Hyderabad Metro: మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో దాదాపు రెండు గంటలుగా మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. దీంతో అమీర్‌పేట-హైటెక్‌సిటీ, నాగోల్-సికింద్రాబాద్, మియాపూర్-అమీర్‌పేట రూట్లో నడిచే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నిత్యం రద్దీగా తిరిగే మెట్రో రైళ్లకు టెక్నికల్ ఇష్యూ కారణంగా.. ఎక్కడికక్కడే మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. అమీర్‌పేట-హైటెక్‌సిటీ, నాగోల్-సికింద్రాబాద్, మియాపూర్-అమీర్‌పేట రూట్లో నడిచే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి 8గంటల వరకు మెట్రో రైళ్లకు అంతరాయం ఏర్పడలేదు.. 9 గంటల నుంచే సాంకేతిక లోపం కారణంగా మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని మెట్రో యాజమాన్యం వెల్లడించింది.
ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే సమయం కావడంతో.. రైళ్లు ఎంతకీ రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. సాంకేతిక లోపం వల్ల ఆగిపోయిన మెట్రో రైళ్లు.. త్వరలోనే యాథావిదిగా తిరుగుతాయని మెట్రో అధికారులు పేర్కొన్నారు. అయితే సాంకేతిక లోపానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చాలా సందర్భాలలో ఇలాంటి సమస్యలు తలెత్తాయి. అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో అన్ని మెట్రో స్టోషన్‌లో రద్దీ ఏర్పడింది. అమీర పేట్ మెట్రో స్టేషన్‌లో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికు ఫ్లాట్ ఫామ్‌లపై నిరీక్షిస్తున్నారు.
Also Read: దేశంలో అత్యంత అందమైన రైలు ప్రయాణాలు, అస్సలు మిస్ కావద్దు!
ఇదిలా ఉంటే.. కుంభమేళాలో లో జరిగిన తొక్కిసలాట కారణంగా .. రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. మౌని అమావాస్య పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు నిన్న రాత్రి నుంచే ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్దకు భారీసంఖ్యలో భక్తులు వచ్చారు. తాకిడి విపరీతంగా ఉండటంతో బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగింది. ఘటనలో 20 మంది మరణించగా.. 50 మందికి పైగా భక్తులకు గాయాలైన సంగతి తెలిసిందే.. ఇంకా భక్తులు అక్కడకు చేరుకోకుండా భక్తుల రద్దీని నియంత్రించేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని రైళ్లను మధ్యలోనే నిలిపివేశారు.