Intinti Ramayanam Today Episode January 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. నన్ను చెప్పాలని చూసింది నా ఇంట్లో ఉండడానికి వీలులేదని పార్వతి అందరి ముందర తేల్చేస్తుంది. కమల్ వినోద్ తప్ప ఇంట్లో వాళ్ళందరూ అవనినే అంటారు. ఆస్తి రాయించుకున్నావ్ ఇప్పుడు మా అమ్మని చంపాలని చూసావా మాకు మా అమ్మని దూరం చేయాలనుకుంటున్నావా అని అందరూ అడుగుతారు. ఇక పార్వతి నన్ను చంపాలని చూసినది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని రాజేంద్రప్రసాద్ అంటుంది కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం మౌనంగా ఉంటాడు. అటు అక్షయ్ కూడా మౌనంగా ఉంటాడు.. ఇక పార్వతి ఇలాంటిది హంతకురాలు నా ఇంట్లో ఉంటే ఎవరినైనా చంపాలని చూస్తుందని ఇంట్లోంచి బయటికి గెంటేయాలని అంటుంది కానీ ఎవరు మౌనంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అవనిని ఇంట్లోంచి గెంటేస్తున్న అక్షయ్ మౌనంగా ఉంటాడు. అవని ఇంట్లోంచి వెళ్లకపోతే నేను వెళ్ళిపోతాను నేనే కదా తప్పు చేసిందని నా మాటని మీరు ఎవరు నమ్మట్లేదు కదా అని పార్వతి అంటుంది. వెళ్లిపోవడం ఎందుకు అత్తయ్య మీరు ఏ తప్పు చేయలేదు తప్పు చేశానని మీరే నన్ను అంటున్నారు నా మీద ఎంత పెద్ద నిందలు మోపారు కదా నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని అవని ఇంట్లోంచి బయలుదేరుతుంది.. అక్షయ్ అవని వెళ్ళిపోతున్న ఏం మాట్లాడడు. ఇక ఆరాధ్యను తీసుకుని అవనిని మెడ పట్టి బయటకు గెంటేస్తుంది పార్వతి.. కమల్ ఎంత చెప్పినా కూడా అవని ఆగదు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కమల్ శ్రీకర్ కి ఫోన్ చేస్తాడు. వదిన వెళ్ళిపోతుందన్నయని బాధపడతాడు. ఏమైంది రా అని అడిగితే మొత్తం విషయాన్ని శ్రీకర్కు కమల్ చెప్తాడు. ఇద్దరం కలిసి వదినని వెతుకుదామని శ్రీకర్ అంటాడు. ఇంట్లోకి వెళ్లిన కమల్ మీరందరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారా.. వదిన వెళ్ళిపోయింది కదా మీరు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు అనేసి అంటాడు ఇక ఆరాధ్య ఎక్కడ కనిపించలేదని అందరు వెతుకుతారు. అదే ఒక గదిలో కూర్చుని వాళ్ళ అమ్మ ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అది చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు.. ఇక కమల్ ఇంట్లోకి వెళ్లి అందర్నీ తిడతాడు ఇక ఆరాధ్య లేదని ఆరాధ్యుని వెతుకుతారు. ఆరాధి మాత్రం తన అమ్మ ఫోటోను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అక్షయ ఆరాధన దగ్గర తీసుకుంటే నువ్వు మా అమ్మని ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఆపలేదు నువ్వు వెళ్ళు నాతో మాట్లాడొద్దు అనేసి అంటుంది.. ఇక పార్వతి దగ్గరకు వస్తే నువ్వు మా అమ్మని ఇంట్లో నుంచి బయటికి తోసేసావు నువ్వు కూడా నాతో మాట్లాడొద్దని అంటుంది. ఇక కమల్ ఆరాధ్య దగ్గరకు వచ్చి బంగారం నేను మీ అమ్మని తీసుకొస్తాను నువ్వు నేను చెప్పినట్టు వినాలి నువ్వు ఏడవద్దు అనేసి అంటాడు. రాజేంద్రప్రసాద్ కు ఆరాధ్యను అప్పజెప్పి కమల్ బయటికి వెళ్తానని వెళ్ళిపోతాడు..
శ్రీకర్ కమలిద్దరూ అవని కోసం వెతుకుతారు. అవని గుళ్లో దేవుడి దగ్గర తన గోడుని వినిపిస్తుంది. నీ మీద భారం వేచి నేను వెళ్తున్నాను నువ్వే నన్ను గట్టెక్కించాలని అవని బాధపడుతుంది. ఇక కమల్ శ్రీకర్ ఇద్దరు గుళ్లో వెతుకుతారు కానీ అవని చూడకుండా వెళ్ళిపోతారు. అవినీ గుడి నుంచి బయటికి రాగానే దొంగలు ఆమె మెడలోని బంగారాన్ని తీసుకోవాలని ఆమెపై దాడి చేస్తారు. ఆ బంగారాన్ని తీసుకుంటారు.. ఇక అవని మళ్లీ దేవుడి దగ్గరికి వెళ్లి నా మంగళ సూత్రాన్ని కూడా నాకు దూరం చేసావా నా భర్తను దూరం చేశావు నేను ఎందుకు బతకాలని బాధపడుతూ ఉంటుంది. రాజేంద్రప్రసాద్ ఇంట్లో పని చేసే సీను అక్కడికి వచ్చి ఇంత రాత్రిపూట మీరు ఎక్కడంటే అక్కడ ఉండకూడదు అమ్మ మీకు ఇల్లు దొరికేంత వరకు మా ఇంట్లోనే ఉండండి అని వాళ్ళింటికి బలవంతం గా ఒప్పించి తీసుకెళ్లిపోతారు. పల్లవి హ్యాపీగా ఫీల్ అవుతుంది అందులోకే భానుమతి వచ్చి ఆ అనాధ దరిద్రం బయటికి వెళ్లింది. నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు మాత్రం ఆరాధ్యను మచ్చిక చేసుకోవాళి అప్పుడే అవని ఇంకా ఇంటికి రాకుండా ఉంటుందని సలహా ఇస్తుంది.. ఇక పల్లవి మాత్రం ఆ గుడ్ న్యూస్ ని వాళ్ళ నాన్నతో షేర్ చేసుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..