E-Paper
Advertisement

ఆచారం పేరుతో ఆడపిల్లల్ని చంపి బావిలో పాతరేసే ఊరు… కట్ చేస్తే గుండెలు జారిపోయే సీన్లు

ఆచారం పేరుతో ఆడపిల్లల్ని చంపి బావిలో పాతరేసే ఊరు… కట్ చేస్తే గుండెలు జారిపోయే సీన్లు
Advertisement

Horror movie: ప్రపంచం ఓవైపు రోబోలు, ఏఐలు అంటూ అందనంత స్పీడ్ తో పరుగులు తీస్తుంటే, మరోవైపు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో జనాలు మూఢ నమ్మకాల్లో కూరుకుపోతున్నారు. ఆడపిల్లలను ఆచారం పేరుతో బలిచ్చే ఓ ఊరికి ఎలాంటి గతి పట్టింది ? అన్న స్టోరీతో రూపొందిన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. 2020లో విడుదలైన హిందీ హారర్ డ్రామా “కాళీ ఖుహీ” (Kaali Khuhi)నే అది. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో వీక్షించవచ్చు ? కథ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

పంజాబ్‌లోని ఒక మారుమూల గ్రామం నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుంది. ఆ గ్రామానికి భయంకరమైన గతం కూడా ఉంటుంది. అక్కడ ఆడపిల్లలు పుడితే పురిట్లోనే చంపేసే క్రూరమైన ఆచారం ఒకప్పుడు ఉండేది. అలా చంపేసిన ఆడపిల్లల మృతదేహాలను ఊరి చివరన ఉన్న ఒక పాడుబడిన బావిలో పడేసేవారు. ఆ బావిని కాళీ ఖుహీ అని పిలుచుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఊరిలో వింత సంఘటనలు జరగడం మొదలవుతుంది.

Advertisement

గతంలో ఆ ఊరి జనాలు చ్చేసిన పాపాల కారణంగా ఇప్పుడు ఇబ్బందులో పడతారు. ఆ బావి నుండి ఒక శక్తివంతమైన దుష్టాత్మ ఊరిని వల్లకాడు చేయడానికి పూనుకుంటుంది. ఆ ఆత్మ శాపం వల్ల గ్రామంలోని పెద్దలందరూ ఒకరి తర్వాత ఒకరు వింత వ్యాధుల బారిన పడి, అనుమానాస్పద స్థితిలో చనిపోతుంటారు. ఈ క్రమంలోనే శివాంగి (రివా అరోరా) అనే 10 ఏళ్ల బాలిక ఆ ఊర్లో అడుగు పెడుతుంది. తన తల్లిదండ్రులతో కలిసి, గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన నానమ్మను చూడటానికి వస్తుంది.

గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి శివాంగికి వింత శబ్దాలు వినిపిస్తాయి. చిన్న అమ్మాయి రూపంలో ఉన్న ఆత్మ ఈ పిల్లకి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆ ఊరిని వేధిస్తున్న శాపం గురించి, ఆ ఆత్మ వెనుక ఉన్న దారుణమైన గతం శివాంగి తెలుసుకుంటుంది. తన నానమ్మతో సహా తన కుటుంబాన్ని, ఆ గ్రామాన్ని భయంకరమైన ఆత్మ పెట్టిన శాపం నుండి కాపాడాలని అనుకుంటుంది ఆ పదేళ్ల చిన్నారి.

Advertisement

మరి ఆ పిల్ల ఒంటరిగా ఈ పోరాటం ఎలా చేసింది? ఆ గతానికి, ఇప్పటి శాపానికి ఎలా ముగింపు పలికింది ? అన్నది కథ. మూవీ స్ట్రీమింగ్ విషయానికొస్తే… నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఈ మూవీ హిందీ, ఇంగ్లీష్ ఆడియోలలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో అందుబాటులో లేదు. సాధారణంగా హర్రర్ సినిమాలు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. కానీ చిన్న పిల్లలు కీ రోల్ పోషిస్తే ఇంకా బాగుంటుంది. అందులోనూ స్టోరీ మొత్తం చిన్న పిల్లల చావుల చుట్టే ఉండడం ఆసక్తికరంగా ఉంటుంది. ఇంకా ఈ మూవీని చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి మరి.

Read Also: అండర్ కవర్ ముసుగులో ఇదేం పని? డేంజరస్ ఆపరేషన్స్ తో పాటు డార్క్ కామెడీ ఉన్న సిరీస్

Tags

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×