E-Paper
Advertisement

Brahmamgari Kalagnanam: బ్రహ్మంగారి కాలజ్ఞానం – కల్కి అవతారం వచ్చే ముందు కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతాయట

Brahmamgari Kalagnanam: బ్రహ్మంగారి కాలజ్ఞానం – కల్కి అవతారం వచ్చే ముందు కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతాయట
Advertisement

Brahmamgari Kalagnanam: బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం భూమ్మీదకు కల్లి అవతారం( వీరభోగ వసంతరాయలు) వచ్చే ముందు ఎలాంటి భయంకరమైన సంఘనలు జరుగుతాయో తెలుసా..? కలి ఎండింగ్‌లో ఎలాంటి బీభత్సం సృష్టిస్తాడో తెలుసా..? అసలు బ్రహ్మంగారు ఏం చెప్పారు.. ఆ విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన ‘కాలజ్ఞానం’లో కల్కి అవతారం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. కాలజ్ఞానం ప్రకారం కల్కి అవతారం ( వీరభోగ వసంతరాయలు)  గురించి ఎన్నో విషయాలు చెప్పారు. కల్కి భూమ్మీదకు రావడానికి ముందు ఆ ఘోరాలు జరుగుతాయని తెలిపారు. బ్రహ్మంగారు తెలిపిన ఆ ఘోరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వీరభోగ వసంతరాయలు: శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు కల్కిని శ్రీ వీరభోగ వసంతరాయలుగా అని పేర్కొన్నారు. కలియుగాంతంలో ధర్మాన్ని స్థాపించడానికి తానే మరలా ఆ రూపంలో జన్మిస్తానని బ్రహ్మంగారు చెప్పారట. లోకంలో అధర్మం పెరిగిపోయినప్పుడు, దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడానికి ఆయన ఆవిర్భవిస్తారని కాలజ్ఞానంలో ఉందని పండితులు చెప్తున్నారు.

కల్కి రాకకు సంకేతాలు- జరిగే ఘోరాలు: కల్కి అవతారం రావడానికి ముందు ప్రపంచంలో అనేక మార్పులు జరుగుతాయని బ్రహ్మంగారు వివరించారట. భూమ్మీద ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయట.  అకాల వర్షాలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు వంటివి జరుగుతాయట. వింత సంఘటనలు చోటు చేసుకుంటాయట. సముద్రం ముందుకు రావడం, నదుల్లో రక్తం పారడం, వింతైన వ్యాధులు రావడం వంటివి జరుగుతాయని బ్రహ్మంగారు పేర్కొన్నారట. ఇక సామాజిక మార్పులు సంభవిస్తాయట. కుటుంబ సంబంధాలు బలహీనపడటం, మనుషుల మధ్య నమ్మకం లేకపోవడం, ధర్మం నశించడం వంటివి ఈ అవతారానికి ముందస్తు సూచనలుగా చెప్పారట.

Advertisement

కల్కి రూపం – మార్గం: బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కల్కి అవతారం అకస్మాత్తుగా కాకుండా, ఒక క్రమ పద్ధతిలో జరుగుతుందట. ఆయన చిరంజీవులైన పరశురాముడు, అశ్వత్థామ వంటి వారి వద్ద విద్యలను అభ్యసిస్తారని తద్వారా లోకకల్యాణం కోసం సిద్ధమవుతారని బ్రహ్మంగారు చెప్పారట. ఈ అవతారం కులమతాలకు అతీతంగా, సర్వ మానవాళి సంక్షేమం కోసం పనిచేస్తుందని, ధర్మ సంస్థాపనయే ఆ అవతార ప్రధాన లక్ష్యమని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వివరించారట. ఇక అదే సమయంలో బ్రహ్మంగారి సమాధి ఉన్న కందిమల్లయ్యపల్లె ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందట.. అక్కడే కల్కి అవతారానికి సంబంధించిన మార్పులు మొదలవుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

ఇక కాలజ్ఞానంలో చెప్పబడిన విషయాలు చాలా వరకు సంకేత రూపంలో (Symbolic) ఉంటాయట. ఏయే సంవత్సరాల్లో ఏం జరుగుతుందో చెప్పేటప్పుడు బ్రహ్మంగారు తెలుగు సంవత్సరాల పేర్లను వాడారట. ఇవి ప్రతి 60 ఏళ్లకు ఒకసారి వస్తుంటాయి కాబట్టి, వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా క్లిష్టమైన విషయమని.. అనేకమంది పండితులు, పరిశోధకులు వీటిని వివిధ రకాలుగా విశ్లేషిస్తుంటారని చెప్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయలు ఎందుకు కడతారో తెలుసా

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×