E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు దొరికిపోయిన పల్లవి.. అవని సేఫ్..చక్రధర్ ను క్షమించిన అవని..

Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు దొరికిపోయిన పల్లవి.. అవని సేఫ్..చక్రధర్ ను క్షమించిన అవని..
Advertisement

Intinti Ramayanam Today Episode March 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి ఇవాళ ఎలాగైనా సరే అవని చచ్చిపోవాల్సిందే.. నేను ప్లాన్ చేశాను అంటే దాంట్లో తిరుగు ఉండదు అని ఆలోచిస్తూ ఉంటుంది. తను అనుకున్న విధంగానే ఆ లిఫ్ట్ ని కిందకు వదిలేసి అవని మీద పడేలా చేసేందుకు పక్కాగా ప్లాన్ చేస్తుంది. తన మనసులో ఉన్న 30 ఏళ్ల నుంచి దాచుకున్న భయంకరమైన నిజాన్ని బయటపెట్టాలి. అవినీతో చెప్పేయాల్సిందే, నా భారాన్ని దించుకోవాల్సిందేనని చక్రధర్ అవనిని వెతుక్కుంటూ ఆ సైట్ కి వస్తాడు. ఇక అవని మీద ఆ లిఫ్టు దాదాపు పడే సమయంలో చక్రధర్ అవనిని గమనించి పక్కకు లాగేస్తాడు. అయితే ఆ లిఫ్ట్ అక్కడ పడిపోయి ఇటుకలన్నీ చల్లాచెదురుగా పడిపోవడంతో అవని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతుంది. ఆ షాక్ లో అవని కళ్లు తిరిగిపడిపోతుంది. పల్లవి తన ప్లాన్ ఫెయిల్ అయిందేమో అని చూస్తుంటుంది. ఆ సౌండ్ కు ఏమైందో అని అందరు కంగారు పడుతూ బయటకు వస్తారు. అక్కడ అవని పడిపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని నీకేం కాలేదు కదా అని పార్వతి కూడా కారులోంచి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది.. చక్రధర్ గారు వచ్చి నన్ను కాపాడుకున్న అంటే ఇవన్నీ నా మీద పడి నేను చచ్చిపోయేదాన్ని అని అవని భయపడిపోతూ అక్షయ్ కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది.. మెటీరియల్లిఫ్టు ఇక్కడికెల్లా వచ్చింది అని అందరూ ఆరా తీస్తూ ఉంటారు. కానీ ఆ లిఫ్ట్ ని ఆపరేట్ చేస్తున్న వ్యక్తి మాత్రం అక్కడి నుంచి పారిపోతాడు.. పల్లవి ఎక్కడ తాను దొరికిపోతుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది.. చక్రధర్ పల్లవిని చూసి ఇదంతా పల్లవి ప్లాన్ అని అనుకుంటాడు.. అవనిని లేపగానే నాపై ఈ లిఫ్ట్ పడిపోతుంది అని టెన్షన్ పడుతూ అడుగుతుంది. నన్ను కాపాడారు అని అంటుంది.

Advertisement

పక్కనే పడున్న చక్రధర్ ను చూసి నన్ను కాపాడి ఆయన పడిపోయాడు అని అందరు కంగారు పడుతూ చక్రధర్ దగ్గరకు వస్తారు. అతను స్పృహ తప్పి కింద పడిపోవడంతో అందరూ ఏమైందని భయపడిపోతూ ఉంటారు.. చక్రధాన్ని ఎంతగా లేపడానికి ప్రయత్నించినా కూడా లేవడు. కమల్ ఏమైంది వదినా అని కంగారు పడిపోతూ ఉంటాడు.. చక్రధర్ ని ఎంతగా లేపడానికి ప్రయత్నించినా సరే అతను లేవకపోవడంతో అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. అవని ఇక నాన్న లేవండి అని కంగారు పడిపోతూ బాధపడిపోతూ ఉంటుంది. నాన్న అన్న పిలుపు విన్న చక్రధర వెంటనే లేస్తాడు. చీకటిలోకి వెళ్లిపోతున్న నన్ను నాన్న అన్న పిలుపు బయటకు తీసుకొని వచ్చింది అని చక్రధర్ ఎమోషనల్ అవుతాడు. ఒక్కసారి నన్ను నాన్న అని పిలవమ్మా అని అడుగుతాడు.. అవేం మాటలు నాన్నా అని అవని అంటుంది..

