E-Paper
Advertisement

పార్టీకి వెళ్లి తిరిగి రాని అమ్మాయి… ఓటీటీలో వణికిస్తున్న మర్డర్ మిస్టరీ

పార్టీకి వెళ్లి తిరిగి రాని అమ్మాయి… ఓటీటీలో వణికిస్తున్న మర్డర్ మిస్టరీ
Advertisement

Mystery Thriller Series : ఈ రోజుల్లో క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమాలతో పాటు, సిరీస్ లు కూడా ఈ కంటెంట్ మీదే ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. ఇక రియల్ స్టోరీలను మరింత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో 1997లో కెనడాలో జరిగిన రీనా విర్క్ అనే 14 ఏళ్ల అమ్మాయి హత్య ఉదంతం ఆధారంగా ఒక సిరీస్ రూపొందింది. ఆమెను హింసించి ఒక బ్రిడ్జ్ కింద చంపారు. అప్పట్లో ఈ కేసు ఒక సంచలనం. ఈ భయంకరమైన సంఘటన వెనక అసలు నిజాన్ని ఈ సిరీస్ చూపిస్తుంది. ఐఎమ్‌డిబి దీనికి 7.2/10 రేటింగ్ కూడా ఉంది, అంటే క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ కూడా.

జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ మినీ సిరీస్ పేరు ‘అండర్ ద బ్రిడ్జ్’ (Under the Bridge). 2024 లో వచ్చిన ఈ సిరీస్ కేవలం క్రైమ్ డ్రామా మాత్రమే కాదు, ఇందులో నటించిన నటీనటుల ప్రతిభకు విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా ఆస్కార్ నామినీ లిల్లీ గ్లాడ్‌స్టోన్ పోలీస్ ఆఫీసర్‌గా, రిలే కియో రచయిత్రిగా అద్భుతంగా నటించారు. 1990ల కాలం నాటి వాతావరణాన్ని, అప్పటి టీనేజ్ పిల్లల మనస్తత్వాలను, వాళ్ళ మధ్య ఉండే గ్యాంగ్ కల్చర్‌ను దర్శకుడు క్విన్ షెపర్డ్ చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించారు. ఇది మొత్తం 8 ఎపిసోడ్ల మినీ సిరీస్. దీనిని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రీనా విర్క్ అనే ఒక 14 ఏళ్ల ఇన్నోసెంట్ అమ్మాయి, తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేద్దామని ఒక రాత్రి పార్టీకి వెళ్తుంది. కానీ అక్కడ ఉన్న బ్యాచ్ అంతా కలిసి ఆమెను టార్గెట్ చేస్తారు. చిన్న చిన్న గొడవలు మనసులో పెట్టుకుని, అందరూ కలిసి ఒక బ్రిడ్జ్ కింద రీనాను దారుణంగా కొడతారు. అంతటితో ఆగకుండా, ఆమెను నీళ్లలోకి తోసేసి చంపేస్తారు. ఈ దారుణం చేసింది ఎవరో కాదు, ఆమెతో పాటే తిరిగే తోటి టీనేజ్ పిల్లలే. ఇక రీనా కనిపించకుండా పోవడంతో ఊర్లో పెద్ద గందరగోళం మొదలవుతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి కామ్ అనే పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతుంది. అదే టైంలో రెబెక్కా అనే రచయిత్రి కూడా ఈ పిల్లల గొడవలు, వాళ్ల వెనుక ఉన్న గతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఇద్దరూ కలిసి ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్తుంటే, ఆ పిల్లలు ఎంత క్రూరంగా ఆలోచించారో, అసలు ఆ రాత్రి ఏం జరిగిందో ఒక్కొక్కటిగా బయటపడతాయి. చివరికి రీనా ప్రాణాలు ఎలా పోయాయి ? ఆ హంతక పిల్లలకి ఎలాంటి శిక్ష పడింది ? అనేదే ఈ సిరీస్ క్లైమాక్స్.

Read Also : హైస్కూల్ డేస్ నుంచి పెళ్లి వరకు… చూసే కొద్దీ చూడాలనిపించే సిరీస్… ఐయండిబిలో 8.5 రేటింగ్

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×