E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode : రాజేంద్ర ప్రసాద్ సీక్రెట్ రివీల్.. అవనికి నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode : రాజేంద్ర ప్రసాద్ సీక్రెట్ రివీల్.. అవనికి నిజం తెలిసిపోతుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode December 15th :  నిన్నటి ఎపిసోడ్ లో.. తర్వాత రోజు అవని మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది. ఆ సమయంలోనే అనాధశ్రమం నుంచి వార్డెన్ అక్కడికి వస్తుంది. వార్డెన్ చూసినా అవని ఏమైందండీ ఏదైనా అవసరమా ఇలా వచ్చారా అనేసి అడుగుతుంది. ఆమె అవునండి చాలా పెద్ద అవసరం వచ్చాయి ఇక్కడికి వచ్చాను అనేసి అంటుంది. డబ్బులు కావాలా అని అడుగుతుంది. దగ్గర ఒక 12వేలు ఉంటాయి అవి ఇస్తాను అవి తీసుకెళ్లండి అనేసి అవని అంటుంది.. వేలతో పోయేది కాదమ్మా లక్షలతో కూడిన సమస్య వచ్చింది. ఒక పాపకి గుండె సమస్య వచ్చింది. ఆపరేషన్ చేయాలంటే దాదాపు 20 లక్షలు అవుతాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటికే నాకు తెలిసిన పెద్ద వాళ్ల దగ్గరికి వెళ్తే ఎంతో ఇస్తున్నారు అవన్నీ కలిపిన లక్ష రూపాయలు కాలేదనేసి ఆవిడ అంటుంది. దానికి కరిగిపోయిన అవని లోపలికి వెళ్లి మా ఆయన అడిగి ఒకసారి చెప్తానని అంటుంది.. అమెరికా కాల్ తో బిజీగా ఉన్నానని అవనిపై అరుస్తాడు. అవని చెప్పాలనుకున్న విషయాన్ని వినే స్థితిలో కూడా అక్షయ లేడు. ప్రస్తుతానికైతే ఈ గాజులు తీసుకెళ్లండి వీటిని నమ్ముతారు తాకట్టు పెడతారు ఏదో ఒకటి చేసి ట్రీట్మెంట్ అయితే చేయించుకోండి అనేసి అంటుంది. అది చూసిన పల్లవి వెంటనే ఈ విషయాన్ని భానుమతి చెవుల్లో వేస్తుంది. భానుమతి అవునా గాజులు ఇచ్చేసిందా అనేసి టెన్షన్ పడుతూ ఎలాగైనా ఇరికించాలని పల్లవి భానుమతిలు ప్లాన్ చేస్తారు. వడ్డాణం చేయించాలని సేటుని ఇంటికి రమ్మని పిలుస్తారు. ఇక అనుకున్నట్లే వడ్డానంకి బంగారం తక్కువవుతుంది. మేము బంగారం వేస్తాము మీరు దానికి డబ్బులు ఇవ్వనని సేటు అంటాడు. అహ బయట బంగారం మాకొద్దు. పావని చేతికి నాలుగు తులాల పైన గాజులు ఉంటాయి అవి వేసి వడ్డానం చేయించండి అనేసి సేటుతో అంటుంది. అవని గాజులు అడుగుతుంది కానీ అవని మాత్రం ఆ గాజులు అనాధశ్రమం ఆవిడ వస్తే ఇచ్చానని చెప్తుంది. ఇక దాంతో భానుమతి రెచ్చిపోయి అవనిని తిడుతుంది. స్థాయి మర్చిపోయే వాళ్లకి అధికారం ఇస్తే ఇలానే ఉంటుంది ఈరోజు గాజులు ఇచ్చింది రేపు ఇంకేదైనా ఇస్తుందనేసి అందరి ముందర నోటికొచ్చినట్లు తిట్టేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కమల్ కు ఆరాధ్య రంగులు పూస్తుంది. నీ పని చెప్తానని ఆరాధ్య కమల్ ని జోకర్ లాగా రెడీ చేస్తుంది. భానుమతి అక్కడికొచ్చి రిమోట్ కోసం వెతుకుతూ కమల్ ను లేపుతుంది. కమల్ అవతారం చూసి ఒక్కసారిగా కేకలు పెడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. కమల్ అవతారం చూసి అందరూ నవ్వుకుంటారు. ఇక ఇది ఆరాధ్య పని అని తెలుసుకున్న కమల్ ఆరాధ్యను నువ్వు పట్టుకోవాలని చూస్తాడు. అప్పుడే అక్ష ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే భానుమతి తన భార్య చేసిన పనిని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Advertisement

