్ తినడానికి ఏదైనా తెచ్చుకున్నావా అని తన దగ్గరికి వెళ్లి అడుగుతుంది. ఏంటి ఓన్లీ ఆవకాయ మాత్రమే తెచ్చుకున్నావు అని భరత్ ని అడగ్గానే ఇవాళ టైం లేదు కదా మేడం అందుకే ఇలా పెట్టారు అని ఏదో ఒకటి చెప్పి సర్దుకుంటాడు.. కాని రాజేశ్వరి మాత్రం తన కొడుకుకి తన చేతితోనే వడ్డించాలి అని అనుకుంటుంది.. అయితే భరత్ ని తన క్యాబిన్ కి తీసుకుని వెళ్లి దగ్గరుండి ప్రేమగా వడ్డిస్తుంది. భరత్ నీకు ఇష్టమైన ఏదో చెప్పు అని అడుగుతుంది కానీ భరత్ మాత్రం మొహమాట పడినా కానీ ఇప్పుడు మాత్రం నాకు చేపల పులుసు అంటే చాలా ఇష్టమని చెప్తాడు.

కొడుకుకు గోరుముద్దలు పెట్టిన రాజేశ్వరి..

కొడుకు కోసం చేపల పులుసు చేసుకొని వచ్చి దగ్గరుండి తినిపించాలని రాజేశ్వరి అనుకుంటుంది. ఇలానే కొనసాగితే మరికొన్ని రోజుల్లో భరత్ తనకు దగ్గరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. తల్లిగా దగ్గరుండి వడ్డించడంతోపాటుగా కన్నతల్లిగా గోరుముద్దల తినిపించడంతో భరత్ ఎమోషనల్ అవుతాడు. అయితే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని భరత్ అడిగితే పల్లవికి నేను ఇలా గోరుముద్దలు తినిపించడం నాకు అలవాటు.. నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివి కాబట్టి నీకు కూడా గోరుముద్దలు పెట్టాను అని అనగానే భరత్ చాల ఎమోషనల్ అయిపోతాడు..

అవనిపై పార్వతి సీరియస్..

Advertisement

అవని అందరూ రాజేశ్వరి వాళ్ళు ఇంటికి రాగానే పార్వతి తన కొడుకు కోడలు దూరమయ్యారని చాలా ఎమోషనల్ అవుతుంది. శ్రేయ ఏదో కోపంలో ఉంది కదా అత్తయ్య అయితే మీరు బాధపడకండి తాను కోపం తగ్గిన తర్వాత మళ్లీ మనం మాట్లాడే తీసుకురావచ్చు అని అవని ఎంత చెప్తున్నా సరే పార్వతి మాత్రం ఎమోషనల్ అయిపోతుంది.. శ్రియ కోపంగా ఉంది సరే నువ్వు ఎందుకు అవని ఆవేశంగా ఇంకా నాలుగు మాటలు మాట్లాడావు అని అడుగుతుంది. అయితే నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు ఊహించలేదు అవని అని పార్వతి అంటుంది..

పల్లవి ప్లాన్ సక్సెస్..

పార్వతి శ్రియ రాకపోవడానికి కారణం అవనీని అడుగుతూ ఉండగా పల్లవి అవునత్తయ మీరు చెప్పింది కరెక్టే అవని అక్క వాళ్ళే శ్రేయ చాలా హర్ట్ అయింది అని అంటుంది. అవని వదిన తప్పేమీ మాట్లాడలేదు నువ్వు అనవసరంగా కల్పించుకొని ఇంకాస్త రెచ్చగొట్టేలా మాట్లాడద్దు అని పల్లవి పై కమల్ సీరియస్ అవుతాడు.. అవనిది తప్పు అని అనడంతో అక్షయ సీరియస్ అవుతాడు. అవని చేయడం తప్పేమీ లేదు శ్రేయ ఎంతగా మాట్లాడిందో మీరు చూశారు కదా అనేసి అక్షయ్ అంటాడు.

చక్రధర్ ను తోసేసిన భరత్..

Advertisement

భరత్ ఇంటికి వచ్చి ప్రణతితో చాలా సంతోషంగా ఆఫీసులో గడిపిన క్షణాలను గురించి చెప్తాడు.. అయితే ఆఫీసులో రాజేశ్వరి మేడం తనకి వచ్చిన భోజనాన్ని ఇవ్వడంతో పాటుగా దగ్గర ఉండి గోరుముద్దలు తినిపించింది అని చెప్పగానే ఆ ప్రణతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ప్రణతి ఓనర్ ఓనర్ లాగే చూడాలి. అయితే నువ్వు ఇలా చేయడం తప్పు భరత్ నీకేం కావాలో రేపటి నుంచి నేను చేసి పెడతాను అని అంటుంది.. అయితే చక్రధర్ మధ్యలో కల్పించుకొని మాట్లాడుతాడు నీకు ఇవన్నీ అనవసరం అని చక్రధరిని తోసేస్తాడు భరత్.. భరత్ ఎమోషనల్ అవ్వడంతో చక్రధర్ కూడా బాగా బాధపడతాడు..

అక్షయ్ కు ఫైనాన్సియర్ షాక్..

తర్వాత రోజు అక్షయకు డబ్బులు ఇచ్చిన ఫైనాన్షియర్ ఇంటికి వస్తాడు.. చక్రధర్ గారికి ఆస్తులు లేకపోవడంతో ఆయన పెట్టిన సంతకం చెల్లదు. ఆయన ఇప్పుడు ఆస్తులు పోగొట్టుకున్నారని తెలిసింది.. డబ్బులు మీకు ఇవ్వడానికి కుదరదు గతంలో ఇచ్చిన డబ్బుల్ని కూడా మీరు వెంటనే తిరిగి ఇవ్వాలి అని ఫైనాన్షియర్ అనడంతో అక్షయ్ కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అయితే అందరూ కలిసి పల్లవి మొహం చూడగానే మా మామకి అలాంటి అలవాటు లేదు అని పల్లవి అంటుంది.. కానీ పల్లవి మాత్రం రాజేశ్వరి దగ్గరికి ఆవేశంగా వెళ్లి భరత్ గురించి అడుగుతుంది.. తాను చెప్పిన సమాధానం విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 10 సినిమాలు.. వీటిని మాత్రం డోంట్ మిస్..!

Related News

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×