E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: రాజేంద్ర ను అడిగిన పల్లవి.. రాజేశ్వరిని రెచ్చగొట్టిన పల్లవి.. పార్టీలో పల్లవికి అవమానం..

Intinti Ramayanam Today Episode: రాజేంద్ర ను అడిగిన పల్లవి.. రాజేశ్వరిని రెచ్చగొట్టిన పల్లవి.. పార్టీలో పల్లవికి అవమానం..
Advertisement

Intinti Ramayanam Today Episode January 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి గురించి రాజేంద్రప్రసాద్ అవనీతో చెప్తాడు. ఈ విషయాలన్నీ నాకు ముందే తెలుసు మామయ్య మీరందరూ బాధపడతారని నేను ఎవరికీ చెప్పలేదు అని అవని అంటుంది.. పల్లవి నే ఇదంతా చేసింది అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి.. అసలు పల్లవి ఇలాంటిది అని నేను అస్సలు ఊహించలేదని రాజేంద్ర అంటాడు.. పల్లవి గురించి నాకు ముందే తెలుసు మావయ్య గారు అని అంటుంది.. ఏంటమ్మా అవని నువ్వు మాట్లాడేది అని రాజేంద్ర అడుగుతాడు.. పల్లవి ఎలాంటి పనులు చేసిందో అన్ని విషయాలను అవని చెప్తుంది.. అవును మావయ్య గారు మనము శ్రీకర్ దూరంమవ్వడానికి కారణం మనమే అని ముఖ్యంగా నేను అని నామీద కోపాన్ని పెంచుకుంది. నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. నన్ను ఇంట్లో నుంచి గెంటేసేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేసింది అత్తయ్య గారి మనసుని చెడిపోయేలా చేసి నా మీద కోపాన్ని పెంచుకునేలా చేసింది. అంతేకాదు నా భర్తని నాకు దూరం చేసింది ఆఖరికి నా కూతుర్ని కూడా నాకు దూరం చేయాలని చూసింది. అవని చెప్పిన నిజాలని రాజేంద్ర విని షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది.. మీరందరూ ఎక్కడికి వెళ్లదు అని రాజేంద్ర అంటాడు.. ఈయన ఏం చేయబోతున్నాడు అని పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఇక పల్లవి రాజేంద్ర ఏదో చేయబోతున్నాడు అని తెలుసుకొని ఆయనను ఫాలో అవుతుంది.. రాజేంద్ర ని ఫాలో అవుతూ పల్లవి కూడా వెళ్లిపోతుంది.. అయితే రాజేంద్రప్రసాద్ లాయర్ దగ్గరికి వెళ్లడం చూసిన పల్లవి ఎందుకు వచ్చాడు లాయర్ దగ్గరికి అని అనుకుంటాడు. అయితే వెనకాల వెళ్లిన పల్లవి ఎలాగైనా సరే తెలుసుకోవాలని అనుకుంటుంది.. ఆస్తి పంచడం గురించి తెలుసుకున్న పల్లవి సంతోషపడుతుంది.. రాజేంద్రప్రసాద్ సగం ఆస్తిని అవని పేరు మీద రాయడంతో షాక్ అవుతుంది.

Advertisement

రాజేంద్ర బయటికి రాగానే అక్కడ పల్లవి వెయిట్ చేస్తూ ఉంటుంది.. నువ్వేంటి ఇక్కడ ఎందుకు వచ్చావు నన్ను ఫాలో అవుతూ వచ్చావా ఏంటి అని రాజేంద్ర అడుగుతాడు.. అవును మిమ్మల్ని ఫాలో అవుతూనే వచ్చాను ఏం చేస్తున్నారా అని తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను అని పల్లవి అంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక న్యూస్ బాగా అర్థమైంది.. అవని పేరు మీద ఆస్తి రాసారు శ్రియ పేరు మీద ఆస్తి రాసారు. అలాగే ప్రణతి పేరు మీద కూడా రాశారు.. నా పేరు మీద మీరు ఎందుకు రాయలేదు నా భర్త పేరు మీద రాశారు అని పల్లవి నిలదీస్తుంది. నేను నా కొడుకు పేరు మీద ఎందుకు రాసాను నాకు మాత్రమే తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు అని పల్లవికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు రాజేంద్రప్రసాద్..

