E-Paper
Advertisement

Yuzvendra Chahal: విడాకులు తీసుకున్న మ‌హిళ‌ల‌కు భ‌ర‌ణం ఇవ్వొద్దు… చాహ‌ల్ సంచ‌ల‌నం పోస్ట్‌

Yuzvendra Chahal: విడాకులు తీసుకున్న మ‌హిళ‌ల‌కు భ‌ర‌ణం ఇవ్వొద్దు… చాహ‌ల్ సంచ‌ల‌నం పోస్ట్‌
Advertisement
Yuzvendra Chahal:  టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal) సంచలన పోస్ట్ పెట్టాడు. భరణం విషయాన్ని గుర్తు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు షేర్ చేశాడు చాహల్. విడాకులు తీసుకున్న మహిళలకు భరణం ఇచ్చేది లేదంటూ గతంలో ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా షేర్ చేశాడు. కాళ్లు చేతులు బాగా ఉండి పని చేసుకునే, మహిళలకు భరణం ఇవ్వాల్సిన పనిలేదంటూ ఇటీవ‌లే ఢిల్లీ కోర్డు తీర్పు ఇచ్చింది. అయితే, ఆ కోర్టు తీర్పునే చాహ‌ల్ షేర్ చేశాడు. ధన శ్రీ వర్మపైన పీకల దాకా కోపం పైన ఉన్న చాహల్, ఈ పోస్ట్ పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అంటే భరణం విషయంలో యుజ్వేంద్ర చాహాల్‌ను ధనశ్రీ వర్మ ( Dhanashree Verma) బాగానే టార్చర్ పెట్టింద‌ని అంటున్నారు. అందుకే చాహల్‌ ఈ పోస్ట్ పెట్టినట్లు ఆయన అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

ఉద్యోగం, జీతం ఉన్న మహిళలకు “భరణం” ఎందుకు..?

ఇటీవల ఓ జంట విడాకులు తీసుకున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. విడాకులు తీసుకున్న తర్వాత మహిళలకు భరణం ఇవ్వడం పై క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగం అలాగే జీతం ఉన్న మహిళలకు భరణం ఎందుకు అంటూ ప్రశ్నించింది ఢిల్లీ హైకోర్టు. డబ్బులు సంపాదించుకునే మార్గం లేని, మహిళలకు భరణం ఇస్తే అర్థం ఉంటుందని వెల్లడించింది. ఎలాంటి సంపాదన లేనివాళ్లు, పనిచేయలేని పరిస్థితిలో ఉన్న మహిళలకు మాత్రమే భరణం ఇవ్వాలని కోర్టు వెల్లడించింది. కానీ డబ్బులు సొంతంగా సంపాదించుకునే మహిళలతో పాటు ఉద్యోగం చేసుకునే వాళ్లకు భరణ నివ్వాల్సిన పనిలేదని కోర్టు తెలిపింది. ఇదే తీర్పులో తాజాగా చాహల్ షేర్ చేశాడు. తన మాజీ భార్య ధనశ్రీ వర్మ సొంతంగా డబ్బులు సంపాదించుకుంటుంది. సోషల్ మీడియా అలాగే ఇప్పుడు సినిమాల ద్వారా బాగానే అర్జిస్తోంది. అయినా కూడా తన దగ్గర ఆమె మరణం తీసుకుందని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు చాహల్.

నాలుగు కోట్లకు పైగా భరణం ఇచ్చిన చాహల్

యుజ్వేంద్ర‌ చాహల్ అలాగే ధనశ్రీ వర్మ 2020 సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దాదాపు రెండు సంవత్సరాలు కాపురం చేసిన… ఇటీవల విడాకులు తీసుకుంది. ముంబై ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకుల సందర్భంగా దాదాపు 60 కోట్ల భరణం ఇవ్వాలని చాహల్ పైన ఒత్తిడి తెచ్చిందట ధనశ్రీ వర్మ. దీనికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అయ్యాయి. కానీ చివరికి కోర్టు తీర్పు మేరకు 4.75 కోట్లు భరణం ఇచ్చేందుకు చాహల్ ఒప్పుకున్నాడట. ధనశ్రీ వర్మకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆర్జే మ‌హ్వాష్ తో చాహల్‌ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమెను త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సినిమా చేసేందుకు ధన శ్రీ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఎవరి లైఫ్ వారు ఎంజాయ్ చేస్తున్నారు.

https://twitter.com/ShoneeKapoor/status/1981314830293487621

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×