కమల్ ఆరాధ్యను నువ్వు పట్టుకోవాలని చూస్తాడు. అప్పుడే అక్షయ్ ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే భానుమతి తన భార్య చేసిన పనిని చెప్తుంది. ఇక అక్షయ్ వెళ్లి అవన్నీ అడుగుతాడు. ఒక మాట చెప్పి చేసుంటే ఇదంతా వచ్చేది కాదు కదా ఇప్పుడు నువ్వే తప్పు చేశావని అందరూ అంటున్నారు అనేసి అవనితో అనగానే అవని నేను మీకు చెప్పాలని వచ్చాను మీరు బిజీగా ఉన్నారు నేను చెప్పాలనుకున్న కానీ మీరు విని పరిస్థితిలో లేరు అవసరం అంటేనే ఇచ్చాను కావాలని నేను ఏదీ చేయలేదండి అనేసి అంటుంది. ఇకమీదట నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే నేను బిజీగా ఉంటే అమ్మతోనో నాన్నతో నువ్వు చెప్పు అనేసి అంటాడు. ఇక అక్షయ్ ఇచ్చిన ఆస్తి పత్రాలను పార్వతీ రాజేంద్రప్రసాద్కిస్తుంది. పిల్లల పేరు మీద ఆస్తులు రాసి పెట్టాను అని చెప్పేసి పార్వతితో అంటాడు. అక్షయ్ కు సగం ఆస్తి రాస్తాడు. అది చూసినం పార్వతి ఏడుస్తుంది. మన బిడ్డ కాకపోయినా అంత ఆస్తి ఇచ్చానని బాధపడుతున్నావా అనేసి అడుగుతాడు. అక్షయ్ ఎప్పుడు నా బిడ్డగానే చూసాను నా బిడ్డ కాదని నేను ఎప్పుడూ అనుకోలేదు అనేసి ఎమోషనల్ అవుతుంది. మీరు చెప్పేంతవరకు అక్షయ్ నా కొడుకు కాదని నాకు తెలియదండి. ఊహ తెలియక ముందే వాళ్ళ అమ్మ చనిపోతే ఆ స్థానాన్ని నేను తీసుకొని నా కొడుకు కన్నా ఎక్కువగా వాడిని పెంచాను. ఇలా మీరు ఆస్తిని పంచి వారిని వేరు చేశారు అనేసి పార్వతి బాధపడుతుంది.. ఇక రాజేంద్రప్రసాద్ నువ్వు వాడిని సవతి కొడుకు లాగా పెంచావని నేను ఎప్పుడు అనలేదు. మరి ఇదేంటండి సగం ఆస్తిని వాడికి రాసిచ్చారు అంటే అంతే కదా వాడికి నేను తల్లిని కాదు అనేసి మీరు వేరు చేస్తున్నారు కదా అంటుంది. నా కొడుకులని తనని వేరు చేసి చూస్తున్నారు కదా అనేసి రాజేంద్రప్రసాద్ తో అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఎప్పటి ఎపిసోడ్ లో అక్షయ్ సోఫాలో పడుకోవడం చూసి పల్లవి అవనిని అడుగుతుంది. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి

Related News

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Big Stories

Advertisement
×