అక్కడికి వచ్చిన పల్లవి అవని చక్రధర్ ని నాన్న అని పిలవడం విని సీరియస్ గా ఉంటుంది. ఏదైతే వినపడుతో అనుకున్నానో అదే ఇప్పుడు చూడాల్సి వస్తుంది అని అనుకుంటుంది. కమల్ ఏంటి పల్లవి ఏం మాట్లాడవు అని అడుగుతాడు. నాన్న అని ఆమె పిలుస్తుంది కదా ఇక నేనేం చేయాలి అని పల్లవి అంటుంది. ఈ ప్రమాదం జరిగి మంచిదయింది తండ్రి కూతుర్లని కలిపింది అని పార్వతి అంటుంది.. అదేవిధంగా నువ్వు నాన్న అని పిలుస్తావని అస్సలు ఊహించలేదమ్మా అని చక్రధర్ ఎమోషనల్ అయిపోతాడు. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ సీన్తో ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది..

Advertisement

అవని ఇంటికి వెళ్ళగానే నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది అండి అని అక్షయతో అంటుంది. అయితే నువ్వు ఇలాగే ఉంటూ నేను ఫ్రెష్ చేసి వస్తాను అని అక్షయ్ అంటాడు. అమ్మ ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేసింది. నేను భూమి పూజకి వెళ్లానని చెప్పాను కదా.. మరి ఎన్నిసార్లు చేసింది ఏంటి అని ఒకసారి ఫోన్ చేయాలని బయటకు వస్తుంది అవని. నేను భూమి పూజకి వెళ్లాను అని చెప్పాను కదా అమ్మ మరి ఎన్నిసార్లు ఫోన్ చేసావ్ ఏంటి అని అడుగుతుంది. ఇవాళ మీ నాన్న ఇంటికి వచ్చాడు కానీ భరత్ దురుసుగా ప్రవర్తించి అయినను బాధపెట్టాడు అని చెప్తుంది మీనాక్షి. ఇవాళ ఆయనే లేకున్నా అంటే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదమ్మా నాకు మరోసారి పునర్జన్మని ఇచ్చాడు అని అవని అంటుంది. మీనాక్షి ఏమైందమ్మా అని అడగ్గానే అవని అక్కడ జరిగిన విషయాన్ని చెప్తుంది. ఇక నువ్వు మీ నాన్నని నాన్న అని ఒప్పుకుంటావని నేను అస్సలు ఊహించలేదు అని మీనాక్షి అంటుంది.

Also Read :కన్నడ హీరోయిన్స్ ను పెళ్లి చేసుకున్న తెలుగు హీరోలు ఎవరో తెలుసా..?

చక్రధర్ పల్లవి ఎందుకు ఇలా చేస్తుంది అర్థం కావడం లేదు.. మొన్న బావగారిని చంపాలి అనుకుంది.. ఇప్పుడు అవని చంపాలి అనుకుంది.. నా పగని తీర్చుకునేందుకు పల్లవిని నేనే అలా తయారు చేసాను. ఇప్పుడు పల్లవి నీ విషయం గురించి అడిగితే తప్పుగా అనుకుంటుంది ఏ క్షణమైనా సరే అవనిని ఒక ఇంట్లో ఉండడం వల్ల చంపాలని అనుకుంటుంది.. మెల్లగా పల్లవిని మార్చి ప్రయత్నం చేయాలి అని చక్రధర్ అనుకుంటాడు.. లోపలికి వెళ్లగానే రాజేశ్వరి భానుమతి అక్కడ ఉంటారు అయితే వాటర్ తీసుకురమ్మని చెప్పగానే రాజేశ్వరి పని మనిషికి నీళ్లు ఇవ్వమని చెప్తుంది.. చుట్టాలకి ఇచ్చినట్టు ఇంట్లో వాళ్లకి ఇంటి ఓనర్ కి పనిమనిషితో ఇలా మర్యాదలు చేయించకూడదు అని చక్రధర్ సీరియస్ అవుతాడు. నా తప్పు తెలుసుకొని నేను చాలా మారిపోయాను కానీ నాకు కోపం ఆవేశం అలానే ఉన్నాయి. ఏం చేయాలో అది చేస్తాను అని చక్రధర్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో చక్రధర్ కోసం స్వయంగా భోజనం తీసుకొని వస్తుంది అవని. అది చూసిన రాజేశ్వరి ఆ భోజనాన్ని విసిరి కొడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Big Stories

Advertisement
×