E-Paper
Advertisement

Samantha: వ్యక్తిగత జోలికొస్తే ఊరుకోను.. సోషల్ మీడియా ట్రోల్స్ పై సమంత ఘాటు రిప్లై!

Samantha: వ్యక్తిగత జోలికొస్తే ఊరుకోను.. సోషల్ మీడియా ట్రోల్స్ పై సమంత ఘాటు రిప్లై!
Advertisement

Samantha:’ఏ మాయ చేసావే’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన సమంత (Samantha)మొదటి సినిమాతోనే ఆడియన్స్ ను మాయ చేసి అభిమానులుగా మార్చేసింది. అందం, అభినయంతో, నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె ఒకప్పుడు క్యూట్ హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం వరుస పెట్టి యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో సినిమాలు చేస్తూ దూసుకుపోతుందని చెప్పాలి. అందులో భాగంగానే నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి ‘మా ఇంటి బంగారం’ సినిమా చేస్తోంది. తన సొంత నిర్మాణ సంస్థ “ట్రాలాల మూవింగ్ పిక్చర్స్” బ్యానర్ పై నిర్మించడమే కాకుండా లీడ్ రోల్ పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మా ఇంటి బంగారం రిలీజ్ డేట్ అనౌన్స్..

ఈ మేరకు ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారిక ప్రకటన చేసింది. మే 15వ తేదీన మా ఇంటి బంగారం రాబోతోంది అంటూ ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ లో సమంత మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. పైగా ఇందులో ప్రముఖ యాంకర్ శ్రీముఖి (Srimukhi)కూడా నటిస్తుండడంతో అటు బుల్లితెర ఆడియన్స్ కూడా మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈమె వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ట్రోలర్స్ కి గట్టి కౌంటర్..

Advertisement

విషయంలోకి వెళ్తే.. నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె.. వివాహం జరిగిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది..ఆ తర్వాత ఎన్నో వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొంది. ఇక గత ఏడాది ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తో కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ రూమర్స్ కి చోటు ఇచ్చింది. పైగా పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు రాగా.. ఎట్టకేలకు గత ఏడాది డిసెంబర్లో యోగా సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధ పద్ధతిలో వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే తన సినిమాల విషయం పక్కన పెడితే.. ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు, ట్రోల్స్ చేస్తూ.. కొంతమంది ట్రోలర్స్ పెద్ద ఎత్తున రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత ఈ సోషల్ మీడియా ట్రోలర్స్ పై స్పందించి గట్టి కౌంటర్ ఇచ్చింది.

also read:Film industry: పెళ్లయిన మూడేళ్లకే విడాకులు.. సెలబ్రిటీ జంట మధ్య విభేదాలకు కారణం?

వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సహించను – సమంత

Advertisement

ఈ మేరకు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సమంత.” ప్రశంసలు , విమర్శలు నన్ను ప్రభావితం చేయవు. కానీ నా వ్యక్తిగత విషయంలోకి ఎవరైనా నెగిటివిటీ తీసుకొస్తే మాత్రం వెంటనే బ్లాక్ చేస్తాను. బ్లాక్ చేయడం అంటే నేను బాధపడడం కాదు.. అటువంటి వారికి నా దగ్గర చోటు లేదని అర్థం” అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది సమంత. ఏది ఏమైనా ఇన్ని రోజులు తనపై వస్తున్న ట్రోల్స్ కి సహనంగా స్పందించిన ఈమె.. ఇప్పుడు తాజాగా అభిమానులతో చిట్ చాట్ లో భాగంగా ఇకపై ఎవరు తన వ్యక్తిగత జీవితంలోకి వేలు పెట్టకూడదు అనే రేంజ్ లో స్పష్టం చేస్తూ భారీగా కౌంటర్ ఇచ్చింది. మరి ఇకనైనా సమంత వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటారేమో చూడాలి.

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×