E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 6th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ముందుకు వచ్చిన కావ్య

Brahmamudi Serial Today Episode April 6th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ముందుకు వచ్చిన కావ్య
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు సంతకం గురించి ఆపర్ణ, సుభాష్‌ బాధపడుతుంటారు. ఇందు కోసం ఇందుకు చెందాల్సిన ఆస్తి కోసం ఆ రేఖతో మనం పడకూడని పాట్లు పడుతున్నాం ఇప్పుడు అదే పని మన కోసం ఇందు చేస్తుంది. ఇప్పుడు మన కోసం ఆస్థి కూడా వదులుకోవడానకి సిద్ద పడుతుంది అని బాధపడుతుంది అపర్ణ. దీంతో సుభాష్‌ ఇందు తెలివైనదే కానీ మన కోసం బలహీనపడుతుంది అని చెప్పగానే.. అపర్ణ తన ఏ నిర్ణయం తీసుకోవడం లేదు కదండి అంటుంది. దీంతో సుభాష్‌ నీకు గుర్తుందో లేదో ఒకప్పుడు కావ్య కూడా అచ్చం ఇలాగే ఉండేది. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక మనం చెప్పినా వినేది కాదు.. అప్పుడు తననే ఒప్పించలేకపోయాము ఇప్పుడు తన కూతురును మాత్రం ఎలా ఒప్పించగలం అని చెప్పగానే.. మనం ఒప్పించలేము కానీ వాళ్ల అమ్మ ఒప్పించవచ్చు కదా అని అపర్ణ అనగానే.. సుభాస్‌ షాక్‌ అవుతాడు.

ఏం మాట్లాడుతున్నావు అపర్ణ ఇప్పుడు తను బతికి లేదు కదా..? తను ఒప్పించడం ఏంటి అని అడగ్గానే.. అపర్ణ తను లేకపోవచ్చు కానీ తన జ్ఞాపకం ఉంది కదా ఒక్క నిమిషం ఉండండి అంటూ వెళ్లి పాత పెట్టెలో కళ్యాణ్‌  కావ్య జీవితాన్ని కథలా రాసిన బుక్ తీసుకొచ్చి ఇది నీకు గుర్తుందా..? అంటూ బుక్‌ చూపిస్తుంది. దీంతో సుభాష్‌ గతం గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు ఇందుకు ఈ బుక్‌ ద్వారా వాళ్ల అమ్మను ఇందుకు పరిచయం చేద్దా అంటూ బుక్‌ తీసుకుని ఇందు దగ్గరకు వెళ్తుంది. ఇందు ఇంకా పడుకోలేదా.? అని అడగ్గానే.. లేదు నాన్నమ్మ  ఆ బుక్ ఏంటి..? ఎవరిది ఆ బుక్‌ అని అడగ్గానే.. నీదే నీకోసం నీ దగ్గరకు చేరాల్సిన మీ ఆమ్మ జ్ఞాపకం ఈ బుక్‌ దీన్ని చాలా కష్టపడి దాస్తూ వచ్చాను. ఇది మీ అమ్మ జీవితం. ఇందులో మీ అమ్మ మనస్సు.. మీ అమ్మ ధైర్యం. మీ అమ్మ కలలు కన్నీళ్ళు.. ఆవేశం ఆశయం అన్ని ఇందులో ఉన్నాయి. తనను ఎప్పుడూ చూడలేదని బాధపడుతూ ఉంటావు కదా..? ఒక్కసారి ఈ పుస్తకం చదువు నీ మనసు నిండా తనే నిండిపోతుంది అని అపర్ణ చెప్పగానే..

Advertisement

ఇందు ఆశ్చర్యంగా నాన్నమ్మ ఇందులో నిజంగా మా అమ్మ గురించి రాసి ఉందా..? అని అడుగుతుంది. దీంతో అపర్ణ మీ బాబాయ్‌ మీ అమ్మ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఒక మహాకావ్యంలా రాసి దేవతలా బావించే తన వదినకు అంటే మీ అమ్మకు అంకితం చేశాడు. నువ్వు ఇంటి మహాలక్ష్మీ అయిన నా కొడలు కావ్య గురించి తెలుసుకోవాలి. ఇందులో మీ అమ్మ ఇంటిని ఎలా చూసుకుందో..? ఈ కుటుంబం కోసం ఎలా పోరాడిందో నువ్వు తెలుసుకోవాలి.. మీ గురించి చదివి తెలుసుకుని అప్పుడైనా నీ నిర్ణయం మార్చుకుంటావని అనుకుంటున్నాను తీసుకో ఇందు అంటూ బుక్‌ ఇచ్చి వెళ్లిపోతుంది అపర్ణ. బుక్‌ మీద కావ్య ఫోటో చూసి ఎమోషనల్‌ అవుతుంది ఇందు.

మరోవైపు రేఖ ఏడుస్తూ.. రుద్రాణి, రాహుల్‌ ఫోటోల ముందు నిలబడి నువ్వు కోరుకున్న ఆస్థి మొత్తం రేపే నాకు దక్కబోతుంది అని చెప్తుంటుంది. భ్రమరాంబ మాత్రం నాకు కొంచెం డౌటుగా ఉంది.. ఎవ్వరికీ తెలియకుండా ఆ సంతకాలు ఏవో సీక్రెట్‌ గా పెట్టించాల్సింది అనగానే.. ఎందుకు ఏమవుతుంది. అని రేఖ అడగ్గానే.. ఆస్థి కోసం అపర్ణ లాయరు దాకా వెళ్లింది. ఇందు అంత సింపుల్ గా ఎలా ఒప్పుకుందా అని డౌటుగా ఉందని భ్రమరాంబ చెప్పగానే.. దానికి అంత సీన్‌ లేదు. దానికి కూడా వాళ్ల అమ్మలాగే ఆస్థుల కన్నా బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఫీలవుతుంది. ఆ ముసలి ప్రాణాలు మన చేతుల్లో ఉన్నంత వరకు అది ఏం చేయలేదు అని చెప్తుంది రేఖ.

Advertisement

మరోవైపు ఇందు రూంలో కూర్చుని అపర్ణ ఇచ్చిన బుక్‌ ను చదువుతుంది. పూర్తిగా చదివి కావ్య గురించి అర్థం చేసుకుని ఎమోషనల్‌ అవుతుంది ఇందు. ఇంతలో కావ్య ఆత్మ ఇందు దగ్గరకు వస్తుంది. ఇందు షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×