E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి దెబ్బకు కమల్ ఫ్యూజుల్ అవుట్.. భరత్ ను తీసుకొచ్చిన అవని.. పల్లవికి నిజం చెప్పేస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి దెబ్బకు కమల్ ఫ్యూజుల్ అవుట్.. భరత్ ను తీసుకొచ్చిన అవని.. పల్లవికి నిజం చెప్పేస్తుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode April 5th: భరత్ కోసం వెతుక్కుంటూ వెళ్లిన ప్రణతి తను ఒక గుడిలో ఉన్నాడని చెప్పగానే అవని మీనాక్షి ఇద్దరు కూడా గుడికి వెళ్తారు.. అయితే వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళగానే భరత్ ఎంతగా పిలిచినా రాడు.. ఆ చక్రధర్ మన ఇంటికి రాకుండా ఉంటేనే నేను వస్తాను. అతని కోసం అవసరమైతే అమ్మను కూడా వదిలేసుకుంటాను దానికి నేను సిద్ధమే అని భరత్ అంటాడు.. ఏం మాట్లాడుతున్నావ్ రా అని అవని అంటుంది. మీనాక్షి భరత్ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆయన ఇంటికి వస్తాడు అంటే కచ్చితంగా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను అని భరత్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ అర్థం అవుతుందా భరత్ నీకు అని అవన్నీ సీరియస్ అవుతుంది.

అమ్మను ఏడ్పిస్తే ఊరుకోను అవని వార్నింగ్..

ఆయన మనల్ని వదిలేసి పోవడం వల్ల నేను ఇంతగా అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అని భరత్ ఎంత చెప్తున్నా సరే.. అవని మాత్రం నువ్వు ఒక్కడివే అవమానంగా ఫీల్ అయ్యావా.. కట్టుకున్న భర్త ఉన్నా సరే లేనట్లుగా ఎంతో బాధని అనుభవించిన అమ్మ బాధ ఎవరికి చెప్పాలి అని అవని అంటుంది. నీకు చదువులు చెప్పించలేక నీకోసం ఆమె ఎంత చాకీర్ చేసి ఉంటుంది. నువ్వు కొంచెం కూడా ఆలోచించవా భరత్. ఈరోజు తన భర్త తన దగ్గరకు వచ్చాడని ఇన్నేళ్ల తర్వాత అమ్మ మొహంలో సంతోషం కనిపించింది. దాన్ని నువ్వు ఎందుకు దూరం చేయాలనుకుంటున్నావు అని అవని అడుగుతుంది.. మొత్తానికి భరత్ ని ఒప్పించి అవని ప్రణతి వాళ్ళతో ఇంటికి పంపిస్తుంది.

మీనాక్షికి మాటిచ్చిన అవని..

Advertisement

అమ్మ భరత్ ఇప్పుడు ఆవేశంగా ఉన్నాడు కాబట్టి మీరు ఏమి మాట్లాడకండి. తనకు అర్థమయ్యేలా నేనే చెప్తాను అని అవని అంటుంది. నాకు వాడిని చూస్తే భయమేస్తుంది అమ్మ వాళ్ళ నాన్నని ఏం చేస్తాడు అని బాధగా ఉంది అని మీనాక్షి అంటుంది. నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాడికి అర్థం ఎలా నేను చెప్తాను వివిధ కంగారు పడకు ఇంటికి వెళ్ళు అని మీనాక్షి తో అవని అంటుంది. తన తండ్రి మారిపోయాడు అన్న విషయాన్ని భరత్ ఎప్పుడు తెలుసుకుంటాడు అర్థం కావడం లేదు. వాడు తెలుసుకొని నాన్నని నాన్న అని పిలిస్తే ఆయన చాలా సంతోషిస్తాడు అని అవని ఆలోచిస్తుంది.

పల్లవి దెబ్బకు కమల్ కేకలు..

పల్లవి గిన్నెలు కడుగుతూ ఉంటే కమల్ మాత్రం క్రికెట్ని ఫోన్లో పెట్టుకుని కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తాడు. తను వేసే కౌంటర్ల మీద పల్లవి సీరియస్ అవుతూ ఉంటుంది. నువ్వు ఇంకా గదిలోకి రాలేదని నీకోసం వెయిట్ చేస్తూ ఇక్కడికే వచ్చేసాను. ఇక ఆగే పరిస్థితి లేదు. ఈరోజు బెడ్రూంలో కేకలు పెట్టాల్సిందే అని పల్లవిని బలవంతంగా కమల్ లోపలికి తీసుకొని వెళ్తాడు. పొరపాటున పల్లవి కాలు తగిలి కమల్నాడు విరిగిందిరో బాబోయ్ అని కేకలు పెడతాడు . తిక్క కుదిరింది లేకున్నా అంటే రాత్రంతా నాకు చుక్కలు చూపించేవాడు అని పల్లవి అనుకుంటుంది. తనకి జండుబాం రాసి పడుకోబెడుతుంది.

పార్వతి పల్లవికి నిజం చెప్తుందా..?

Advertisement

పల్లవి గదిలో ఏదో కేకలు వినిపించిందని పార్వతి అక్కడికి వస్తుంది.. అత్తయ్య ఏం జరిగింది మీరు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు అర్థం చేసుకోవాలి అని ఎంతగా ప్రయత్నించినా నాకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి అత్తయ్య అని పల్లవి అడుగుతుంది. ఆ నిజాలేమో నీకు కూడా తెలుసు మళ్లీ ఎందుకు అడుగుతున్నావు అని పార్వతి అంటుంది. అసలు అత్తయ్య దేని గురించి మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు అని పల్లవి తనలో తానే మాట్లాడుకుంటుంది.

మీనాక్షి తల్లి అని నిజం తెలుస్తుందా..?

బయట మార్కెట్ కోసం వెళ్ళిన పల్లవి అక్కడ ఒక చోట కింద పడిపోతుంది. అందరూ జనం భూమి కూడా ఉండడంతో మీనాక్షి కూడా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని వస్తుంది. అయితే పల్లవి నేను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీనాక్షి పల్లవికి వాటర్ ఇచ్చి లేపుతుంది నువ్వు ఎవరు నన్ను ముట్టుకోవడానికి అని పల్లవి దారుణంగా మాట్లాడుతుంది. అది చూసిన ఆవని పల్లవి నీ పక్కకి తీసుకొని వెళ్లి నువ్వు ఇంత దారుణంగా మాట్లాడుతున్నావో ఈమె ఎవరో తెలుసా నీకు కన్న తల్లి అని నిజం చెప్తుంది. ఆ మాట వినగానే పల్లవి ఫ్యూజులు ఎగిరిపోతాయి.. అక్కడితో ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది.. మరి సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

Advertisement
×