BigTV English

Akhanda 2: ‘అఖండ 2’ నుంచి బిగ్ లీక్… హిందూపురం ఎమ్మెల్యే పాత్రలో బాలయ్య

Akhanda 2: ‘అఖండ 2’ నుంచి బిగ్ లీక్… హిందూపురం ఎమ్మెల్యే పాత్రలో బాలయ్య
Advertisement

Akhanda 2: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. డాకు మహారాజ్ మూవీతో రీసెంట్ గా ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ యావరేజ్ టాక్ ని అందుకున్న సరే.. కలెక్షన్లు మాత్రం భారీగా వసూల్ అవ్వడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేస్తుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 మూవీలో నటిస్తున్నారు.. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. గత నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుందంటూ ప్రచారం జరిగింది కానీ షూటింగ్ పెండింగ్ ఉండడం వల్ల సినిమా పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒక పాత్ర గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం..


హిందూపురం ఎమ్మెల్యే గా బాలయ్య..

బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కి.. బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అఖండకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై మొదటి నుంచి ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. ఈ సినిమాను ఎప్పుడు థియేటర్లలో చూస్తామని నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. కొన్ని కారణాలవల్ల ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇదిలా ఉండగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అనే విషయం తెలిసిందే. అందులో ఒకటి అఘోర పాత్ర అయితే, మరొకటి హిందూపురం ఎమ్మెల్యే మురళీకృష్ణ పాత్రలో నటించబోతున్నాడు అంటూ సమాచారం. దీని గురించి చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్న బాలయ్య అదే పాత్రలో నటించడం అంటే మామూలు విషయం కాదంటూ ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ బాలయ్య సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read : పండగవేళ చిచ్చుపెట్టిన శోభ.. రెచ్చిపోయిన బాలు..సత్యం సీరియస్..


గూస్ బంప్స్ తెప్పించే సీన్స్.. 

గతంలో వచ్చిన అఖండ మూవీ కన్నా ఈ మూవీలో యాక్షన్ సీన్స్ మాములుగా లేవని టీమ్ చెబుతున్నారు. హిమాలయాల్లో శివలింగంకు అభిషేకం చేస్తూ పవర్ ఫుల్ రోల్ లో బాలయ్య ఇంట్రడక్షన్ ఉండనుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. బాలయ్య ఎంట్రీలో వచ్చే విజువల్స్ మొత్తం సినిమాకి హైలెట్ కానున్నాయని తెలుస్తుంది.. బాలయ్య అఘోర పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రకు గతంలో మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే ఈసారి బాలయ్య అఘోరగా కనిపిస్తే, మరో పాత్ర ఎమ్మెల్యే గా కనిపించనున్నాడు. అఖండ 2 తాండవం సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై.. రామ్ ఆచంట, గోపి అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Tollywood Heroines : సినిమాల్లోకి రాకముందు సీరియల్స్ చేసిన టాప్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

Spirit : కేవలం పోలీస్ కాదు ఖైదీ కూడా, సందీప్ రెడ్డి వంగ గట్టిగానే ప్లాన్ చేశాడు

Dheekshith Shetty : ఒక సినిమా అవ్వకముందే ఇంకో సినిమాకి అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారు

Upasana -Ramcharan: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Dude Movie: 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ డ్యూడ్.. ముచ్చటగా మూడోసారి!

OG Collections: ముగిసిన థియేట్రికల్ రన్.. ఓజీ టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

RGV : సీడీ లు అమ్ముకునే నేను అలా డైరెక్టర్ అయ్యాను

Big Stories

×