E-Paper
Advertisement

Fellowship Scam: కేయు కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నోటీసులు

Fellowship Scam: కేయు కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నోటీసులు
Advertisement

Fellowship Scam: స్వేచ్ఛ బ్యూరో: యూనివర్సిటీల్లో ఫెలోషిప్ కుంభకోణంపై కాకతీయ యూనివర్సిటీ స్పందించింది. కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఎం శంకరయ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో, ఆయన పొందిన భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని రిజిస్ట్రార్ కార్యాలయం కఠిన ఆదేశాలు జారీచేసింది. సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం శంకరయ్యకు నోటీసులు జారీచేసింది. రూ.6.89 లక్షలు రీఫండ్ చేయాల్సిందేనని ఆదేశించింది. శంకరయ్య ఒకవైపు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా వేతనం పొందుతూనే, మరోవైపు యూజీసీ నుంచి పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్ కూడా పొందారు. నిబంధనల ప్రకారం రెండింటినీ ఏకకాలంలో పొందడం నిషిద్ధం. ఈ నిబంధనలకు తూట్లు పొడవడంపై ఆయనపై ఫిర్యాదులు అందాయి. ఈనేపథ్యంలో కేయూ అధికారులు ఎట్టకేలకు స్పందించి నోటీసులు జారీ చేశారు.

రూ.6,89,400..

అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకరయ్య చేసిన నిబంధనల ఉల్లంఘన వల్ల.. ఆయన పొందిన మొత్తం పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ అమౌంట్ రూ.6,89,400 వెంటనే తిరిగి చెల్లించాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. అయితే.. ఈ మొత్తాన్ని తగ్గించాలని డాక్టర్ శంకరయ్య గతంలో పెట్టుకున్న దరఖాస్తును రిజిస్ట్రార్ తోసిపుచ్చారు. ఈ మొత్తాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే కాకతీయ యూనివర్సిటీలోని యూజీసీ యూనిట్ సమన్వయకర్తకు చెల్లించాలని ఆదేశించారు. తద్వారా ఆ మొత్తాన్ని తిరిగి న్యూఢిల్లీలోని యూజీసీ కార్యాలయానికి బదిలీ చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇకపై ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండవని, ఇదే తుది హెచ్చరిక అంటూ పేర్కొన్నారు. వెంటనే నిధులు జమ చేయాలని రిజిస్ట్రార్ తన ఉత్తర్వుల్లో కరాఖండిగా చెప్పారు.

Advertisement

Also Read: Biographical Thriller OTT: అణుబాంబుతో ఆటలాడిన మొనగాడి లైఫ్ స్టోరీ… ఏడు ఆస్కార్లు గెలిచిన అద్భుతం… ఐయండిబిలో 8.2 రేటింగ్

కాకతీయ యూనివర్సిటీలో..

సాధారణంగా ఉన్నత విద్యలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు యూజీసీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ నిధులను మంజూరు చేస్తుంది. అయితే ఈ నిధులు పొందే వ్యక్తి పూర్తిస్థాయి పరిశోధనకే అంకితం కావాల్సి ఉంటుంది. ఒకే వ్యక్తి రెండు చోట్ల నుంచి ఆర్థిక ప్రయోజనం పొందడం ‘డబుల్ బెనిఫిట్’ కిందకు వస్తుంది, ఇది తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ ఉదంతం కాకతీయ యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటి వరకు శంకరయ్యకు సంబంధించి అంశంపైనే ఫిర్యాదు రావడంతో ఆయనకు వర్సిటీ అధికారులు నోటీసులు అందించారు. కానీ నిబంధనలు ఉల్లంఘించి డబుల్ బెనిఫిట్స్ అందుకుంటున్న ఘటనలు మరిన్ని ఉన్నాయనే చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది. వాటిపై కూడా వర్సిటీ దృష్టిపెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయి. మరి వర్సిటీ అధికారులు ఇలాంటి మరిన్ని ఉల్లంఘనులకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి.

Advertisement

Also Read: Hyped Samvadini: వాట్సాప్‌కు ధీటుగా దేశీయ యాప్.. హైప్డ్ సంవాదిని ఎంట్రీ, డేటా సేఫ్ కూడా

Related News

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్‌సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

Big Stories

Advertisement
×