ఇంట్లోనే వాళ్ళందరూ కూడా రాజేంద్రప్రసాద్ ఎందుకు ఈ ఫంక్షన్ ని అరేంజ్ చేస్తున్నారు అని టెన్షన్ పడిపోతుంటారు. పార్టీ అంటే మంచిదే కదా టెన్షన్ పడిపోవడం ఎందుకో అని అక్షయ్ కూడా అంటాడు. పల్లవి మాత్రం ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఈ ఫంక్షన్ ఏంటో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. ఇక ఆ తర్వాత ఫంక్షన్ మొదలవుతుంది.. అయితే పల్లవి ఇంట్లో ఏం చేయాలనుకుంటున్నాడు. ఈయన ఏం చేయబోతున్నాడు అర్థం కావడం లేదే అని కంగారు పడిపోతూ ఉంటుంది.. అయితే రాజేంద్ర మాత్రం ఏ విషయాన్ని బయట పెట్టకుండా వెళ్ళిపోతాడు..

Advertisement

ఇక రాజేశ్వరి అక్కడికి రావడంతో పల్లవి మమ్మీ వచ్చింది నాకు కాస్త శాంతంగా ఉంది అనేసి అంటుంది.. అయితే రాజేశ్వరిని చూసిన పల్లవి మామ్ నువ్వు వచ్చేసావా నాకు చాలా హ్యాపీగా ఉంది మామ అని అంటుంది.. ఏమో అనుకున్నాను కానీ నువ్వు వచ్చావు నాకు సంతోషంగా ఉంది అని అంటుంది. సరేగాని ఇప్పుడు నువ్వు ఈ ఫంక్షన్ కి ఎందుకు రమ్మన్నావు అని రాజేశ్వరి అడుగుతుంది.. ఏదో చేయబోతున్నాడు కానీ అది ఏంటో తెలియడం లేదు.. వీళ్లు నాన్నకి అన్యాయం చేసినట్లే నాకు కూడా అన్యాయం చేస్తారని అనిపిస్తుంది అందుకే నాకు ధైర్యం కోసం రమ్మన్నాను అని పల్లవి అంటుంది.

Also Read :ప్రేమను చూసి ధీరజ్ ప్లాట్.. అమూల్య లేదని తెలిసిపోతుందా..? శ్రీవల్లికి కొత్త టెన్షన్..

వీళ్లు మీ నాన్నని రిలీజ్ చేయమంటే చేయలేదు అలాంటిది బీరులో ఫంక్షన్ కి నేను వచ్చానంటే వాళ్ళ కాళ్లు పట్టుకోడానికి వచ్చినట్లే ఫీల్ అయిపోతారు. నీకు అన్యాయం చేయాలని చూస్తే నేను మాత్రం అస్సలు ఊరుకోను అని రాజేశ్వరి అంటుంది.. ఇక రాజేశ్వరి ఇంట్లోకి రాగానే అందరూ ఆమెను చూసి షాక్ అవుతారు. మీరు పిలవకపోయినా వచ్చాను అని అనుకుంటున్నారా అని అంటుంది.. రాజేశ్వరి రావడంతో మిగిలిన వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. అవనీ, అక్షయ్ లు అత్తయ్య వచ్చింది అంటే ఏదో జరుగుతుంది అని అనుకుంటారు.. అందరూ ప్రేమగా పలకరిస్తే రాజేశ్వరి మాత్రం మీనాక్షి అవనీలపై సీరియస్ అవుతుంది. అయితే మీనాక్షిపై రాజేశ్వరి రెచ్చిపోతుంది.. అది అవని విని రాజేశ్వర్ కి వార్నింగ్ ఇస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×