E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి చెక్ పెట్టబోతున్న అభి.. అవనికి అవమానం.. జైలు నుంచి చక్రధర్ రిలీజ్..

Intinti Ramayanam Today Episode: పల్లవి చెక్ పెట్టబోతున్న అభి.. అవనికి అవమానం.. జైలు నుంచి చక్రధర్ రిలీజ్..
Advertisement

Intinti Ramayanam Today Episode February 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. అభి ని చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళిన అవనికి అక్కడ చక్రధర్ రిలీజ్ కాబోతున్నాడని టీవీలో రావడంతో షాక్ అవుతుంది.. ఆ విషయం నీవెంటనే అక్షయ్ వాళ్లకు చెప్పగానే వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.. శ్రీకర్ అలా ఎలా రిలీజ్ అవుతాడు మనం పిటిషన్ వేద్దాము అని అంటాడు.. అతనికి ఎవరో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి బెయిల్ ఇప్పిచ్చాడట. పోలీసులు కూడా ఏమీ చేయలేక అతను చెప్పినట్లు చేసి చక్రధర్ ని రిలీజ్ చేస్తున్నారు. అతను బయటికి వస్తే మళ్లీ మనకు సమస్యలు తప్పవు అని అవని అంటుంది.. ఇక అక్షయ్ ని పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది.. ఆ చక్రధర్ రిలీజ్ అయితే కచ్చితంగా మా అమ్మని ఏదో ఒకటి చేస్తాడు నాకు భయంగా ఉంది అని అవని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. మనం ఇప్పుడు అర్జెంటుగా ఆ చక్రధరి ఇంటికి వెళ్ళాలి. అక్కడ అతను రిలీజ్ అయ్యాడో తెలుసుకొని అతనిని అడిగి కనుక్కోవాలి అని అనుకుంటారు..

అయితే ముందుగా అనుకున్నట్లుగానే  అవని అక్షయ్ ఇద్దరు కూడా చక్రధరి ఇంటికి వెళ్లి పిలుస్తారు. కానీ ఆయన ఇంకా ఇంటికి రాలేదు అని రాజేశ్వరి చెప్పగానే వాళ్ళిద్దరూ కూడా షాక్ అవుతారు. మా ఆయనను రిలీజ్ చేయమని ఎంతగా బతిమలాడినా మీరిద్దరూ ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్లీ మా ఆయన వస్తుంటే మీరు ఎలా జైలుకు పంపించాలని ఆలోచించడానికి వచ్చారని రాజేశ్వరి దారుణంగా మాట్లాడుతుంది. అక్షయ్ ఎంత చెప్తున్నా సరే రాజేశ్వరి మాత్రం వినకుండా తనని తిడుతూనే ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

మీ వదిన ఇంట్లో పనిలే కాదు బయట సైట్ లో కూడా పనిచేస్తుందా అంటూ మాట్లాడుతుంది. ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి పై అవనికి అనుమానం ఉన్న విషయాన్ని అభి తో చెప్తుంది.. ఇక అభి తన కానిస్టేబుల్ ని పల్లవిని ఫాలో అవమని చెప్తాడు.. తన కానిస్టేబుల్ పల్లవిని ఫాలో అవుతూ అక్కడికి వస్తాడు.. పల్లవి ఒక చోటికి వెళ్లడం చూసిన కానిస్టేబుల్ రాజు ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు.. అభి తో కూడా చెప్తాడు.. ఇక ఇంటికి వచ్చిన శ్రీకర్ కమల్ని చూసిన పార్వతీ ఏంట్రా మీ ఇద్దరే వచ్చారు పెద్దోడు ఎక్కడ కనిపించలేదు అని అడుగుతుంది.. వదిన ఇందాక సైట్ కి వచ్చిందమ్మా అన్నయ్య వదిన ఏదో ముఖ్యమైన పని ఉందని బయటికి వెళ్లారు అని శ్రీకర్ అంటాడు.. ఆ మాట విన్న శ్రియా మీ వదిన ఇంట్లో పనిలే కాదు బయట సైట్ కూడా పనిచేస్తుందా అంటూ మాట్లాడుతుంది.

