E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: నిజం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకున్న అవని.. భరత్ మాటకు మీనాక్షి షాక్.. చక్రధర్ కు దిమ్మతిరిగే షాక్….

Intinti Ramayanam Today Episode: నిజం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకున్న అవని.. భరత్ మాటకు మీనాక్షి షాక్.. చక్రధర్ కు దిమ్మతిరిగే షాక్….
Advertisement

Intinti Ramayanam Today Episode April 4th: తన తండ్రి చెప్పిన నిజాన్ని తన కన్నతల్లికి ఎలా చెప్పాలి అని అవని బాధపడిపోతూ ఉంటుంది.. అలా అవని బాధపడడం చూసిన అక్షయ్ నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు అని అంటాడు. భరత్ రాజేశ్వరి అత్త కొడుకు కదా… నువ్వు పల్లవి ఒకే తల్లి కడుపున పుట్టారు కదా అని అంటాడు. ఆ మాట వినగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. ఈ విషయం మీకు ఎలా తెలుసు అండి అని అనుకుంటుంది. మీ నాన్న నీతో చెప్పడం నేను విన్నాను. ఈ విషయాన్ని ఎలాగైనా సరే నేను వాళ్లకు చెప్తాను అని అక్షయ్ అంటాడు.. కానీ అవని మాత్రం ఇప్పుడు ఈ విషయాన్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారో అర్థం కావడం లేదు అని అంటుంది..

అవనికి సపోర్ట్ చేసిన అక్షయ్.. 

మనం ఇప్పుడు గనక చెప్తే వాళ్ళు ఎవరికీ ఎవరు బిడ్డలు అని ఆలోచిస్తూ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతారు.. ఇప్పుడు అందరూ ఆవేశంగా ఉన్నారు ఈ విషయం చెప్పినా కూడా వాళ్ళు ఎవరూ పెద్దగా పట్టించుకోరు.. వాళ్లంతా మంచిగా ఉన్నప్పుడు టైం చూసి మనమే వాళ్ళకి చెబుదాము అని అవని అంటుంది.. ఎవరికి ఎప్పుడు ఏం చెప్పాలో నా కన్నా నీకే బాగా తెలుసు అవని.. నువ్వేం చెప్తే అదే కరెక్టు అని అక్షయ్ అంటాడు.. నువ్వు అన్నట్లుగానే వాళ్ళందరూ మంచిగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని చెప్పడం మంచిది అని అవనికి అక్షయ్ సపోర్ట్ చేస్తాడు.

కొడుకు మాటతో కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి.. 

Advertisement

తండ్రి కొడుకు కోసం పూజ చేసి అక్షింతలు వేయడానికి వస్తే అతనిని అవమానించేలా భారత్ మాట్లాడాడు అని మీనాక్షి బాధపడిపోతూ ఉంటుంది. నీకు కొడుకు కన్నా అతని ఎక్కువయ్యాడా అన్న మాటని తలుచుకొని గుండెలు పగిలేలా ఏడుస్తుంటుంది.. భరత్ ఇంకెప్పుడూ తండ్రిని అర్థం చేసుకుంటాడో అర్థం కావడం లేదు అని మీనాక్షి బాధపడిపోతూ ఉంటుంది.. ప్రణతి అత్తయ్య మీరు భోజనం చేదురండి అని పిలుస్తుంది.. కానీ తాను ఎంత చెప్తున్నా సరే భరత్ వచ్చిన తర్వాతే భోజనం చేస్తాను అని మీనాక్షి అంటుంది. భరత్ కి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో మీనాక్షి వాడు వచ్చిన తర్వాతే భోజనం చేద్దామని అంటుంది.. అయితే మీరు ఇక్కడే ఉండండి ఆయన ఎక్కడున్నాడు నేను వెతికి తీసుకొని వస్తాను అని ప్రణతి వెళుతుంది.

పల్లవి పై అక్షయ్ కు అనుమానం.. 

