Podarillu Today Episode June 30th : కన్నా ఒక్కడే ఇంట్లో ఉండడం చేసిన మాధవ్ చక్రి ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. ఏమో అన్నయ్య ఎక్కడికి వెళ్లాడు నాకు తెలియదు అని కన్నా చెప్పగానే.. చక్రి అప్పుడే ఇంట్లోకి రావడం చూసిన మాధవ్ కేశవ ఇద్దరూ కూడా కన్నకు బాగోలేదని చెప్పిన నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అరిస్తారు.. వాడికి జ్వరం ఎక్కువైంది కదా చూసుకోమని చెప్తే నువ్వు ఇలా వదిలేసి వెళ్తావా అసలు ఎక్కడికి వెళ్లావు నువ్వు అని వాళ్ళిద్దరూ అడుగుతారు. ఇప్పుడు డ్రైవింగ్ కూడా చేయడం లేదు కదా మరి ఎక్కడ తిరిగేసి వస్తున్నారు తమరు అని కేశవ అనడంతో చక్రి చాలా ఫీల్ అవుతాడు. ఒక కన్న మాత్రం వదిన ఉంటే బాగుండేది అని ఎమోషనల్ అవుతాడు. ఇంకా లోపలికి వెళ్ళిన కన్నా మహాలక్ష్మికి ఫోన్ చేసి చెప్తాడు. హాస్పిటల్ కి వెళ్ళలేకపోయావా అని మహా అడుగుతుంది. అయితే కన్నా మాత్రం మహాని మళ్ళీ ఇంటికి వస్తారా వదిన అని అడుగుతాడు. చక్రి అన్నయ్య నీ దగ్గరికి కూడా రానివ్వకుండా చూసుకునే బాధ్యత నాది అని మాట ఇస్తాడు. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. తర్వాత రోజు ఉదయం కన్నాని చూడ్డానికి మహాలక్ష్మి ఇంటికి వస్తుంది.. నారాయణ నాదే తప్పు అని గుంజీలు తీస్తాడు.
మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న వాతావరణం చూసి షాక్ అవుతుంది. ఇంట్లో ఒకవైపు జ్వరము వచ్చిన పేషెంట్ ఉన్నారు కానీ ఇల్లంతా ఏంటి ఇలా ఉంది అని మహాలక్ష్మి లోపలికి అడుగుపెట్టగానే చూసి స్టాక్ అవుతుంది.. కేశవ మహని చూసి అన్నయ్య అని గట్టిగా కేకలు వేసి పిలుస్తాడు. మహని చూసిన మాధవ్ ఒక్కసారిగా సంతోషంతో ఉప్పొంగి పోతాడు.. మహాలక్ష్మి మళ్ళీ రావడం చూసి మా మహాలక్ష్మి వచ్చేసావా అని అంటారు.. ఇంట్లో ఏంటి ఇలా ఉంది పెద్ది అని అంటుంది.. ఒకవైపు జ్వరం వచ్చి వాడు బాధపడుతుంటే ఇల్లంతా ఏంది ఇంత చండాలంగా ఉంది నేను వీడిని తీసుకుని వెనకాల కూర్చుంటాను వెంటనే ఇల్లంతా క్లీన్ గా ఉండాలి అని ఆర్డర్ వేస్తుంది.. అది విన్న నారాయణ శివంగి ఆన్ డ్యూటీ అంటూ అంటాడు..
మహాలక్ష్మి ఇంట్లోకి రాగానే పెద్ది నాకు ఒక టీ పెట్టిస్తారా హాస్టల్ లో టీ చండాలంగా ఉంది.. దానివల్లే టీ తాగడమే మానేశాను.. మీ చేతికి టీ టెస్ట్ ఎక్కడ రాదు. అని మహా అంటుంది.. అయ్యో క్షమించు అమ్మ నువ్వు వస్తున్నావని ముందే తెలిస్తే నేను నీకోసం టిఫిన్ చేసి పెట్టే వాడిని కదా అని మాధవ్ అంటాడు.. టిఫిన్ ఏమి వద్దు పెద్ది? నాకు ఒక టీ చాలు.. మహాలక్ష్మి టీ తాగిన తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. ఇక నేను వెళ్ళొస్తాను అని అనగానే అందరూ మహాలక్ష్మి వెళ్ళిపోతుందని బాధ పడిపోతుంటారు.. చక్రి మీరు ఇక్కడే ఉండండి నన్ను క్షమించండి అని ఎంతగా బ్రతికిలాడినా కూడా నీ కూతురు మహాలక్ష్మి నేను వెళ్తాను అని చెప్పకుండానే బయటకు వచ్చేస్తుంది.. నిజంగానే వెళ్ళిపోతుందని అందరూ అనుకుంటారు అయితే కన్నా మాత్రం వదిన మీతో బయటికి వెళ్లాలని ఉంది అని ప్రేమగా అడగడంతో ఒక మహాలక్ష్మి ఒప్పుకుంటుంది.