ఏదో ముఖ్యమైన పని ఉంటే వెళ్లడం కూడా తప్పేనా అని శ్రీకర్ అంటాడు. ఇక ఆ తర్వాత అప్పుడే ఇంటికి వచ్చిన అవని అక్షయలను ఎక్కడికి వెళ్లారు గాని అడుగుతుంది పార్వతి. చక్రధర్ జైలు నుంచి ఇవాళ రిలీజ్ కాబోతున్నాడు. అది తెలుసుకుందామని అక్కడికి వెళ్ళాము అని అక్షయ్ అంటాడు. ఆ మాట వినగానే భానుమతి పార్వతి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఏంటి నా అల్లుడు జైలు నుంచి రిలీజ్ అయిపోతున్నాడా అంటూ భానుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. ఆ చక్రధర్ జైల్లో ఉండగానే మా మీనాక్షి అత్తయ్యని కిడ్నాప్ చేయించాడు అని అనగానే అందరూ షాక్ అవుతారు. మా అల్లుడికి మీ అమ్మని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ అసలు అని భానుమతి చడామడ తిట్టేస్తుంది. అసలు కొంచెం కూడా బుద్ధి లేకుండా ఏం మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోవడం లేదు అని భానుమతి పార్వతి ఇద్దరు కూడా చాలా కోపంగా మాట్లాడుతారు..

Advertisement

అసలు మా అల్లుడు మీ అమ్మని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి అని భానుమతి అడుగుతుంది. ఆ కారణం ఉంది కాబట్టి నేను అతని కిడ్నాప్ చేశాడని అనుకుంటున్నాను.. ఏంట్రా కారణమని భానుమతి అంటుంది. అక్షయ్ మీనాక్షి భర్త చక్రధర్ అని చెప్పబోతుంటే అవని ఆపుతుంది.. ఇక భానుమతి మీనాక్షిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నీ మొగుడు నువ్వు చెప్పినట్టే వింటాడు. కానీ నా అల్లుడుని ఒక్క మాట అన్నా నేను అసలు ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది.. ఈ ఆ తర్వాత మీనాక్షి ఎక్కడికి వెళ్ళింది అని బాధ పడిపోతూ ఉంటుంది. అవని..

Also Read :‘పొదరిల్లు’ శైలజ రియల్ లైఫ్.. ఒక్క ఎపిసోడ్ రెమ్యూనరేషన్?

ఈ ఆ తర్వాత చక్రధర్ జైలు నుంచి ఇంటికి రాగానే రాజేశ్వరి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.. నాకు చాలా బాధగా ఉంది రాజేశ్వరి నన్ను మీ వాళ్ళు ఇంకా నమ్మడం లేదు.. నాన్నకు అలా జరగడానికి కారణం నేనే అని ఇంకొకటి అని నా మీద నిందలు వేస్తూనే ఉన్నారు.. జైలుకు వెళ్లడం పెద్ద ప్రాబ్లం కాదు కానీ మీ వాళ్ళు నన్ను అపార్థం చేసుకోవడమే నాకు బాధగా ఉంది అని ముసలి కన్నీళ్లు కారుస్తాడు చక్రధర్.. అక్కడికి వచ్చిన పల్లవి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. డాడ్ మీకోసం నేను ఎన్నో నిద్రలేని రాత్రులు మేలుకొని మీకోసం వెయిట్ చేస్తాను.. ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పల్లవి మురిసిపోతుంది. అయితే చక్రధర్ కి మీనాక్షిని కిడ్నాప్ చేసిన విషయాన్ని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో చక్రధర్ రాజేంద్రప్రసాదను చూడ్డానికి ఇంటికి వస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×