E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి పై కమల్ కు అనుమానం.. షాకిచ్చిన శ్రీయా.. అవని ప్లాన్ సక్సెస్ అవుతుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి పై కమల్ కు అనుమానం.. షాకిచ్చిన శ్రీయా.. అవని ప్లాన్ సక్సెస్ అవుతుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode October 10th : నిన్నటి ఎపిసోడ్ లో.. నువ్వు బాధ్యతగా ఆ డబ్బులు ఏమయ్యా అని వెతకాల్సింది పోయి సైలెంట్ గా ఉన్నావు.. నాకు ఏమన్నాలో అర్థం కావట్లేదు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. మీరిలా అవనీని వెనకేసుకొని వస్తే ఇంకా రెచ్చిపోతుంది అని అక్షయ్ అంటాడు. అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. పల్లవి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది. ఆ అవని కచ్చితంగా మనం డబ్బులు తీశామని తెలుసుకుంది. ఈ విషయాన్ని బయట పెడితే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది.. అవని ఆ డబ్బుని కనిపెట్టే ఛాన్స్ లేదు అని చక్రధర్ పల్లవితో చెప్పడంతో పల్లవి కూలై అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఇంట్లో పోయిన డబ్బులు తెలుసుకోవడానికి వదిన మామూలుగా ప్రయత్నాలు చేయట్లేదు అని కమలంటాడు. రేపు లైవ్ డిటెక్టర్ వాళ్ళు వస్తున్నారు. ఆ డబ్బులు ఎవరు తీశారు వాళ్ళ నోటితోనే చెప్పిస్తారు అని అవని అనగానే పల్లవి షాక్ అవుతుంది. వాళ్ళు వస్తే తన బండారం బయటపడిపోతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. కమల్ పల్లవి టెన్షన్ పడడం చూసి ఆ డబ్బులు నువ్వు తీసావా అని అడుగుతాడు. నాకెందుకో నువ్వే తీసావని అనుమానంగా ఉంది అని పల్లవితో కమలంటాడు. ఇంకేం అవసరం బావ డబ్బులు తీయాల్సిన అవసరం నాకేంటి అని రివర్స్లోనే పల్లవి అడుగుతుంది. వాళ్ళు వస్తున్నారు అంటే నువ్వు ఎందుకు టెన్షన్ పడ్డావు నాకు అర్థం కావట్లేదు.. నువ్వు నిన్న వద్దన్నావు కదా అందుకే నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది అని కమలంటాడు.

Advertisement

ఇంట్లో అత్తయ్య మామయ్య అమ్మమ్మ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ డబ్బులు ఎవరు తీసారో తెలిస్తే వాళ్ళు టెన్షన్ పడిపోతారు. అందుకే నేను వద్దని అన్నాను. అంతేగాని డబ్బులు నేనెందుకు తీస్తాను నాకేం అవసరమని పల్లవి అడుగుతుంది. ఏం జరుగుతుందో రేపు చూద్దాం కదా అని కమలంటాడు. పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. చక్రధర్ కు చెప్పిన విషయాన్ని మర్చిపోతాడేమో అనుకొని అనుకుంటుంది. కచ్చితంగా డాడ్ డబ్బులు తీసుకొస్తాడు ఆ డబ్బులు ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తాను అని అనుకుంటూ ఉంటుంది..

ఉదయం లేవగానే అవని అందరికీ టీ తీసుకొచ్చి ఇస్తుంది. శ్రియకి టీ ఇస్తే నాకేం అవసరం లేదు అని అంటుంది. అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని తీసుకొచ్చాను అని అవని అంటుంది. అక్షయ్ కి టీ ఇవ్వబోతే నాకేం అవసరం లేదు అని అంటాడు. వాళ్లు వస్తారా రారా అని టెన్షన్ లో తలనొప్పి వస్తుంటుంది కొంచెం టీ తాగండి అని అంటుంది. అయితే టీ తాగితే తలనొప్పి పోతుంది కదా అని అవని ఎంత చెప్పినా సరే అక్షయ్ మాత్రం మాట వినడు.. ఆ డబ్బులు ఏమయ్యాయో తెలుసుకోవాలని నేను చేసే ప్రయత్నం కచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ దొంగ ఎవరో కచ్చితంగా నేను తెలుసుకుంటాను అని అవని అంటుంది.

Advertisement

ఇక పల్లవి దగ్గరికి వెళ్లిన అవని టీ తీసుకో ఇప్పటి నుంచే టెన్షన్ పడడం ఎందుకు అని సలహా ఇస్తుంది. నేనెందుకు టెన్షన్ పడతాను అని పల్లవి అంటుంది. ఆ డబ్బులు నువ్వు తీసావని అనుమానం కాదు నువ్వే తీసావ్ అని నా నమ్మకం. కచ్చితంగా ఆ డబ్బుల్ని నువ్వు తీసావని తెలిస్తే మాత్రం ఇంట్లోని వాళ్ళందరూ ఛీ కొడతారు.. బయటికి గెంటేస్తారు. నీకు వాళ్ళు రాకముందే ఒక మంచి ఆఫర్ ఉంది చెప్పనా అని అవని అంటుంది. ఏంటి ఆ ఆఫర్ అని పల్లవి అడుగుతుంది. ఏం లేదు నీ అంతటి నువ్వు ఆ డబ్బులు అక్కడ పెట్టేస్తే సరి లేదంటే మాత్రం నేను చెప్పినట్టే అవమానాలు తప్పవు అని వార్నింగ్ ఇస్తుంది.

భానుమతి సీరియస్గా అటు ఇటు తిరుగుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన కమల్ ఏంటి ముసలి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు దేని గురించి అని అడుగుతాడు. ఏం లేదురా మా ఆయన నీలోకి వస్తున్నాడు కదా నాకు అది ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. మా ఆయన నిజంగానే నీలోకి వస్తున్నాడా..? లేదా నువ్వు అలా మాట్లాడుతున్నావు అన్నది ఇప్పుడు వాళ్ళు ఎవరో నిజాలు చెప్పే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు తేలిస్తే ఆ తర్వాత నీకు ఉంటుంది అని భానుమతి అంటుంది.

Also Read : ప్రభావతి కోరిక తీర్చిన కామాక్షి.. మగాళ్లకు షాకిచ్చిన నాట్యమయూరి.. బాలు సెటైర్స్..

పల్లవి టెన్షన్ పడుతుండడం చూసిన శ్రీయా ఏంటి టెన్షన్ పడుతున్నావ్ ఆ డబ్బులు నువ్వే తీసావని కన్ఫర్మ్ అయిపోయింది. కచ్చితంగా నిన్ను వాళ్ళు కనిపెడతారు. ఆ తర్వాత నిన్ను పోలీసులు పట్టుకొని వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏదో ఒకటి చేసి అవన్నీ కూడా ఇంట్లోంచి బయటికి పంపిస్తాను. ఇంటికి నేనే మహారాణిని అని అంటుంది.. ఇక పల్లవి మాత్రం టెన్షన్ పడుతూ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది. చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మరింత టెన్షన్ పడుతూ ఈరోజు నా పని అయిపోయినట్లే అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో పల్లవి దొరుకుతుందా లేదా అన్నది చూడాలి..

 

Related News

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Big Stories

Advertisement
×