మహాలక్ష్మి కన్నాతో కలిసి గుడికి వెళుతుందని చక్రి కూడా అక్కడికి వెళ్లాలని అనుకుంటాడు.. అయితే చక్రి ముందుగానే గుడికి వెళ్లడంతో అక్కడికి వెళ్లిన మహాలక్ష్మి కన్నా ఇద్దరు కూడా షాక్ అవుతారు. దారిలో వాళ్ళందరూ కూడా మీ వదిన వెళ్ళిపోయింది కదా మళ్లీ ఎందుకు వచ్చింది అని అనడంతో మహాలక్ష్మి ఏంట్రా ఇది నేను వెళ్ళిపోయిన విషయం అందరికీ ఎలా తెలిసింది అని అంటుంది.. ఊర్లో వాళ్ళందరూ అంతే వదిన మీరేమి పట్టించుకోకండి అని కన్నా అంటాడు. ఇక చక్రి మహాలక్ష్మి వాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి అని ఎంతగా అడుగుతున్న సరే మహా మాత్రం ఆలోచిస్తాను అని అంటుంది.. చేతిలో కర్పూరం పెట్టి వెలిగించి ఈ కర్పూరాన్ని ఎంతసేపు వెలిగించుకుంటారో చూద్దాం అప్పుడు నేను ఆ ఇంట్లో ఉండాలా వద్దా అని ఆలోచిస్తానని మహాలక్ష్మి అంటుంది.. కానీ చక్రి చెయ్యి కాలడంతో ఆ కర్పూర అన్ని కింద పడేస్తాడు.. మీరు ఆ ఇంట్లోంచి వెళ్లిపోతే నేనప్పుడు ఆలోచిస్తాను అని మహాలక్ష్మి అనడంతో చక్రి బాధపడతాడు..
గుడిలో కన్నా మహాలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా తాయారు అక్కడికి ఇస్తుంది.. తాయారు మహాలక్ష్మిని చూసి ఏమ్మా నాని కోడలా బాగున్నావా అని వెటకారంగా మాట్లాడుతుంది.. నువ్వు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయావంట కదా ఇన్నాళ్ళకి మంచి పని చేశావు అని తాయారు మహాలక్ష్మి పై ప్రశంసలు కురిపిస్తుంది. ఆ ఇంట్లో పుట్టి పెరిగిన నాకు ఆ ఇంట్లో మనుషులు వాళ్ల మనస్తత్వాలు బాగా తెలుసు. నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఆ ఇంట్లోంచి వెళ్లిపోయావు ఇక మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టదు అని తయారు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.. తాయరు మాటలు విన్న కన్నా మహాలక్ష్మి ఇద్దరు కూడా బాధపడతారు..
నేను ఇంట్లోంచి వెళ్లిపోయి తప్పు చేశాను కన్నా అని మహాలక్ష్మి అంటుంది.. మీరేం తప్పు చేయలేదు వదిన మా ఇంటికి ఒక శాపం ఉంది.. నలుగురు మగాళ్లు ఉన్న ఆ ఇంట్లో ఒక ఆడది ఎలా ఉంటుంది అని అందరూ అనుకునేవారు.. మీరు రావడంతో ఆ ఇంటికి శాపం పోయింది అని నేను అనుకున్నాను. అయితే ఇప్పుడు మీరు వెళ్లిపోయారు కదా మా ఇంట్లో అందరికీ పెళ్లిళ్లు అయి వదినలు వస్తారన్న నా ఆశ ఆశగానే ఉండిపోతుందేమో అని కన్నా బాధపడతాడు.. మహాలక్ష్మి తాయారు మాట విని తప్పు చేశాను అని అనుకుంటుంది.. మహాలక్ష్మి ఆఫీస్ కి వెళ్ళగానే అక్కడ ఉన్న కుమారు తనని ఘోరంగా తిడతాడు.. ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నావా ఆఫీస్ ఒక పని సరిగ్గా చేయలేవు అంటూ దారుణంగా తిడతాడు.. విక్కీ ఎంట్రీ ఇవ్వడంతో కుమార్ షాక్ అవుతాడు.. విక్కీ మహాలక్ష్మిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో మహా కూడా పాజిటివ్ గా అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…