E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: ప్లాన్ ప్రకారం కవిత అడుగులు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు

Kalvakuntla Kavitha: ప్లాన్ ప్రకారం కవిత అడుగులు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు

Kalvakuntla Kavitha: స్వేచ్ఛ బ్యూరో: కవిత కార్యక్రమాలను స్పీడప్ చేశారు. నిత్యం ప్రజల్లో, మీడియాలో ఉండేలా ప్రత్యేక కార్యచరణ తో ముందుకెళ్తున్నారు. పార్టీ ప్రకటన చేసేవరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించేలా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి ఆయా వర్గాలకు దగ్గరకావాలని వ్యూహం రచించినట్లు సమాచారం. కేడర్ లో జోష్ నింపడంతో పాటు బీఆర్ఎస్ నేతలు సైతం జాగృతివైపు చూసేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారని నేతలు తెలిపారు. రైతు, యువత, విద్యార్థి, మహిళా అంశాలను ప్రధానంగా ఎంచుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే రైతు సంఘర్షన పేరుతో సభలకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు లేకపోవడంతో ఆపార్టీ కేడర్ మాత్రం బేజారవుతున్నారు.

ప్రజాసమస్యలపై గళం

ఒక్కో అంశంతో ఒక్కో జిల్లా టూరుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజా సమస్యలపై పోరాటం చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే జాగృతి జనంబాట కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. 19 జిల్లాలు కంప్లీట్ చేశారు. మిగిలిన జిల్లాల్లో సైతం జనంబాట చేపట్టనున్నారు. అయితే రాష్ట్రంలో సందర్భానుసారం ప్రజాసమస్యలపై గళం ఎత్తేందుకు సిద్ధమయ్యారు. రైతు, విద్యార్థి, యువత, మహిళా అంశాలను ప్రధాన అంశాలుగా ఎంచుకొని పోరుబాట పట్టబోతున్నారు. అందులో భాగంగానే రుణమాఫీ కానీ రైతులతో సభలు నిర్వహించి ప్రభుత్వానికి సమస్యలను వివరించేందుకు కవిత సిద్ధమయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలో తొలి రైతు సంఘర్షణ సభను సోమవారం నిర్వహిస్తున్నారు. ఈ సభలో రుణమాఫీ ఎందుకాలేదు.. అసలు ఏ ప్రాతిపదికన రుణమాఫీ చేశారు తదితర అంశాలను రైతుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. ఆ అంశంపై ప్రభుత్వానికి వినతిపత్రం రూపంలో అందజేయాలని, నిరసన కార్యక్రమాలు సైతం చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రైతు భరోసా, బోనస్ అంశాలను సైతం ప్రస్తావించి అవి రైతులకు అందేలా ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది.

మీడియా వేదికగా ఎండగట్టాలని..

రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేవరకు ప్రతి రోజూ ఒక అంశంపై ప్రస్తావించాలని కవిత నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, గ్యారెంటీల అమలుకు నిధుల కేటాయింపు, యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్సీఎస్టీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్ తదితర అంశాలపై మీడియా వేదికగా ఎండగట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. అదే విధంగా మహిళలకు స్క్రూటీ, తులం బంగారం, 2500 లు ప్రస్తావించి మహిళల గళం వినిపించాలని భావిస్తున్నట్లు సమాచారం. బడ్జెట్ లో వీటన్నింటికి ప్రధానంగా తీసుకొని నిధులు కేటాయించి అమలు చేసేలా ఒత్తిడి చేయాలని భావిస్తున్నట్లు జాగృతి నేతలు తెలిపారు.

Also Read: Vishnupriya Father: తమిళ నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య.. అసలు ఏం జరిగింది అంటే?

టీఎస్పీఎస్సీ ఎదుట ధర్నా..

ఇప్పటికే ఉద్యమకారుల అంశంతో పాటు వారిని ఐక్యం చేసి పోరుబాట పట్టేందుకు ఆర్టీసీ కళాభవన్ లో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. మహిళాలకు ఇచ్చిన హామీలపై పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. మరోసారి నిరసన కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా విద్యార్థి విభాగంతో ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీ ఎదుట ధర్నా, మహిళతో ప్రెస్ మీట్లు ఇలా అనుబంధ సంఘాలను యాక్టీవ్ చేశారు. ప్రతి అంశాన్ని అనుకూలంగా మల్చుకునే ప్లాన్ చేస్తున్నారు. సందర్భాను సారంగా ఆయా ప్రోగ్రాంలను తీసుకోబోతున్నట్లు జాగృతి వర్గాలు తెలిపాయి. పార్టీని ప్రకటించేవరకు వరుస కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో, మీడియాలో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు

కవిత వరుసకార్యక్రమాలతో గులాబీ బేజారవుతుంది. గులాబీపార్టీ కార్యక్రమాలు చేపట్టకపోవడంతో కేడర్ లోనూ నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. ప్రజాసమస్యలపై గళం ఎత్తకపోవడం, కేవలం ఎప్పుడో ఒకసారి మాత్రమే వారికి గుర్తుకు వచ్చినప్పుడే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నప్పటికీ ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకపోవడం, మీడియా వేదికగానే విమర్శలు గుప్పిస్తుండటంతో పార్టీ సీనియర్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కేడర్ ను యాక్టీవ్ చేయాలంటే అది కార్యక్రమాలతోనే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆదిశగా చేపట్టకపోవడంతో అసంతృప్తికి గురవుతున్నారు. కవిత మాత్రం రోజూ ఏదో ఒక కార్యక్రమంతో దూకుడు పెంచడంతో గులాబీ కేడర్ సైతం ఆమె వైపు చూస్తున్నట్లు సమాచారం.

Also Read: Samantha: వ్యక్తిగత జోలికొస్తే ఊరుకోను.. సోషల్ మీడియా ట్రోల్స్ పై సమంత ఘాటు రిప్లై!

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×