E-Paper
Advertisement

దెయ్యం పెళ్లాంతో కాపురం… పొట్ట పగిలే కామెడీ… థాయ్ సినీ చరిత్రను తిరగ రాసిన సినిమా

దెయ్యం పెళ్లాంతో కాపురం… పొట్ట పగిలే కామెడీ… థాయ్ సినీ చరిత్రను తిరగ రాసిన సినిమా
Advertisement

Horror Comedy OTT : సాధారణంగా దెయ్యం సినిమాలంటే భయపెడతాయి. వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి. అయితే అంతకంటే ఎక్కువగా నవ్వించే హారర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఈ హారర్ కి కామెడీని అదిరిపోయే రేంజ్‌లో మిక్స్ చేశారు. ఇందులో హీరోతో పాటు, నలుగురు స్నేహితుల మధ్య వచ్చే కామెడీ సీన్లు థియేటర్లలో నవ్వులు పూయించాయి. ఈ సినిమా కేవలం థాయ్‌లాండ్‌లోనే కాకుండా.. ఇండియా, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల్లో కూడా విపరీతంగా ఆడింది. మన దగ్గర కూడా సోషల్ మీడియాలో దీని కామెడీ క్లిప్స్ బాగా ఫేమస్ అయ్యాయి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ థాయ్ హారర్ కామెడీ సినిమా పేరు ‘పీ మాక్’ (Pee Mak). 2013లో వచ్చిన ఈ సినిమా, థాయ్‌లాండ్ జానపద కథ అయిన “మే నాక్ ఫ్రా ఖానాంగ్” ఆధారంగా రూపొందింది. బంజోంగ్ పిసంతనకున్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మారియో మౌరర్ (మాక్), డావికా హూర్నే (నాక్) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా థాయ్‌లాండ్‌లో సుమారు 1 బిలియన్ బాట్ (దాదాపు 200 కోట్లకు పైగా రూపాయలు) వసూలు చేసి, ఆ దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా Netflix, Prime Video ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

యుద్ధానికి పోయిన మాక్ అనే కుర్రాడు, అక్కడ తన ప్రాణాలు కాపాడిన నలుగురు దోస్తులను (టెర్, పువాక్, షిన్, ఏయ్) వేసుకుని తన ఊరికి తిరిగొస్తాడు. ఇంట్లో అతని భార్య నాక్ పుట్టిన పిల్లాడితో ఎదురుచూస్తుంటే, మాక్ తెగ ఖుషీ అయిపోతాడు. తన దోస్తులకి కూడా తన భార్యని పరిచయం చేసి, పక్కనే ఉన్న ఇంట్లో వాళ్లకి విడిది ఏర్పాటు చేస్తాడు. అంతా బాగానే ఉంది అనుకునే లోపే అసలు పంచాయితీ మొదలవుతుంది. ఊర్లో వాళ్లంతా నీ పెళ్ళాం ఎప్పుడో చచ్చిపోయింది, ఇప్పుడు నీ పక్కన ఉన్నది దెయ్యమని మాక్ కి చెబుతుంటారు. కానీ మాక్ మాత్రం తన పెళ్ళాం మీద ఉన్న పిచ్చ ప్రేమతో అవేమీ నమ్మడు. అతని దోస్తులు మాత్రం భయంతో వణికిపోతూ, ఆమె నిజంగానే దెయ్యమా కాదా అని కనిపెట్టడానికి నానా తంటాలు పడతారు. ఈ క్రమంలో వచ్చే సీన్లు, ఆ నలుగురు స్నేహితుల కామెడీ మామూలుగా ఉండదు, పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. చివరికి మాక్ కి అసలు విషయం తెలుస్తుందా ? అతని భార్య ఎలా చనిపోయింది ? ఇప్పుడున్న దెయ్యం భార్యతో ప్రయాణం ఎంతవరకు వెళ్తుంది ? అనే విషయాలను, ఈ హారర్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also :  ఇక్కడ దేవుడు లేడు… కేవలం దయ్యాల మనుషులే… మామూలు సినిమా కాదు క్లైమాక్స్ వరకు వణుకు

Tags

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×