Gundeninda GudiGantalu Today episode October 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ షాప్ కి దిలీప్ రావడం చూసి రోహిణి షాక్ అవుతుంది. డబ్బులు కావాలని ఎన్ని సార్లు అడుగుతావు నా దగ్గర డబ్బులు లేవు అని రోహిణి అంటుంది. ఈ షాప్లో ఖరీదైన ఫన్నీచర్స్ ని నేను తీసుకెళ్లి పోతాను అని తనకు నచ్చిన వాటిని తీసుకొని వెళ్ళిపోతాడు. మనోజు ఆ డబ్బులు ఏవి అని అడుగుతాడు రోహిణి సైలెంట్ గా తప్పించుకుని వెళ్ళిపోతుంది.. దినేష్ గొడవని ఎలాగైనా సరే దూరం చేసుకోవాలని రోహిణి ఫిక్స్ అవుతుంది. వాడికి వార్నింగ్ ఇవ్వాలని విధ్యతో ఎవరైనా రౌడీ ఉంటే చెప్పు అని అడుగుతుంది. గుణ చేత రోహిణి దినేష్ కి వార్నింగ్ ఇప్పించాలని అనుకుంటుంది. రోహిణి అడిగినందుకాను బాలుని ఎలాగైనా దెబ్బ కొట్టాలని అంటే మనం ఈ పని చేయాలని దినేష్ కి వార్నింగ్ ఇస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రోహిణి ప్రభావతికి మంచి బిజినెస్ ఐడియా ఇస్తుంది. మీరు కూడా మంచి సొంతంగా బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మంచిది అని సలహా ఇస్తుంది ప్రభావతి ఆ సలహాని తీసుకొని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది.. నేను చిన్నప్పుడు నుంచి ఒక పెద్ద డాన్సర్ ని కచ్చితంగా నేను డాన్స్ స్కూల్ పెట్టి మంచి బిజినెస్ ని చేస్తాను. అయితే ఈ ఇంట్లో పెట్టడం కుదరదు. కామాక్షి వాళ్ళ ఇంట్లో మీరు ఉన్నది ఇద్దరే కదా.. అన్నయ్య ఎలాగో డ్యూటీకి పోతాడు నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా మరి మీ ఇంటి నాకు ఇవ్వవా డాన్స్ స్కూల్ పెట్టుకుంటాను అని అడుగుతుంది.
అందరూ బలవంతం చేయడంతో కామాక్షి తప్పక డాన్స్ స్కూల్ గురించి ఒప్పుకుంటుంది. ఇక కామాక్షి ఒప్పుకోవడంతో ప్రభావతి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. నా ఫ్రెండ్ వి.. నాకోసం నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు చాలా థాంక్స్ నీకు కూడా డాన్స్ నేర్పిస్తాను అని అంటుంది. అంతేకాదు బిజినెస్ గురించి అప్పుడే చేసుకుంటుంది. 50 మందికి నేర్పితే కచ్చితంగా లక్ష రూపాయలు వచ్చేస్తాయి అంటూ కలలు కంటుంది.
ఉదయం లేవగానే మీనా పైకి ఎదురుచూస్తూ కనిపించడంతో సత్యం ఏమైంది అని అడుగుతాడు. ఈరోజు మీరు ఓ అద్భుతాన్ని చూడబోతున్నారు మావయ్య అని నేను అంటుంది. రెడీ అవుతుంది డాన్స్ స్కూల్ పెట్టబోతుంది మీరు అది చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అని అంటుంది. ఈ వయసులో ఇలాంటి పనులు అవసరమా దానికి.. ఇది చూసి నా గుండె ఆగుతుందా అని అంటాడు. అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. ఏమైంది నాన్న గుండె రుద్దుకుంటున్నావు. హాస్పిటల్ కి వెళ్దామా అని అడుగుతాడు. కాసేపు ఆగిన తర్వాత ఆలోచిద్దాం రా ఏం జరుగుతుందో అని అంటాడు..
మీనా అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మని పిలిస్తే నేను వచ్చేసాను ఏమైంది అని అడుగుతాడు. మీరు ఈరోజు ఒక భూతాన్ని చూడబోతున్నారు అందుకే రమ్మని ఉంటుంది అని సత్యం అంటాడు.. రవి ఈ బిర్యాని ఎందుకు తీసుకురమ్మన్నారు అని అడుగుతాడు. మీరు ఈరోజు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు. అందుకే అత్తయ్య ఇంట్లో వంట చేయొద్దని అంది. నీకు ఫోన్ చేసి బిర్యానీ తీసుకు రమ్మని చెప్పమంది. అద్భుతమా ఏంటది అంటే కాసేపు ఆగరా నువ్వే చూస్తావు అని రవితో సత్యం అంటాడు.
ప్రభావతి నాట్య మయూరి గెటప్ లో రెడీ అయ్యి కిందకు వస్తూ ఉంటే ముగ్గురు మగాళ్లు భయపడుతూ గజగజ వణుకుతూ ఉంటారు. ప్రభావతిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి గెటప్ ఈ వయసులో ఇంత సాహసం చేయడం అవసరమా అని సత్యం అడుగుతాడు. ఇది సాహసం కాదు నాలోని నాట్యం మయూరిని నిద్ర లేపాను. అంటూ ప్రభావతి పర్ఫామెన్స్ చేస్తుంది. అది చూసిన బాలు షాక్ లో బిగుసుకుపోతాడు.. ఈ వయసులో రిస్క్ అవసరమా అని సత్యం ఎంత చెప్పిన సరే ప్రభావతి మాత్రం ప్రభావతి 2.0 అంటూ డాన్స్ స్కూల్ గురించి చెప్తుంది.
Also Read: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ రామరాజు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే?
ప్రభావతి కామాక్షి ఇంట్లో ఏర్పాటు చేసిన డాన్స్ స్కూల్ గురించి అందరికీ చెప్తుంది. రిబ్బన్ కట్ చేయడానికి శృతి వాళ్ళ అమ్మని పిలుద్దామని అనుకున్నాను. కానీ కుదరలేదు. ముందు జ్యోతి ప్రజ్వాల చేయాలి అనగానే బాలు షాక్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..