అవని నీ అక్షయ్ ఒక విషయం అడగాలి అని అంటాడు.. ఏంటండీ చెప్పండి అని అవని అంటుంది. ఈమధ్య అమ్మ పల్లవికి సపోర్ట్ చేయకుండానే తనపై సీరియస్ అవుతూ తిడుతూ వస్తుంది. అది ఎందుకు ఏంటో నీకు తెలుసా అని అక్షయ్ అడుగుతాడు.. నాకు తెలియదండి పల్లవి చెప్పిన మాట వినడం లేదు కదా అందుకే మేమిద్దరం అలా సీరియస్ గా చెప్పాల్సి వచ్చింది అని అవని అంటుంది. అంతే పల్లవి మీద మాకు ఎటువంటి కోపం లేదు అని అవని అనగానే అది నిజమే అనుకొని అక్షయ్ నమ్మేస్తాడు.

చక్రధర్ కు దిమ్మతిరిగే షాక్.. 

Advertisement

తన కొడుకు తనని కాదన్నాడు అని బాధతో మందు తాగేసి ఇంటికి వస్తాడు చక్రధర్. తనని ఇంట్లో ఎవరూ పట్టించుకోవడంలేదని బాధతో తన గదికి వెళ్లి ఫ్రెష్ అయ్యి అన్నం తినడానికి కిందకు వస్తాడు. అయితే ప్లేట్లో అలా అన్నం పెట్టుకున్నాడో లేదో రాజేశ్వరి వచ్చి ఆ ప్లేట్ ని విసిరి కొడుతుంది. గుడికి వెళ్లి వస్తే ఏం మాట్లాడుతున్నావు అని చక్రధర్ అంటాడు. మీరు దాని కోసమే వెళ్లారన్నమాట. మంగళసూత్రం ఇవ్వాలి అంటే భార్య భర్తలు ఇద్దరు జంటగా ఇవ్వాలి.. మీరిద్దరికీ ఆ దేవుడి ఆశీస్సులు లభించే ఉంటాయి. అసలు నేను ఎందుకు వెళ్ళను అర్థం చేసుకో అని చక్రధర్ఎంత చెప్తున్నా సరే రాజేశ్వరి మాత్రం అస్సలు వినదు.. దాని దగ్గరికి వెళ్లి మళ్లీ నా ఇంటికి వస్తారా అని రాజేశ్వరి అడుగుతుంది..

నా ఇల్లు ఇది.. మీకు హక్కులేదు..

నేను వెళ్ళింది భరత్ కోసమే అని ఎంత చెప్తున్నా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు రాజేశ్వరి అని చక్రధర్ అంటాడు.. కానీ రాజేశ్వరి మాత్రం చక్రధర్ కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు. దాని దగ్గరికి వెళ్లి మళ్లీ నా ఇంటికి వచ్చారు అని అనగానే చక్రధర నా ఇల్లు నా ఇల్లు అంటున్నావు ఇది నీళ్లు కాదు నా ఇల్లు అని అంటాడు. అవును నా ఇళ్లే ఈ డబ్బులు మా అన్నయ్య దగ్గర మీరు కొట్టేసినవే కదా.. ఏం చేసినా కూడా ఇది నా ఇన్లే అవుతుంది అని రాజేశ్వరి అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు..

అమ్మను వదులుకోవడానికి నేను సిద్దమే.. 

భరత్ కోసం వెతుక్కుంటూ వెళ్లిన ప్రణతి తను ఒక గుడిలో ఉన్నాడని చెప్పగానే అవని మీనాక్షి ఇద్దరు కూడా గుడికి వెళ్తారు.. అయితే వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళగానే భరత్ ఎంతగా పిలిచినా రాడు.. ఆ చక్రధర్ మన ఇంటికి రాకుండా ఉంటేనే నేను వస్తాను. అతని కోసం అవసరమైతే అమ్మను కూడా వదిలేసుకుంటాను దానికి నేను సిద్ధమే అని భరత్ అంటాడు.. ఏం మాట్లాడుతున్నావ్ రా అని అవని అంటుంది. మీనాక్షి భరత్ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode: సంబంధం కోసం తాయారు ఇంటికి వెళ్లిన మహా..తాయారుకు దిమ్మతిరిగే షాక్.. అందరికి క్లాస్ పీకిన నారాయణ..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×